భర్తతో విభేదాలు.. మూడేళ్ల చిన్నారిని చంపిన తల్లి

భర్తతో గొడవ ..కొడుకును చంపిన తల్లి

Updated: Oct 8, 2018, 12:36 PM IST
భర్తతో విభేదాలు.. మూడేళ్ల చిన్నారిని చంపిన తల్లి

భర్తపై కోపంతో కన్న కొడుకునే చంపేసింది ఓ తల్లి. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని మాదన్నపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.  

వివరాల్లోకి వెళ్ళినట్లయితే.. మాదన్నపేట్‌లో గత కొన్నేళ్లుగా నివాసముంటున్న దంపతులకు నలుగురు సంతానం (ముగ్గురు ఆడపిల్లలు, ఓ కొడుకు).  గత కొంత కాలంగా భర్తకు తన చెల్లి వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో భార్య తరచూ గొడవపడేది. ఈ నేపథ్యంలోనే భర్తపై కోపంతో మూడేళ్ల కొడుకును తల్లి నీటి సంపులో పడేసి హత్య చేసిందని తండ్రి ఆరోపించాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని చిన్నారి మృతికి గల కారణాలను విచారిస్తున్నారు. చిన్నారి హత్యకు తల్లిదండ్రుల గొడవలే కారణమని పలువురు అనుమానిస్తున్నారు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడి మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.