ఆగిన మరో ఆర్టీసి కార్మికుడి గుండె

ఆగిన మరో ఆర్టీసి కార్మికుడి గుండె

Updated: Nov 6, 2019, 03:40 PM IST
ఆగిన మరో ఆర్టీసి కార్మికుడి గుండె

కరీంనగర్: ఆర్టీసీ కార్మికుడు బాబు మృతి మరువకముందే టిఎస్ఆర్టీసీకి చెందిన మరో కార్మికుడు ఇవాళ గుండెపోటుతో మరణించాడు. మూడు రోజుల క్రితం అస్వస్థతకు గురై ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన కరీం ఖాన్ బుధవారం ఉదయం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. కరీంనగర్ బస్ డిపోలో మెకానిక్‌‌గా పనిచేస్తున్న కరీం ఖాన్‌ మృతి గురించి తెలుసుకున్న తోటి కార్మికులు, పలు రాజకీయ పార్టీల నేతలు... డిపో వద్దకు చేరుకుని ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. 

ఈ సందర్భంగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన నేతలు.. ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వం మొండి వైఖరి కారణంగానే కార్మికులు గుండెపోటుతో చనిపోతున్నారని మండిపడ్డారు. కరీం ఖాన్ మృతికి కారణమైన ప్రభుత్వమే ఆయన కుటుంబానికి అండగా నిలవాలని పలువురు నేతలు డిమాండ్ చేశారు. 
నేటితో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 33వ రోజుకు చేరింది.