AP: ఏపీలో ముమ్మరంగా సాగుతున్న వ్యాక్సినేషన్, అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో..

దేశమంతా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. తొలిదశలో ఫ్రంట్‌లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో మందకొడిగా సాగుతుండగా..ఆంధ్రప్రదేశ్ మాత్రం ముందంజలో ఉంది.

Last Updated : Jan 19, 2021, 03:07 PM IST
  • ఆంధ్రప్రదేశ్ లో ముమ్మరంగా కొనసాగుతున్న కోవిడ్ వ్యాక్సినేషన్
  • తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 1023 మందికి వ్యాక్సినేషన్
  • మూడ్రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సిన్ తీసుకున్నవారి సంఖ్య 46 వేల 755
AP: ఏపీలో ముమ్మరంగా సాగుతున్న వ్యాక్సినేషన్, అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో..

దేశమంతా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. తొలిదశలో ఫ్రంట్‌లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో మందకొడిగా సాగుతుండగా..ఆంధ్రప్రదేశ్ మాత్రం ముందంజలో ఉంది.

కరోనా వ్యాక్సినేషన్ ( Corona vaccination ) దేశమంతా జనవరి 16వ తేదీన ప్రారంభమైంది. స్వదేశీ వ్యాక్సిన్ భారత్ బయోటెక్ కంపెనీ ( Bharat Biotech company ) అభివృద్ధి చేసిన కోవ్యాగ్జిన్ ( Covaxin ), ఆక్స్‌ఫర్డ్ - ఆస్ట్రాజెనెకా ( Oxford-Astrazeneca ) అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ ( Covishield )‌ను దేశమంతటా పరిమిత సంఖ్యలో పంపిణీ చేసింది కేంద్ర ప్రభుత్వం. ప్రధాని నరేంద్ర మోదీ వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించారు. ఢిల్లీ, హైదరాబాద్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ కారణంగా సైడ్ ఎఫెక్ట్స్ రావడంతో వ్యాక్సినేషన్ కార్యక్రమం మందగించింది.  దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వ్యాక్సిన్ వేయించుకునేందుకు ప్రజల్లో ఆసక్తి కన్పించలేదు. 

ఆంధ్రప్రదేశ్‌ ( Andhra pradesh ) లో మాత్రం వ్యాక్సినేషన్  ముమ్మరంగా కొనసాగుతోంది. నాలుగోరోజు కూడా రాష్ట్రవ్యాప్తంగా 332 కేంద్రాల్లో కోవిడ్ టీకా వేస్తున్నారు. తొలి మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 46 వేల 755 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. జనవరి 18వ తేదీన అంటే మూడవరోజున 14 వేల 606 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. 

వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్‌ ముందుస్థానంలో ఉంది. వారంలో నాలుగు రోజుల పాటు వ్యాక్సినేషన్‌ వేస్తున్నారు. కరోనా వారియర్స్ ( Corona warriors ) గా ఉన్న వైద్యులు, వైద్య సిబ్బంది పారిశుద్ధ్య కార్మికులకు తొలిదశలో టీకా ఇస్తున్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగవంతమయ్యేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 1923 మంది వ్యాక్సిన్ తీసుకోగా..నెల్లూరులో 1847 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇక గుంటూరు జిల్లాలో 1490, అనంతపురంలో 1276, విశాఖపట్నంలో 1474, శ్రీకాకుళంలో 1193,  ప్రకాశంలో 1017 మంది కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. 

Trending News