తెలంగాణ ఎన్నికలు: కోదాడ నుండి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న హాస్యనటుడు వేణుమాధవ్ ..!

టాలీవుడ్ హాస్యనటుడు వేణుమాధవ్ సూర్యాపేట జిల్లా కోదాడ నుండి స్వతంత్ర అభ్యర్థిగా తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

Last Updated : Nov 19, 2018, 12:55 PM IST
తెలంగాణ ఎన్నికలు: కోదాడ నుండి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న హాస్యనటుడు వేణుమాధవ్ ..!

టాలీవుడ్ హాస్యనటుడు వేణుమాధవ్ సూర్యాపేట జిల్లా కోదాడ నుండి స్వతంత్ర అభ్యర్థిగా తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈ రోజే ఆయన తాసీల్దారు కార్యాలయంలో నామినేషన్ పేపర్లు అందించారు. మూడు రోజుల క్రితం నామినేషన్ వేయడానికి వేణుమాధవ్ వచ్చినా.. తగిన పత్రాలు లేకపోవడంతో అధికారులు నామినేషన్ స్వీకరించలేదు. అందుచేత.. ఈ రోజు మళ్లీ అవసరమైన పత్రాలు తీసుకొని వచ్చి  వేణుమాధవ్ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సబ్మిట్ చేసి నామినేషన్ వేశారు. తన స్నేహితులు, మద్దతుదారులతో కలిసి వచ్చిన ఆయన నామినేషన్ దాఖలు చేశారు.

కోదాడ తన స్వస్థలం కాబట్టి.. తాను ఈ ప్రాంతం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు వేణుమాధవ్  మీడియాకి తెలిపారు. వేణుమాధవ్ గతంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా క్రియాశీలకంగా పనిచేసిన సంగతి తెలిసిందే. అలాగే తాను స్వర్గీయ ఎన్టీఆర్ పార్టీ ఆఫీసులో కూడా పనిచేశానని వేణుమాధవ్ పలు ఇంటర్వ్యూలలో తెలిపారు.  సినీ రంగంలోకి రాక ముందు వేణుమాధవ్ మిమిక్రీ ఆర్టిస్టుగా కూడా సుపరిచితులు. 

"సంప్రదాయం" చిత్రంతో తెలుగుతెరకు హాస్యనటుడిగా పరిచయమైన వేణుమాధవ్.. తొలిప్రేమ, సై, లక్ష్మీ, దిల్, ఆర్య 2, ఏక్ నిరంజన్, సీమశాస్త్రి, దేశముదురు లాంటి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నారు. హంగామా, భూకైలాస్,  ప్రేమాభిషేకం చిత్రాలలో  హీరోగా కూడా నటించారు. 2006లో "లక్ష్మీ" చిత్రంలో నటనకు గాను ఉత్తమ హాస్యనటుడిగా నంది అవార్డు కూడా వేణుమాధవ్ గెలుచుకున్నారు. అలాగే పలు టీవీ ఛానల్స్‌‌లో వ్యాఖ్యాతగా, యాంకర్‌గా కూడా  వేణుమాధవ్ రాణించారు. 

Trending News