Minister Talasani: సరికొత్త ప్రణాళికలతో నాలాలను అభివృద్ధి చేస్తున్నాం: మంత్రి తలసాని..!

Minister Talasani: హైదరాబాద్‌లో నాలా అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. పనులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

Written by - Alla Swamy | Last Updated : Sep 2, 2022, 06:22 PM IST
  • నాలా అభివృద్ధి పనులు ముమ్మరం
  • పరిశీలించిన మంత్రి తలసాని
  • త్వరలో మరికొన్ని చోట్ల పనులు
Minister Talasani: సరికొత్త ప్రణాళికలతో నాలాలను అభివృద్ధి చేస్తున్నాం: మంత్రి తలసాని..!

Minister Talasani: వరద ముంపు సమస్యను సమగ్ర నాలా అభివృద్ధి కార్యక్రమం(SNDP)తో శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. రూ.45 కోట్లతో బేగంపేట నాలా అభివృద్ధి పనులను చేపట్టారు. బ్రాహ్మణవాడిలో జరుగుతున్న పనులను మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ పరిశీలించారు. ఎస్‌ఎన్‌డీపీ పికెట్‌ నాలాపై రూ.10 కోట్ల వ్యయంతో బ్రిడ్జి నిర్మాణం జరుగుతోంది. ఆయన వెంట ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, జీహెచ్‌ఎంసీ కమిషన్ లోకేష్‌కుమార్‌తో పాటు పలువురు ఉన్నారు. 

నాలాలో పూడిక తొలగింపు పనులను త్వరతిగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నాలాకు ఇరువైపుల చేపట్టిన రిటైనింగ్ వాల్స్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు. నాలా పరిసరాల్లోని అన్ని కాలనీల్లో సీవరేజ్, స్ట్రాం వాటర్ లైన్‌తోపాటు రోడ్ల నిర్మాణం చేపట్టాలన్నారు మంత్రి తలసాని. ఈసందర్భంగా స్థానికులు తమ సమస్యలను నేతల దృష్టికి తీసుకొచ్చారు. ఇకపై ఇళ్లల్లోకి వరద నీరు రాకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. 

50 ఏళ్లుగా ఉన్న సమస్యను మంత్రి కేటీఆర్ చొరవతో పరిష్కారం దొరికిందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్. నాలా సమస్యను తీర్చేందుకు సమగ్ర నాలా అభివృద్ధి కార్యక్రమం(SNDP) తీసుకొచ్చామని స్పష్టం చేశారు. వరద నీటిలో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నా..గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని..ఆక్రమణలు జరిగినా చొరవ తీసుకోలేదని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక నాలాలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు.

SNDP ద్వారా నగరంలోని అన్ని నాలాలను అభివృద్ధి చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. అభివృద్ధి పనుల్లో భాగంగా నాలాలపై ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నామని స్పష్టం చేశారు. ఆక్రమణల తొలగింపుతో నిరాశ్రయులు అయ్యే వారిని ప్రభుత్వమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుందన్నారు. పికెట్ నాలాపై చేపట్టిన బ్రిడ్జి నిర్మాణ పనులు ఓ వైపు పూర్తి అయ్యాయని..అక్కడ రాకపోకలు సాగుతున్నాయని చెప్పారు. 

మరో 15 రోజుల్లో నిర్మాణ పనులన్నీ పూర్తి అవుతాయన్నారు. బ్రిడ్జి నిర్మాణంతో వరద ముంపు ప్రాంతాల సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు. రసూల్ పురా బస్తీ, అన్నానగర్, బీహెచ్‌ఈఎల్ కాలనీ, ఇక్రిశాట్ కాలనీ, సౌజన్య కాలనీ, బోయిన్‌పల్లిలో సాధారణ పరిస్థితి కనిపించనుందన్నారు మంత్రి. బేగంపేట నాలా అభివృద్ధి పనులు మరో ఆరు నెలల్లో పూర్తి అవుతాయని వెల్లడించారు. మరికొన్ని ప్రాంతాల్లో శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. 

Also read:Asia Cup 2022: ఖాళీ సమయంలో తెగ ఎంజాయ్‌ చేస్తున్న టీమిండియా ఆటగాళ్లు..వీడియో వైరల్..!

Also read:Minister Ktr: వివక్షతోనే బల్క్ డ్రగ్ పార్క్ కేటాయించలేదు..మాండవీయకు మంత్రి కేటీఆర్ లేఖ..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News