Around 3.2 million children are expected to suffer from acute malnutrition in Afghanistan: అఫ్గానిస్థాన్‌లో మరో సంక్షోభం ముంచుకొస్తోంది. తాలిబాన్ల ఆక్రమణ తర్వాత అక్కడ పరిస్థితులు భయంకరంగా మారాయి. ఇప్పుడు తాలిబన్లను మించిన ఆహార సంక్షోభం (Afghanistan Food crisis) అఫ్గానిస్థాన్ ప్రజలను భయపెడుతోంది.
ఆ దేశంలో చాలా మందికి కనీసం రెండు పూటల సరైన తిండి దొరకడం లేదని పలు నివేదకలు చెబుతున్నాయి. ఇది చిన్న పిల్లలపై తీవ్ర ప్రభావం చూపొచ్చని అంటున్నాయి.
ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే.. ఈ ఏడాది చివరి నాటికి 32 లక్షల మంది చిన్నారులు (Malnutrition effect) పోషకాహార లోపాన్ని ఎదుర్కొంటారని ఆందోళన వ్యక్తం చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. శీతాకాలం ప్రభావంతో అక్కడ ఊష్ణోగ్రతలు మరింతి తగ్గొచ్చని.. ఫలితంగా 10 లక్షల మంది చిన్నారులకు మరణ ముప్పు ఉన్నట్లు తెలిపింది డబ్ల్యూహెచ్ఓ.
Also read: Malala Weds Asser Pics Viral: యాసిర్‌తో నోబుల్ బహుమతి గ్రహీత మలాలా పెళ్లి, ట్రెండ్ అవుతున్న ఫోటోలు
Also read: Covid19 Update: రెండేళ్లలో 25 కోట్లమందికి కరోనా వైరస్, హాట్‌స్పాట్‌లు ఆ దేశాలే
నిండిన ఆస్పత్రులు..
చాలా ప్రాంతాల్లో ఉష్టోగ్రతలు సున్నా, అంతకన్నా తక్కువకు పడిపోతున్నాయని.. ఇది పిల్లల్లో అనేక రోగాలకు దారి తీస్తున్నట్లు డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది.
దేశంలో మీజిల్స్ వ్యాధి (Measles cases in Afghanistan) కూడా కేసులు భారీగా పెరిగిపోతున్నాయని.. ఇప్పటికే దేశవ్యాప్తంగా 24వేల కేసులు నమోదైనట్లు అంచనా వేసింది.
ఇలాంటి వ్యాధులతో స్థానిక ఆస్పత్రులు నిండిపోయాయని.. పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు డబ్లూహెచ్ఓ తెలిపింది. అయితే ఇలాంటి గణాంకాలను వెల్లడించేందుకు తాలిబన్లు సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఈ విషయాలనపై స్వచ్ఛంద సంస్థలు మాత్రమే గణాంకాలను ప్రకటిస్తున్నాయి.
కొవిడ్, కరువు, తాలిబన్లు..
అఫ్గాన్‌లో ఆహార సంక్షోభం గురించి.. ఐక్య రాజ్య సమితి ఫుడ్ రిలీఫ్ ఏజెన్సీ గతంలోనే ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఏడాది ఆగస్టులో ఇందుకు సంబంధించి ఓ నివేదికను కూడా విడుదల చేసింది. అఫ్గాన్‌లో ప్రతి ముగ్గురిలో ఒకరు (దేశవ్యాప్తంగా 1.4 కోట్ల మంది) ఆకలితో అలమటిస్తున్నట్లు తెలిసింది. దాదాపు 20 లక్షల మంది పిల్లలు తీవ్ర పోషకాహార లోపాన్ని ఎదుర్కొంటున్నట్లు తేలింది. వారికి వెంటనే వైద్యం అవసరమని నివేదిక పేర్కొంది. ఇందుకు సహాయం అందించేందుకు ఇతర దేశాలు ముందుకు రావాలని కోరింది.
Also read: Security Council: ఆఫ్ఘనిస్తాన్ సంక్షోభం, సవాళ్లపై ఢిల్లీలో ముగిసిన భద్రతా సదస్సు
Also read: Imran Khan: ఉగ్రవాదులతో చర్చలా అంటూ.. ఇమ్రాన్ ఖాన్‌పై పాకిస్థాన్ సుప్రీం కోర్టు ఆగ్రహం!
తాలిబన్ల ఆక్రమణతో దారుణ పరిస్థితులు..
ప్రస్తుత పరిస్థితులకు కరువు, కరోనా వంటివి కారణం కాగా.. తాలిబన్ల ఆక్రమణతో పరిస్థితి మరింత దిగజారినట్లు వివరించింది నివేదిక.
సహాయం చేసేందుకు తమ వద్ద సరైన ప్రణాళికలు ఉన్నాయని ఫుడ్ రిలీఫ్ ఏజెన్సీ వెల్లడించింది. అయితే.. పొరుగు దేశాలు భారీగా వలసలను అడ్డుకున్నా.. దేశంలో జరిగే ఆహార పంపణీకి ఆపరేషన్‌కు మాత్రం ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని కోరింది యూఎన్.
Also read: Afghanistan: మసీదులో బాంబు పేలుడు.. ముగ్గురి మృతి, 15 మందికిపైగా గాయాలు!
Also read: Xi Jinping Tighten His Grip: చైనా అధ్యక్షుడిగా మరోసారి జిన్ పింగ్కే పగ్గాలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook