Chiranjeevi: వైఎస్ జగన్ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించిన మెగాస్టార్ చిరు

Chiranjeevi: ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో జరిగిన వ్యాక్సినేషన్ పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. స్పూర్తి దాయక నాయకత్వ పటిమ ఉందంటూ వైఎస్ జగన్‌పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 22, 2021, 03:52 PM IST
Chiranjeevi: వైఎస్ జగన్ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించిన మెగాస్టార్ చిరు

Chiranjeevi: ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో జరిగిన వ్యాక్సినేషన్ పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. స్పూర్తి దాయక నాయకత్వ పటిమ ఉందంటూ వైఎస్ జగన్‌పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి (Corona Pandemic) నియంత్రణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్దఎత్తున కోవిడ్ 19 నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. మరోవైపు ఆరోగ్య శ్రీ కింద కోవిడ్‌కు ఉచిత చికిత్స అందిస్తున్నారు. ఫలితంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో కర్ఫ్యూ వేళల్లో సడలింపు ఇస్తూ..వ్యాక్సినేషన్‌పై దృష్టి పెట్టింది ప్రభుత్వం. మెగా వ్యాక్సిన్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ఇప్పటికే గతంలో రెండు సార్లు వ్యాక్సిన్ డ్రైవ్ చేసి..ఒక్కరోజులో ఆరు లక్షలకు పైగా వ్యాక్సిన్లు చేసి రికార్డు సృష్టించింది. ఇప్పుడు మరోసారి మెగా వ్యాక్సిన్ డ్రైవ్ (Mega Vaccine Drive)కార్యక్రమం చేపట్టి దేశంలోనే అరుదైన ఘనత సాధించింది. ఒక్కరోజులో ఏకంగా 13.72 లక్షలమందికి కరోనా వ్యాక్సిన్ అందించింది ప్రభుత్వం. ఈ మహా ప్రయత్నంపై సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి. 

ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ఈ కార్యక్రమంపై స్పందించారు. ఒకేరోజు 13.72 లక్షలమందికి వ్యాక్సిన్ వేయించిన వైఎస్ జగన్ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. కోవిడ్ మహమ్మారి కట్టడికి ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని ట్విట్టర్ వేదికగా అభినందించారు. కోవిడ్ నియంత్రణకై ఏపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నం దేశానికే ఆదర్శమని కొనియాడారు. ఆదర్శవంతమైన పాలన కొనసాగిస్తూ..స్పూర్తిదాయకంగా నిలుస్తున్నారంటూ వైఎస్ జగన్‌ను కొనియాడారు.

Also read: AP Legislative Council: శాసనమండలి రద్దు నిర్ణయంపై అధికార పార్టీ వెనక్కి తగ్గుతుందా..కారణమేంటి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News