AP High Court On Constable Recruitment: కానిస్టేబుల్ అభ్యర్థుల ఎంపికలో హోంగార్డులకు హైకోర్టు నుంచి గుడ్‌న్యూస్ వచ్చింది. హోంగార్డులను ప్రత్యేక కేటగిరిగా పరిగణించాలని ధర్మాసనం తీర్పు వెల్లడించింది. కటాఫ్ మార్కులతో సంబంధం లేకుండా ప్రిలిమ్స్ మెరిట్ ఆధారంగా దేహదారుఢ్య పరీక్షలకు అనుమతించాలని ఆదేశించింది. ఈ మేరకు రిక్రూట్మెంట్ బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది. సాధారణ అభ్యర్థుల మాదిరి ప్రిలిమ్స్‌లో కటాఫ్ మార్కులు నిర్ణయించడంతో.. పలువురు హోంగార్డులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించి కోర్టు.. హోంగార్డు అభ్యర్థులకు అనుకూలంగా తీర్పునిచ్చింది. హైకోర్లు తీర్పు నేపథ్యంలో హోంగార్డులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పోలీసు కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో తమను ప్రత్యేక కేటగిరీగా పరిగణించాలని కోరుతూ.. హోంగార్డులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇతర అభ్యర్థులతో సమానంగా తమకు కటాఫ్ మార్కులు నిర్ణయించడం సరికాదన్నారు. కటాఫ్ మార్కులతో సంబంధం లేకుండా తమను ప్రత్యేక కేటగిరీగా పరిగణించాలని హైకోర్టుకు విన్నవించారు. ఫిజికల్ ఈవెంట్స్‌కు అనుమతించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. హోంగార్డుల తరపున న్యాయవాది జి.శీనకుమార్ వాదనలు వినిపించారు.
ఈ మేరకు విచారణ చేపట్టిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు.. ఇరువైపులా వాదనలు విన్నారు. హోంగార్డు అభ్యర్థులకు అనుకూలంగా తీర్పునిచ్చారు. కటాఫ్ మార్కులతో సంబంధం లేకుండా వారిని ప్రాథమిక రాతపరీక్షలో మెరిట్ ఆధారంగా దేహదారుఢ్య పరీక్షకు అనుమతించాలని ఉత్తర్వులు జారీ చేశారు. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించి.. విచారణను మరో రెండు వారాలకు వాయిదా వేశారు.
రాష్ట్రంలో 6100 పోలీసు కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి గతేడాది నవంబరు 28న నోటిఫికేషన్ విడుదల అయిన విషయం తెలిసిందే. నవంబరు 30 నుంచి జనవరి 7 వరకు దరఖాస్తులు స్వీకరించగా.. జనవరి 22న ప్రాథమిక రాతపరీక్ష నిర్వహించారు. మొత్తం 5,09,579 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 4,58,219 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 95,208 మంది అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షలకు అర్హత సాధించారు. ఫిజికల్ ఈవెంట్లకు అర్హత సాధించిన అభ్యర్థులు కాల్ లెటర్లు మార్చి 1న విడుదల అవ్వగా.. మార్చి 10 వరకు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంది.
Also read: Bandi Sanjay: కవితమ్మా.. ముందు మీ అయ్యను నిలదీయ్.. వాళ్లకు చుక్కలు చూపిస్తాం: బండి సంజయ్
Also read: Global Investors Summit 2023: ఏపీకి పెట్టుబడుల వరద.. భారీగా ఉద్యోగావకాశాలు: సీఎం జగన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook