ACB Raid: ప్లీజ్ వదిలేయండి... అడ్డంగా దొరికిపోయి కన్నీళ్లు పెట్టుకున్న అధికారిణి.. వీడియో వైరల్..

Hyderabad: తెలంగాణ గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ లో ఒక అధికారిణి లంచం తీసుకుంటు అడ్డంగా బుక్కైంది. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌ గా పనిచేస్తున్న కె జగజ్యోతి  ఒక ఫైల్ పై సంతాకాలు చేయడం కోసం ఒక వ్యక్తిని లంచం డిమాండ్ చేసింది. దీంతో అతగాడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. 

Last Updated : Feb 20, 2024, 12:23 PM IST
  • - ఏసీబీ అధికారులకు దొరికిపోయిన ట్రైబల్ అధికారిణి..
    - సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఘటన..
ACB Raid: ప్లీజ్ వదిలేయండి... అడ్డంగా దొరికిపోయి కన్నీళ్లు పెట్టుకున్న అధికారిణి.. వీడియో వైరల్..

ACB Raids on Tribal Welfare Department: ప్రభుత్వంలో కొలువు సాధించాలంటే ఎంతో కష్టపడాలి. దీనికోసం పగలనక,  రాత్రనక ఎంతో కష్టపడి చదువుతుంటారు. తమ  వ్యక్తి గత జీవితాన్ని త్యాగం చేసి మరీ ప్రభుత్వ ఉద్యోగమే టార్గెట్ కష్టపడి చదువుతుంటారు. చివరకు కష్టపడ్డ వారిలో కొందరికి మాత్రమే సర్కారు కొలువు వస్తుంది. అయితే.. ఇలాంటి ఉద్యోగంలో చేరాక కొందరు ప్రజలకు  మంచి సర్వీసు అందిస్తారు.  మరికొందరు మాత్రం.. తాముచేయాల్సిన పనులు చేకుండా వేధిస్తు, ప్రజలను లంచం ఇవ్వాలని ఇబ్బందులకు గురిచేస్తుంటారు.  

 

కొందరు అధికారులు ఇలాంటి ఘటనలకు పాల్పడిన, అందరికి ఇలాంటి వారే అన్న చెడ్డపేరు  వస్తుంది. కొంతమంది ప్రభుత్వ అధికారులు పనులు పనులు పనులు చేయడానికి లంచంకోసం డిమాండ్ చేస్తుంటారు. ఈ క్రమంలో అమాయక బాధితులు ఇస్తుంటారు. కానీ మరికొందరు బాధితులు మాత్రం ఏసీబీ  అధికారులను ఆశ్రయిస్తుంటారు. అచ్చం ఇలాంటి ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది. 

తెలంగాణ గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌ను లంచం తీసుకుంటు తన ఆఫీసులో అడ్డంగా దొరికిపోయారు. ఈ ఘటన తీవ్ర కలకలంగా మారింది.  సోమవారం 84,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. అవినీతి నిరోధక బ్యూరో (ఎసిబి) ప్రకారం...  కె జగజ్యోతి అధికారికంగా ఫైల్ మూవ్ కావడానికి..  లంచం అడిగారని ఆరోపించిన వ్యక్తి నుండి వచ్చిన ఫిర్యాదు మేరకు అరెస్టు జరిగిందని  తెలిపారు.  ఏసీబీ శరవేగంగా ఆపరేషన్ నిర్వహించి నిర్ణీత మొత్తాన్ని అందజేసే క్రమంలో సదరు అధికారిని పట్టుకుందన్నారు.  

 ఈ క్రమంలో.. కె జగజ్యోతి, ఫినాల్ఫ్తలీన్ పరీక్ష చేయించుకున్నారు.  ఆమె కుడి చేతి వేళ్లు పాజిటివ్ అని తేలింది. ఫినాల్ఫ్తలీన్ అనే రసాయన సమ్మేళనం విచ్ఛిన్నమైనప్పుడు, అది గులాబీ రంగులోకి మారుతుంది.  ఇది లంచం గ్రహీతలను పట్టుకోవడంలో విలువైన సాధనంగా మారింది. ఎవరైనా గుర్తించబడిన బిల్లులు లేదా డాక్యుమెంట్‌లను హ్యాండిల్ చేసినప్పుడు, సొల్యూషన్ జాడలు వారి చేతులకు అంటుకుంటాయి.  

ఆ తర్వాత టెస్టు చేశాక..గులాబీ రంగు కనిపిస్తుంది. అనధికారిక ప్రయోజనం పొందాలనే లక్ష్యంతో కె జగజ్యోతి విధుల నిర్వహణలో అనుచితంగా, నిజాయితీగా వ్యవహరించారని ఏసీబీ పేర్కొంది. అడ్డంగా దొరికిపోయాక అధికారిణి ఏడుస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read More: Anushka: అనుష్క-క్రిష్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఇవే.. డిఫరెంట్ టైటిల్ తో రానున్న దర్శకుడు..

ఈ వీడియోలో అధికారిని.. తప్పయిపోయింది.. వదిలేయాలంటూ ఆమె ప్రాధేయ పడుతుండం కన్పిస్తుంది.  కె జగజ్యోతి పట్టుబడి ఏడుస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం..  కస్టడీలో ఉన్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌ను హైదరాబాద్‌లోని కోర్టులో హాజరుపరచనున్నట్లు సమాచారం. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News