Revanth Reddy, Jagga Reddy, Uttam kumar Reddy arrest: రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి అరెస్ట్‌

ఉత్తర్‌ప్రదేశ్‌లో హత్రాస్ కేసు బాధితురాలి కుటుంబాన్ని ( Hathras case victim's family ) పరామర్శించేందుకు వెళ్తున్న రాహుల్‌గాంధీని యూపీ పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసిన ( Rahul Gandhi's arrest ) తీరుపై నిరసన వ్యక్తంచేస్తూ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ( Jaggareddy arrest ) అక్కడి జాతీయ రహదారిపై గురువారం రాత్రి ధర్నాకు దిగారు. 

Last Updated : Oct 2, 2020, 02:43 AM IST
Revanth Reddy, Jagga Reddy, Uttam kumar Reddy arrest: రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి అరెస్ట్‌

Protests against Hathras case and Rahul Gandhi's arrest: సంగారెడ్డి: ఉత్తర్‌ప్రదేశ్‌లో హత్రాస్ కేసు బాధితురాలి కుటుంబాన్ని ( Hathras case victim's family ) పరామర్శించేందుకు వెళ్తున్న రాహుల్‌గాంధీని యూపీ పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేసిన ( Rahul Gandhi's arrest ) తీరుపై నిరసన వ్యక్తంచేస్తూ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ( Jaggareddy arrest ) అక్కడి జాతీయ రహదారిపై గురువారం రాత్రి ధర్నాకు దిగారు. జగ్గారెడ్డి నేతృత్వంలో భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్న కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆయనకు మద్దతుగా రాస్తారోకో దిగడంతో హైదరాబాద్‌-ముంబై జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో ధర్నా స్థలికి చేరుకున్న సంగారెడ్డి పోలీసులు.. జగ్గారెడ్డికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ జగ్గారెడ్డి శాంతించకపోవడంతో ఆయనతో పాటు ఆయనకు మద్దతుగా బైఠాయించిన కాంగ్రెస్‌ కార్యకర్తలను అరెస్ట్‌ చేశారు. Also read : Hathras case: హత్రాస్ యువతిపై అత్యాచారం జరగలేదు: యూపీ పోలీసులు

జాతీయ రహదారిపై ధర్నాకు దిగిన సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. యూపీ పోలీసులు ( UP police ) రాహుల్‌గాంధీ పట్ల చాలా అమర్యాదగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మోదీ ప్రభుత్వం నియంతృత్వ పోకడలను అవలంబిస్తోందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జగ్గారెడ్డి సతీమణి, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి ( Nirmala Jagga Reddy ), ఇతర మహిళా కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.

కేంద్రంపై విరుచుకుపడిన జగ్గారెడ్డి :
ధర్నాలో కూర్చోవడానికంటే ముందుగా జగ్గా రెడ్డి తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ కేంద్రంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్రం తీసుకొచ్చిన రైతు బిల్లుతో ( Farmers bill ) రైతులకు నష్టమే కానీ ఏమీ లాభం లేదని అన్నారు. కేవలం కార్పొరేట్లను, దళారీలకు మేలు చేసేందుకే కేంద్రం ఈ రైతు బిల్లును తీసుకొచ్చిందని ఆరోపించారు. Also read : 
Hathras Case: రాహుల్ గాంధీ అరెస్ట్.. లాఠీఛార్జ్

కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్‌తో కాంగ్రెస్ పార్టీ ఈ నెల 2 నుంచి 31 వరకు ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్టు జగ్గారెడ్డి తెలిపారు. అందులో భాగంగానే అక్టోబర్ 2న శుక్రవారం సంగారెడ్డిలో నిర్వహించే నిరసన దీక్షకు ( Protests against farm bills ) పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మణిక్కం ఠాగూర్‌ ( Manikkam Thakur ), పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్ రెడ్డి ( Uttam Kumar Reddy ) హాజరు కానున్ననట్టు పేర్కొన్నారు. కేంద్రంలో రైతులకు వ్యతిరేకంగా వెళ్తున్న బీజేపి, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీల వైఖరికి వ్యతిరేకంగానే కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు చేపట్టనున్నట్టు జగ్గారెడ్డి మీడియాకు తెలిపారు.

ఇదిలావుంటే, మరోవైపు హత్రాస్ ఘటనతో పాటు రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) పట్ల ఉత్తర్ ప్రదేశ్‌లోని బీజేపీ సర్కార్ అవలంభించిన తీరుపై నిరసన వ్యక్తంచేస్తూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర బీజేపి కార్యాలయాన్ని ముట్టడించారు. రేవంత్ రెడ్డి రాక గురించి సమాచారం అందుకున్న బీజేపి శ్రేణులు కూడా అక్కడికి చేరుకోవడంతో కాంగ్రెస్, బీజేపి నేతల మధ్య వాగ్వీవాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. అక్కడికి చేరుకున్న పోలీసులు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి గోషామహల్ స్టేడియంకు తరలించారు. Also read : Hathras gang rape case: హత్రాస్ గ్యాంగ్ రేప్ కేసులో కొత్త ట్విస్ట్.. హత్రాస్ ఎస్పీ సంచలన వ్యాఖ్యలు

మరో ఘటనలో తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని ( Uttam Kumar Reddy arrest ) సైతం పోలీసులు అరెస్ట్ చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News