Amaravati Capital News: 'అమరావతి అంశంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంను ఆశ్రయిస్తాం'!

Amaravati Capital News: ఏపీ మూడు రాజధానుల విషయంలో హైకోర్టును ఇచ్చిన తీర్పుపై తాము సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు రాష్ట్ర హోంమంత్రి సుచరిత స్పష్టం చేశారు. రాజధాని ఎంపిక విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి బాధ్యత ఉందని ఆమె మీడియాకు వెల్లడించారు.    

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 4, 2022, 04:35 PM IST
    • ఏపీ హైకోర్టు తీర్పుపై హోంమంత్రి సుచరిత అభ్యంతరం
    • మూడు రాజధానుల విషయంలో వెనక్కి తగ్గమని వ్యాఖ్య
    • అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని వెల్లడి
Amaravati Capital News: 'అమరావతి అంశంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంను ఆశ్రయిస్తాం'!

Amaravati Capital News: ఆంధ్రప్రదేశ్ లో పాలనా వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానుల ఏర్పాటుపై తాము వెనకడుగు వేయబమని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత స్పష్టం చేశారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వేదికగా మహిళా కమిషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా పార్లమెంట్‌ను సుచరిత ప్రారంభించారు. ఈ సందర్భంగా మూడు రాజధానులపై ఆమె మీడియాతో మాట్లాడారు. 

రాజధాని ఎక్కడ ఉండాలనే నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని మేకతోటి సుచరిత అన్నారు. ఇదే విషయాన్ని గతంలో పలుసార్లు కేంద్రం స్పష్టం చేసిందని ఆమె గుర్తు చేశారు. అయితే అమరావతి రాజధాని అంశంలో ఇటీవలే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించే ఆలోచనలో తమ ప్రభుత్వం ఉన్నట్లు ఏపీ హోంమంత్రి సుచరిత తెలిపారు. 

ఏం జరిగిందంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మూడు రాజధానుల ఏర్పాటు విషయంపై హైకోర్టు గురువారం కీలక తీర్పును వెలువరించింది. సీఆర్డీఏ చట్టానికి పూర్తిగా అధికారాలున్నాయని చెప్పిన ధర్మాసనం.. సీఆర్డీఏ చట్టం ప్రకారం ప్రభుత్వం వ్యవహరించాలని ఆదేశించింది. 

రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన స్థలాలను కేటాయించాలని ఆదేశించింది. అమరావతి రైతులతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 6 నెలల్లో మాస్టర్ ప్లాన్ పూర్తి చేయాలని ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఆధ్వర్యంలోని త్రిసభ్య న్యాయస్థానం తీర్పునిచ్చింది.  

Also Read: AP High Court: రాజధాని విషయంలో ఏపీ హైకోర్టు తీర్పుపై సీఎం జగన్ సమీక్ష, సుప్రీంకోర్టుకు ప్రభుత్వం

Also Read: AP Government: ఏపీ హైకోర్టు తీర్పుపై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News