KTR on PM Modi: మోనార్క్‌ పాలనలో వంట గదుల్లో మంటలు..మోదీ పాలనపై కేటీఆర్ ఫైర్..!

KTR on PM Modi: బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. గ్యాస్ సిలిండర్ ధర పెంపుపై ఇరుపార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. తాజాగా మరోసారి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. 

Written by - Alla Swamy | Last Updated : Jul 7, 2022, 04:38 PM IST
  • బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం
  • గ్యాస్ సిలిండర్ ధర పెంపుపై వార్
  • మండిపడ్డ మంత్రి కేటీఆర్
KTR on PM Modi: మోనార్క్‌ పాలనలో వంట గదుల్లో మంటలు..మోదీ పాలనపై కేటీఆర్ ఫైర్..!

KTR on PM Modi: గ్యాస్‌ సిలిండర్ ధరను కేంద్ర ప్రభుత్వం అడ్డగోలుగా పెంచుతోందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. గడియకోసారి పెరుగుతున్న బండ ధరతో దేశ ప్రజల గుండెల్లో దడ పుడుతోందన్నారు. మోదీ పాలనలో వంట గదుల్లో మంటలు వస్తున్నాయని మండిపడ్డారు. మోనార్క్‌ మోదీ రాజ్యంలో కుటుంబ బడ్జెట్‌లు తలకిందులు అవుతున్నాయని..సామాన్య ప్రజలు అప్పుల పాలు అవుతున్నారన్నారు కేటీఆర్.

నిత్యావసర ధరలను పెంచి దేశ ప్రజలపై బీజేపీ ప్రభుత్వం దొంగ దాడి చేస్తోందని ఫైర్ అయ్యారు. ద్రవ్యోల్భణాన్ని కట్టడి చేయలేకపోతున్నారన్నారు. గ్యాస్ బండ ధరల పెంపు ఆందోళన చేపడుతున్న టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ అసమర్థ పాలనపై నిరంతర పోరు చేస్తామని స్పష్టం చేశారు. మోదీ 8 ఏళ్ల పాలనలో సుమారు 170 శాతం ధరలను పెంచారని తెలిపారు. 

గ్యాస్‌ను అత్యధిక ధరకు అమ్ముతున్న ప్రభుత్వంగా ప్రపంచ రికార్డు సృష్టిస్తుందని విమర్శించారు కేటీఆర్. తాజాగా రూ.50 పెంచడంతో ఈఏడాదిలో రూ.244 పెంచారని మండిపడ్డారు. 2014లో రూ.410 ఉన్న గ్యాస్ ధర 2022 నాటికి వెయ్యి దాటి పోయిందన్నారు. పెట్రో ధరలు సైతం భారీగా పెంచిన ఘనత బీజేపీ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పారు. ఉజ్వల పథకం పేరుతో తమకు గ్యాస్ సిలిండర్‌లను అంటగట్టారని ఫైర్ అయ్యారు. తక్షణమే గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.

Also read:Marriages of Politicians: రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకున్న రాజకీయ నాయకులు వీరే..!

Also read:Rain Alert: దేశవ్యాప్తంగా కుండపోత వర్షాలు..లెటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య,     ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter, Facebook

Trending News