South Africa Corona Variant: ఇటీవలే సౌతాఫ్రికాలో కొత్త కరోనా వేరియంట్ వెలుగుచూసింది. ఇప్పుడా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ యావత్ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. దీంతో ప్రపంచ దేశాలన్నీ అప్రమత్తమయ్యాయి. అనేక దేశాలు సౌతాఫ్రికా ప్రయాణ ఆంక్షలు విధించాయి. సౌతాఫ్రికా నుంచి వచ్చే విమానాల్లో ప్రయాణికులకు విస్తృతంగా పరీక్షలు నిర్వహిస్తున్నాయి. అయితే ఈ విమానాల్లో డజన్ల కొద్దీ కరోనా కేసులు బయటపడుతుండటం మరింత ఆందోళనకు గురిచేస్తోంది.
సౌతాఫ్రికాలో కొత్త వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో నెదర్లాండ్స్ ప్రభుత్వం ఆ దేశం నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించింది. అయితే అప్పటికే దక్షిణాఫ్రికా నుంచి బయల్దేరిన విమానాలను మాత్రం అనుమతిస్తున్నట్లు తెలిపింది. అయితే ఆ ప్రయాణికులకు ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షలు, క్వారంటైన్ తప్పనిసరి చేసింది.
ఈ నేపథ్యంలో శుక్రవారం దక్షిణాఫ్రికా నుంచి రెండు విమానాలు ఆమ్‌స్టర్‌డామ్‌కు చేరుకోగా.. అందులోని ప్రయాణికులకు వైరస్ పరీక్షలు నిర్వహించారు. అందులో 61 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు డచ్ ఆరోగ్య అధికారులు వెల్లడించారు. అయితే వీరికి సోకింది ఒమిక్రాన్ వేరియంటా లేదా అన్నది ఇంకా తెలియరాలేదు. ఇందుకోసం వీరి రక్తనమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపినట్లు అధికారులు తెలిపారు.
ఆమ్‌స్టర్‌డామ్‌లోని షిఫోల్ ఎయిర్‌పోర్టుకు సౌతాఫ్రికా నుంచి వచ్చిన రెండు విమానాల్లో దాదాపు 600 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరందరికీ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు 61 కేసులు బయటపడగా.. ఇంకా కొందరి ఫలితాలు రావాల్సి ఉంది. పాజిటివ్ వచ్చిన ప్రయాణికులను షిఫోల్‌లోని ఐసోలేషన్‌లో ఉంచినట్లు అధికారులు తెలిపారు.
Also Read: Gunman fires on bus: కొసావోలో దారుణం...కదులుతున్న బస్సుపై కాల్పులు.. ముగ్గురు మృతి..
Also Read: New York Emergency: వేగంగా వ్యాపిస్తున్న కరోనా కొత్త వేరియంట్.. న్యూయార్క్ లో ఎమెర్జెన్సీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook