Nagarjuna Sagar: నాగార్జున సాగర్ కు పెరిగిన వరద ఉదృతి..

Nagarjuna Sagar: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. పై నుంచి వరద ప్రవాహం వస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టు 8 గేట్లను ఎత్తారు.  

Written by - TA Kiran Kumar | Last Updated : Oct 19, 2024, 12:00 PM IST
Nagarjuna Sagar: నాగార్జున సాగర్ కు పెరిగిన వరద ఉదృతి..

Nagarjuna Sagar: నాగార్జున సాగర్  ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షాలతో మరోసారి నాగార్జున సాగర్ కు వరద పోటెత్తింది. ఒక్కో గేటును  అడుగుల మేర ఎత్తిని నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. 64,800 క్యూసెక్కుల వరద నీటిని ప్రాజెక్టు అధికారులు దిగువకు పంపిస్తున్నారు.

నాగార్జున సాగర్ జలాశయానికి 1,08,912  లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 590 అడుగులకు చేరింది.

పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలుగా నమోదైంది. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. ఈ నేపథ్యంలోనే దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఈ సుందర దృశ్యాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వచ్చారు. ఈ సీజన్ లో కురిసిన భారీ వర్షాలకు ముందుగా నాగార్జున సాగర్ ఎగువ ప్రాజెక్టులైనా జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి.

ఇదీ చదవండి:  Highest-paid villains: సైఫ్, బాబీ దేవోల్ సహా మన దేశంలో ఎక్కువ రెమ్యునరేష్ తీసుకుంటున్న క్రేజీ విలన్స్ వీళ్లే..

ఇదీ చదవండి:  Tollywood Celebrities Guinnis Records: చిరంజీవి కంటే ముందు గిన్నీస్ బుక్ లోకి ఎక్కిన తెలుగు చిత్ర ప్రముఖులు వీళ్లే..

ఆ తర్వాత వచ్చిన శ్రీశైలం గేట్లు ఎత్తడంతో నాగార్జున సాగర్ మెల్లగా నిండింది. అంతేకాదు పూర్తి స్థాయి నీటి మట్టం నిండటంతో ఆ దిగువ ఉన్న పులి చింతలకు నీటిని విడుదల చేసారు. మొత్తంగా దాదాపు 7 యేళ్ల తర్వాత నాగార్జున సాగర్ డ్యామ్ నిండింది. తాజాగా ఇపుడు ఏపీ సహా ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాలకు సాగర్ కు వరద పోటెత్తుతుంది.

ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..

ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

 

Trending News