Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్ పోస్టుల భర్తీకి రంగం సిద్దమైంది. రాష్ట్రంలో కూటమి సర్కార్ కొలువుదీరాక రెండోసారి నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తుండటంతో నేతలంతా పోస్టులు దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మూడు పార్టీల నేతలు ఈసారి ఎక్కువ సంఖ్యలో పోస్టులు దక్కించుకునేందుకు తీవ్రంగా పోటీ పడుతున్నారు.. అయితే ఈసారి జనసేన పార్టీలో కీలక నామినేటెడ్ పోస్టులు ఎవరికి దక్కుబోతున్నాయి అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
Also Read: Pawan kalyan: బీహార్ రాజకీయాలను షేక్ చేస్తున్న పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం.. అసలేం జరిగిందంటే..?
రాష్ట్రంలో కూటమి సర్కార్ ఏర్పడటంలో జనసేన పార్టీ కీలక పాత్ర పోషించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీ చేసిన 21 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు విజయం సాధించారు. ప్రస్తుత్తం డిప్యూటీ సీఎంగా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కొనసాగుతున్నారు. అయితే ఎన్నికల్లో కొందరు నేతలు చివరి నిమిషం వరకు కష్టపడినా పదవులు దక్కలేదనే అసంతృప్తిలో ఉన్నారు. గతంలో వారికి ఎక్కడో ఓ చోట సర్ధుబాటు చేస్తానని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చినట్టు చెబుతున్నారు. ఇటీవల నామినేటెడ్ పోస్టుల నియామకంలోనూ జనసేన నేతలకు మూడు కీలక నామినేడెట్ పోస్టులు దక్కగా.. మరో 9 మంది నేతలకు పలు కార్పొరేషన్లలో డైరెక్టర్ పదవులు వరించాయి. అయితే ఈ పదవులన్నీ పార్టీలో కొత్తగా చేరిన నేతలకే దక్కాయని తొలి నుంచి పార్టీ కోసం పనిచేసినా నేతలకు దక్కలేదని పార్టీ నేతల్లో కొంత అసంతృప్తి ఉందని ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో పార్టీలో అసంతృప్తికి గురవుతున్న లీడర్ల జాబితాను డిప్యూటీ సీఎం పవర్ కల్యాణ్ సేకరించినట్టు సమాచారం. పార్టీలో కీలకంగా ఉన్న నేతలకు పదవులు కట్టాబెట్టాలని అనుకుంటున్నారట. ముఖ్యంగా పార్టీ లైన్‌లో పనిచేసే నేతలకు పదవులు అప్పగించాలని భావిస్తున్నారట. మరోవైపు పార్టీ గీత దాటి ప్రయత్నిస్తున్న నేతలకు పదవులు ఇవ్వవద్దని డిసైడ్ అయ్యారట. గతంలో పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కిన బొలిశెట్టి సత్యానారాయణను పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. ఆయనకు ఎట్టి పరిస్థితుల్లో పదవి లేకుండా చేయాలని పవన్ అనుకుంటున్నారట. అయితే ఈ విషయం కాస్తా ఆయనకు తెలియడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరికొందరు లీడర్లకు సైతం ఈసారి చుక్కెదురు కావొచ్చనే టాక్ సైతం వినిపిస్తోంది.
ఇక జనసేన పార్టీ నుంచి నామినేటెడ్ పోస్టులు దక్కించుకునే నేతల జాబితా కూడా భారీగానే ఉన్నట్టు తెలుస్తోంది. అయితే వివిధ రాజకీయ సమీకరణాలను దృష్టిలో నేతలపై ఆశావాహులు కన్నేసినట్టు తెలుస్తోంది. కొత్తపేట నుంచి బండారు శ్రీనివాస్, పెద్దాపురం నుంచి తిరుమల బాబు, విశాఖ పట్నం నుంచి పంచకర్ల సందీప్, కోనపాపారావు, పసుపులేటి ఉషాకిరణ్, హరిప్రసాద్, రాయలసీమ కోటాలో కిరణ్ రాయల్, రాయపాటి అరుణ పదవులు ఆశిస్తున్నారు. అంతేకాదు మరికొందరు లీడరలు అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పదవుల కోసం పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది.
మొత్తంగా పదవుల పందేరం షురూ కావడంతో.. పార్టీ అధినేతను దర్శించుకునేందుకు నేతలు క్యూ కట్టినట్టు ప్రచారం జరుగుతోంది. పవన్ నుంచి ఆమోదం దక్కించుకుంటే పదవి ఖాయమనే ఆశలో నేతలు ఉన్నారట. చూడాలి మరి పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఎవరి వైపు మొగ్గు చూపుతారు.. ఎవరెవరికి భంగపాటు చేస్తారు అనేది త్వరలోనే తేలనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook