Jagga Reddy About KCR: ‘సమైక్యవాదంతో ముందుకొస్తే కేసీఆర్ కు నేను మద్దతిస్తా’

Jagga Reddy About KCR: కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డి మరోసారి సమైక్యవాదం వినిపించారు. కేసీఆర్ సమైక్యవాదంతో ముందుకొస్తే... తానూ మద్దతిస్తానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉద్యమ సమయంలోనూ సమైక్యవాదాన్నే వినిపించినట్టు గుర్తు చేశారు. సమైక్యం.. తమ వ్యక్తిగత అభిప్రాయమేనని.. పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 30, 2021, 06:55 PM IST
Jagga Reddy About KCR: ‘సమైక్యవాదంతో ముందుకొస్తే కేసీఆర్ కు నేను మద్దతిస్తా’

Jagga Reddy About KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమైక్య వాదంతో ముందుకొస్తే తాను మద్దతిస్తానని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ సమైక్యవాదాన్ని వినిపించిన జగ్గారెడ్డి.. మళ్లీ అదే వాదాన్ని వినిపించడం చర్చనీయాంశంగా మారింది. తనను అందరూ తెలంగాణ ద్రోహి అన్నప్పటికీ ఎమ్మెల్యేగా గెలిచానని అన్నారు. సమైక్యం.. తన వ్యక్తిగత అభిప్రాయమని.. పార్టీకి సంబంధం లేదని తెలిపారు.

“ఆంధ్ర, తెలంగాణ నాయకులు మళ్లీ సమైక్యాన్ని తెరపైకి తెచ్చారు. ఈ విషయంలో పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి అభిప్రాయం వేరు, నా వ్యక్తిగత అభిప్రాయం వేరు. ప్రజల ఆలోచన మేరకే వెళ్తా.. ఏ ప్రాంతానికీ నేను వ్యతిరేకం కాదు. ఇది ప్రజల డిమాండ్‌ కాదు..నాయకుల అభిప్రాయం మాత్రమే. ప్రత్యేక రాష్ట్రం వస్తే మెరుగైన జీవితం ఉంటుందని భావించి కొట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాలు అన్న నినాదంతోనే ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడాం. కానీ, ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు. గతంలో నేను అన్నట్టుగానే ఇప్పుడు ఒక్కొక్కరు సమైక్యానికి అనుకూలంగా మాట్లాడుతున్నారు. రాష్ట్ర విభజన జరిగినా.. ఆంధ్ర, రాయలసీమ ప్రజలు కోటిమందికి పైగా తెలంగాణలో ఉన్నారు. ఆరోజు నన్ను తప్పుబట్టిన వారు.. ఇప్పుడు సమైక్యానికి మద్దతు పలుకుతున్నారు. ఆంధ్రాలో పార్టీ పెట్టమని కోరుతున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పార్టీ పెట్టడం ఎందుకు రాష్ట్రాన్ని కలిపేద్దాం అని ఏపీ మంత్రి పేర్ని నాని ప్రతిపాదించారు.  సమైక్యం విషయంలో ఎవరి అభిప్రాయాలను నేను తప్పుపట్టను.. ఎవరి అభిప్రాయాలు వారివి” అని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు.

Also Read: Huzurabad Bypoll: ప్రతిష్ఠాత్మకంగా మారిన హుజూరాబాద్ ఉపఎన్నిక నేడే, నువ్వా నేనా రీతిలో పోటీ

Also Read: Badvel bypoll updates : బద్వేల్ ఉప ఎన్నికల్లో వైస్సార్సీపీ, బీజేపీ మధ్య వాగ్వాదం 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News