Harsha sai: యూట్యూబర్ హర్షసాయికి బిగ్ షాక్.. లుక్ అవుట్ నోటీసులు జారీ.. విదేశాలకు పారిపోకుండా..

Youtuber harsha sai: యూట్యూబర్ హర్షసాయికి పోలీసులు మరో ట్విస్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రెండు వారాల నుంచి హర్షసాయి పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్న విషయం తెలిసిందే.

Written by - Inamdar Paresh | Last Updated : Oct 5, 2024, 05:24 PM IST
  • యూట్యూబర్ కేసులో మరో ట్విస్ట్..
  • కీలక నిర్ణయం తీసుకున్న హైదరాబాద్ పోలీసులు..
Harsha sai: యూట్యూబర్ హర్షసాయికి బిగ్ షాక్.. లుక్ అవుట్ నోటీసులు జారీ.. విదేశాలకు పారిపోకుండా..

Cyberabad crime police issue look out notice against harsha sai: యూట్యూబర్  హర్షసాయి వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బిగ్ బాస్ ఫెమ్ అయిన ఒక నటి.. హర్షసాయి తనకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేసినట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా.. తన వద్ద నుంచి రెండు కోట్లు తీసుకుని  కూడా మోసం చేశాడని యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై రెండు వారాలుగా అతను తప్పించుకుని తిరుగుతున్నాడు. మరోవైపు పోలీసులు కూడా అతనిగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో.. హర్షసాయి యూఎస్ కు కూడా వెళ్లిపోయినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో.. హర్షసాయికి పోలీసులు మరో షాక్ ఇచ్చారు. . హర్షసాయి విదేశాలకు పారిపోకుండా ఉండేందుకు.. లుక్ అవుట్ నోటీసులను నార్సింగ్ పోలీసులు  జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే.. హర్షసాయిపై అత్యాచారం కేసు నమోదైన విషయం తెలిసిందే. బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఫేమస్ అయిన నటి.. నార్సింగి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.పెళ్లి చేసుకుంటానని చెప్పి.. మోసం చేశాడని బాధిత నటి.. ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాకుండా.. నగ్న చిత్రాలు, వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తున్నాడంటూ ఫిర్యాదు చేయగా.. ఆమె స్టేట్మెంట్ ను కూడా పోలీసులు రికార్డు చేశారు.  

కేసు నమోదైనప్పటి నుంచి హర్షసాయి పరారీలో ఉన్నాడు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే హర్షసాయి తండ్రి హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని హైకోర్టు కోట్టివేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. మంచి వాడిలా బిల్డప్ ఇస్తూ.. నిరుపేదలకు సహాయం చేసినట్లు అతగాడు ఇచ్చిన బిల్డప్ కి ఎంతో మంది షాక్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఈ ఘటన మాత్రం ఇటీవల సంచలనంగా  మారిందని చెప్పుకొవచ్చు.

 ఇదిలా ఉండగా.. హర్షసాయి వ్యవహారంపై లాయర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హర్షసాయి దేశం వదిలి పెట్టి వెళ్లినట్లు కూడా వార్తలు వస్తున్నాయన్నారు. కానీ అతను సోషల్ మీడియాలో వీడియోలు రిలీజ్ చేస్తు యువతి పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నాడని కూడా కోర్టు వ్యాఖ్యలు చేసింది. మరోవైపు.. హర్షసాయి.. మీడియా సంస్థల మీద కేసులు వేస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.

Read more: Family Digital Card: రేషన్‌, ఆరోగ్యం, పింఛను అన్నింటికీ ఒకటే డిజిటల్‌ కార్డు.. ఎలా పని చేస్తుందంటే?

హైకోర్టు కూడా ఇటీవల యువతి వీడియోలు రిలీజ్ చేయడం, పోస్టులు చేయడం వంటి వాటిపై సీరియస్ అయినట్లు తెలుస్తోంది. బాధిత యువతిని ట్రోలింగ్ చేయడం పట్ల కోర్టు తీవ్రంగా స్పందించింది. ఇదిలా ఉండగా.. ఒక యువతి.. తనకు అన్యాయం జరిగిందని బైటికొచ్చి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. మెగా సినిమా లో ఒక సాంగ్ కోసం వీళ్ళు పరిచయం అయ్యారు. అదే విధంగా.. శ్రీ పిక్చర్స్ ద్వారా ఒక పాట కోసం కలిశారని సమాచారం. ప్రస్తుతం మాత్రం పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేయడం మాత్రం వార్తలలో నిలిచింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter

Trending News