Hyderabad: జీతాల కోసం 1400 యానిమేషన్ ఉద్యోగుల పోరాటం

Hyderabad Animations Firm | హైదరాబాద్ లో మరో కంపెనీ ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోంది. యానిమేషన్ కంపెనీ అయిన డిక్యు ఎంటటైన్మెంట్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ కంపెనీ తమ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులకు జీతాలివ్వకపోగా అడిగితే ఉద్యోగం నుంచి తొలగిస్తామని బెదిరిస్తోందని సమాచారం. 

Last Updated : Nov 3, 2020, 11:12 PM IST
    • హైదరాబాద్ లో మరో కంపెనీ ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోంది.
    • యానిమేషన్ కంపెనీ అయిన డిక్యు ఎంటటైన్మెంట్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ కంపెనీ తమ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులకు జీతాలివ్వక పోగా అడిగితే ఉద్యోగం నుంచి తొలగిస్తామని బెదిరిస్తోందని సమాచారం.
Hyderabad: జీతాల కోసం 1400 యానిమేషన్ ఉద్యోగుల పోరాటం

హైదరాబాద్ లో మరో కంపెనీ ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోంది. యానిమేషన్ కంపెనీ అయిన డిక్యు ఎంటటైన్మెంట్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ కంపెనీ తమ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులకు జీతాలివ్వకపోగా అడిగితే ఉద్యోగం నుంచి తొలగిస్తామని బెదిరిస్తోందని సమాచారం. హైదరాబాద్ ( Hyderabad ) నుంచి యానిమేషన్ కార్యకలాపాలు నిర్వహించే ఈ కంపెనీలో సుమారు 1400 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. 

ALSO READ|  Cricket Wonders: వీళ్ల బౌలింగ్ లో ఎవరూ సిక్సర్ కొట్టలేకపోయారు

ఆరు నెలల నుంచి...
కరోనావైరస్ ( Coronavirus ) సంక్రమించకుండా భారత ప్రభుత్వం లాక్ డౌన్ విధించినప్పటి నుంచీ ఈ సంస్థ తన ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదు అని సమాచారం. దీంతో ఈ ఉద్యోగుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. సంస్థ మేనేజింగ్ డైరక్టర్ తపాస్ చక్రవర్తిపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని రాష్ట్ర మానవహక్కుల కమిషన్ లో ఉద్యోగులు ఫిర్యాదు చేశారు.

ALSO READ| Trump Residency: బిజినెస్ ట్రంప్ బ్లెడ్ లోనే ఉంది... ఇల్లు రాజభవనం కన్నా తక్కువేం కాదు

భారీ స్థాయిలో పెండింగ్ జీతాలు
సంస్థలో పనిచేసే ఉద్యోగులకు ఒక్కొక్కరికి 14లక్షలు రావాలని డిక్యు ఎంటటైన్మెంట్ ఉద్యోగులు తెలిపారు. ఇప్పటికే బంజారాహిల్స్ పోలీసుస్టేషన్ లో కూడా ఎండిపై పిర్యాదు చేశారని చేశారని, సదరు సంస్థ ఎండి పాస్ పోర్టు సీజ్ చేసి,అతని పై ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోని తమకు న్యాయం చేయాలని బాధితులు కమిషన్ ను కోరారు.

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News