HYDRA: హైడ్రాకు సూపర్ పవర్స్.. ఇక అన్ని కూల్చుడే..

HYDRA: హైడ్రా పేరు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో వినిపిస్తున్న పేరు.  అక్రమ కబ్జాకోరుల పాలిట హైడ్రా సింహ స్వప్నంలా మారింది. ఈ నేపథ్యంలో హైడ్రాకు సూపర్ పవర్స్ ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Aug 25, 2024, 11:04 AM IST
HYDRA: హైడ్రాకు సూపర్ పవర్స్.. ఇక అన్ని కూల్చుడే..

HYDRA:హైడ్రా (హైదరాబాద్  డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అస్సెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్) ప్రస్తుతం హైదరాబాద్ సహా తెలంగాణలో మారు మోగుతున్న పేరు. నగరంలో చెరువులు, కుంటలున్న పరిధిలో అక్రమంగా కట్టిన కట్టడాలను కూల్చి వేసే పనిలో పడింది. అంతేకాదు అక్రమ కబ్జా కోరుల పాలిట సింహ స్వప్నంలా మారింది హైడ్రా. ఈ నేపథ్యంలో హైడ్రాను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు హైడ్రాకు ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్ స్టేటస్ కల్పించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది.

పోలీస్ స్టేషన్ స్టేటస్‌తో.. నేరుగా హైడ్రానే FIR నమోదు చేసే వెసులుబాటు కల్పిస్తున్నట్లు సమాచారం. దీనిపై ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలుబడనున్నాయి. చెరువులను ఆక్రమించిన కట్టడాలపై ఇప్పటికే హైడ్రా పంజా విసురుతోంది. నగరంలో కబ్జా చేసి కట్టిన నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. హైడ్రాను పూర్తిస్థాయిలో బలోపేతం చేస్తే అక్రమ కట్టడాలకు చెక్‌ పెట్టొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. తాజాగా హైదరాబాద్ లోని హైటెక్ సిటీ తుమ్మటి కుంట చెరువును ఆక్రమించి నాగార్జున తన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించినట్టు ఆధారాలు ఉండటంతో హైడ్రా నిన్న ఉదయమో ఎన్ కన్వెన్షన్ లోని ఎఫ్ టీఎల్ పరిధిలో ఉన్న ఎన్ కన్వెన్షన్ కు సంబంధించిన అక్రమ నిర్మాణాలు కూల్చి సంచలనం రేపింది.

ప్రస్తుతం చెరువుల్లో కట్టిన అక్రమ నిర్మాణాలపై హైడ్రా చూపిస్తున్న దూకుడు.. చివరకు వరకు కంటిన్యూ చేస్తుందా.. లేదా అనేది చూడాలి. తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తమకు అనుకూలంగా లేని రాజకీయ ప్రత్యర్థులు, రియల్టర్లను భయపెట్టేందుకే హైడ్రాతో కలిసి ఈ హై డ్రామాకు తెరలేపిందనే ముచ్చట ప్రతిపక్షాల నుంచి వినిపిస్తోంది.  మరోవైపు ప్రభుత్వం ప్రకటించిన ఋణ మాఫీ పూర్తి స్థాయిలో కాకుండా పరిమితంగా చేయడంపై విమర్శలు వస్తున్నాయి. వాటి నుంచి దృష్టి మరలించడానికే రేవంత్ రెడ్డి హైడ్రాను రంగంలోకి దింపినట్టు తెలుస్తుంది.

అంతేకాదు రేవంత్ రెడ్డి  దమ్ము ఉంటే.. తమ పార్టీకి చెందిన నేతల అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష పార్టీలు సవాల్ విసురుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ సహా తెలంగాణలో అక్రమ కట్టడాలపై తుది వరకు రేవంత్ రెడ్డి ఇదే దూకుడును కంటిన్యూ చేస్తారా ? లేకపోతే.. మధ్యలో మిడిల్ డ్రాప్ అవుతారా అనేది చూడాలి.

ఇదీ చదవండి:  చిరంజీవిని మెగాస్టార్ ను చేసిన టాప్ మూవీస్ ఇవే..

ఇదీ చదవండి: ‘భోళా శంకర్’సహా చిరు కెరీర్ లో రాడ్ రంబోలా మూవీస్ ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News