N Pavan Reddy

Pavan Reddy Naini

ఉల్లి లోడుతో వెళ్తున్న ట్రక్కును దోచుకున్న దొంగలు ఉల్లి లోడుతో వెళ్తున్న ట్రక్కును దోచుకున్న దొంగలు ఉల్లి ధరల పెరుగుదల కారణంగా పరిస్థితి ఎక్కడివరకు వెళ్లిందో చెప్పడానికి నిదర్శనంగా చోటుచేసుకున్న మరో చోరీ ఘటన ఇది. ఇటీవల కాలంలో ఉల్లి సరుకు చోరీకి గురైన ఘటనలు తరచుగా వెలుగుచూస్తూనే ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా బీహార్‌లోని కైమూరు జిల్లాలోనూ అటువంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది.
పాఠశాలలో మంత్రి హరీష్ రావు ఆకస్మిక పర్యటన.. విద్యార్థులు చెప్పిన సమాధానాలు విని టీచర్లపై ఆగ్రహం పాఠశాలలో మంత్రి హరీష్ రావు ఆకస్మిక పర్యటన.. విద్యార్థులు చెప్పిన సమాధానాలు విని టీచర్లపై ఆగ్రహం సంగారెడ్డి: జిల్లా‌ కందిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మధ్యాహ్న బోజనాన్ని పరిశీలించిన మంత్రి హరీష్ రావు.. అనంతరం పదో తరగతి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. వివిధ సబ్జెక్టులపై వారికి ప్రశ్నలు వేసిన మంత్రి హరీష్ రావుకి.. విద్యార్థుల నుంచి వచ్చిన సమాధానాలు విని అవాక్కయ్యారు.
Congress rally in Hyderabad : తిరంగ ర్యాలీ నేపథ్యంలో గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత Congress rally in Hyderabad : తిరంగ ర్యాలీ నేపథ్యంలో గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత కేంద్రం అవలంభిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తూ 'దేశాన్ని రక్షించుకుందాం.. రాజ్యాంగాన్ని కాపాడుకుందాం' నినాదంతో గాంధీభవన్ నుంచి ట్యాంక్ బండ్‌పైనున్న అంబేద్కర్ విగ్రహం వరకు శనివారం కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన తిరంగ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే.
Palle pragathi 2nd phase dates : జనవరి 2 నుండి 12 వరకు తెలంగాణలో 2వ విడత పల్లె ప్రగతి Palle pragathi 2nd phase dates : జనవరి 2 నుండి 12 వరకు తెలంగాణలో 2వ విడత పల్లె ప్రగతి తెలంగాణలోని అన్ని గ్రామాల్లో నిర్వహించనున్న 2వ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం బి.ఆర్.కె.ఆర్ భవన్‌లో 2వ విడత పల్లె ప్రగతి నిర్వహణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. ఎస్.కె.జోషితో కలిసి ప్రభుత్వం నియమించిన ఫ్లయింగ్ స్క్వాడ్స్ అధికారుల బృందంతో కలిసి సమావేశం నిర్వహించిన అనంతరం, జిల్లా కలెక్టర్లతో మంత్రి ఎర్రబెల్లి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
Vice president Venkaiah Naidu : మాతృభాషపై మరోసారి ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు Vice president Venkaiah Naidu : మాతృభాషపై మరోసారి ఉపరాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మరోసారి మాతృభాషలోనే భోదన అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. వైద్యులు మాతృభాషలో మాట్లాడటాన్ని అలవాటు చేసుకుంటే వైద్యం కోసం వచ్చే వారి సమస్యలను సరిగ్గా అర్థం చేసుకుని.. సరైన వైద్యం అందించేందుకు వీలుంటుందని చెప్పే క్రమంలో సమాజం కూడా మాతృభాషను కాపాడటాన్ని బాధ్యతగా తీసుకోవాలని అన్నారు.
Onions prices : రూ.10-20కే కిలో ఉల్లి విక్రయం.. ఇద్దరు యువకుల అరెస్ట్ ! Onions prices : రూ.10-20కే కిలో ఉల్లి విక్రయం.. ఇద్దరు యువకుల అరెస్ట్ ! ఉల్లి ధరల పెంపుపై ఆగ్రహించిన ఇద్దరు యువకులు తీసుకున్న ఓ నిర్ణయం వారిని కటకటాల పాలయ్యేలా చేసింది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.
Solar Eclipse affects on Ranji Trophy matches : సూర్య గ్రహణం ఎఫెక్ట్.. ఆలస్యంగా ప్రారంభమైన క్రికెట్ మ్యాచ్‌లు Solar Eclipse affects on Ranji Trophy matches : సూర్య గ్రహణం ఎఫెక్ట్.. ఆలస్యంగా ప్రారంభమైన క్రికెట్ మ్యాచ్‌లు సూర్య గ్రహణం కారణంగా రెండో రోజులో ఆటలో భాగంగా గురువారం నాడు ప్రారంభం కావాల్సి ఉన్న రంజి ట్రోఫీ మ్యాచ్‌లు ఆలస్యమయ్యాయి. అవును, సూర్య గ్రహణం ప్రభావం ముంబై, రాజ్‌కోట్, మైసూరులో జరుగుతున్న రంజీ ట్రోఫి మ్యాచ్‌లపై స్పష్టంగా కనిపించింది.
TSRTC employees retirement age increased : టిఎస్ఆర్టీసీ కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం కేసీఆర్ TSRTC employees retirement age increased : టిఎస్ఆర్టీసీ కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం కేసీఆర్ టిఎస్ఆర్టీసీ ఉద్యోగులపై ఇటీవల పలు వరాలు గుప్పించిన తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. తాజాగా వారికి క్రిస్మస్ పర్వదినం నాడే మరో గుడ్ న్యూస్ వినిపించారు. ఆర్టీసీ సిబ్బంది పదవీ విరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచుతున్నట్టు ప్రకటించారు. ఇదివరకే దీనిపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుని ఉండగా తాజాగా బుధవారం నాడు సీఎం కేసీఆర్ అందుకు సంబంధించిన ఉత్తర్వులపై సంతకం చేశారు. దీంతో ఆర్టీసీ సిబ్బంది ఉద్యోగ పదవీ విరమణ వయస్సు పెంపు ప్రకటన ఇక అధికారికంగా అమలులోకి వచ్చినట్టయింది. 
Asaduddin Owaisi on NRC and NPR : ఎన్‌పిఆర్‌పై రెండు రోజుల్లోగా టీఆర్ఎస్ వైఖరి: అసదుద్దీన్ ఒవైసి Asaduddin Owaisi on NRC and NPR : ఎన్‌పిఆర్‌పై రెండు రోజుల్లోగా టీఆర్ఎస్ వైఖరి: అసదుద్దీన్ ఒవైసి జాతీయ పౌర పట్టిక (NRC)పై రెండు రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ వైఖరిని ప్రకటిస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హామీ ఇచ్చారని ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. ఎన్‌పిఆర్‌ (NPR)కి ఎన్ఆర్‌సి (NRC)కి పెద్ద తేడా లేదని.. ఎన్ఆర్సీని అమలు చేయడానికి కేంద్రం ఎన్‌పిఆర్‌ని మొదటి అస్త్రంగా వాడుతోందని ఆరోపించారు.
JeM planning terror attacks in Ayodhya : అయోధ్యలో ఉగ్రదాడులకు జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ కుట్ర! JeM planning terror attacks in Ayodhya : అయోధ్యలో ఉగ్రదాడులకు జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ కుట్ర! అయోధ్యలో ఉగ్రదాడులకు పాల్పడేందుకు పాకిస్తాన్‌కి చెందిన నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ కుట్రపన్నుతున్నట్టు భారత నిఘావర్గాలు పసిగట్టాయి. జీ హిందుస్తాన్‌కి అందిన సమాచారం ప్రకారం.. జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మౌలానా మసూద్ అజార్ భారత్‌లో ఉన్న తమ ఉగ్రవాదులకు టెలిగ్రామ్ చాటింగ్ యాప్‌లో పంపించిన సందేశాన్ని దానిని భారత నిఘావర్గాలు గుర్తించినట్టు తెలుస్తోంది.
పోలీసుల వేధింపులు తట్టుకోలేక పురుగుల మందు తాగిన రైతు ! పోలీసుల వేధింపులు తట్టుకోలేక పురుగుల మందు తాగిన రైతు ! యాదాద్రి భువనగిరి జిల్లాలోని నారాయణపురం మండలం అరేగుడెంలో మంగళవారం మధ్యాహ్నం దారుణం చోటుచేసుకుంది. భూమి పంచాయితీలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాశయ్య అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసుల వేధింపులు భరించలేకే కాశయ్య ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు అతడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
3 capitals for AP | అది జగన్మోహన్ రెడ్డి స్పెషల్ ఎకనామిక్ జోన్ మాత్రమే: ఏపీఎస్ ఆరోపణలు 3 capitals for AP | అది జగన్మోహన్ రెడ్డి స్పెషల్ ఎకనామిక్ జోన్ మాత్రమే: ఏపీఎస్ ఆరోపణలు అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులు మంగళవారం ఎన్టీఆర్ భవన్‌లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడుని ( Chandrababu Naidu) కలిశారు. రాజధానిని ఇక్కడ నుంచి తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాల్సిందిగా కోరుతూ వివిధ సంఘాల ప్రతినిధులు చంద్రబాబుతో భేటి అయ్యారు.
Re-postmortem for dead bodies of Disha case accused : దిశ నిందితుల మృతదేహాలకు రీపోస్టుమార్టం.. మృతదేహాల అప్పగింత Re-postmortem for dead bodies of Disha case accused : దిశ నిందితుల మృతదేహాలకు రీపోస్టుమార్టం.. మృతదేహాల అప్పగింత దిశ సామూహిక అత్యాచారం, హత్య కేసులో ఎన్‌కౌంటర్‌కి గురైన నలుగురు నిందితుల మృతదేహాలకు సోమవారం రీపోస్టుమార్టం ముగిసింది. ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిమ్స్ వైద్యుల బృందం ఈ రీపోస్టుమార్టం ప్రక్రియలో పాల్గొంది. హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో ఉదయం 10:30 గంటలకు ప్రారంభమైన రీ పోస్టుమార్టం ప్రక్రియ మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో ముగిసింది. అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాలు అప్పగించారు. సాయంత్రం గంటన్నర లేపే అంత్యక్రియలు పూర్తయ్యాయి.  
Amit Shah on Jharkhand Assembly election results 2019 : ఝార్ఖండ్ ఎన్నికల ఫలితాలపై అమిత్ షా స్పందన Amit Shah on Jharkhand Assembly election results 2019 : ఝార్ఖండ్ ఎన్నికల ఫలితాలపై అమిత్ షా స్పందన ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అమిత్ షా.. ఓవైపు పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొంటూనే మరోవైపు ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర రిజిస్టర్, అయోధ్య స్థల వివాదం, అయోధ్య స్థలంలో నాలుగు నెలల్లోనే రామ మందిర నిర్మాణం వంటి కీలకమైన అంశాలపై కీలక ప్రకటనలు చేశారు.
Telangana municipal poll schedule : తెలంగాణలో మరో ఎన్నికల పండగ.. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల Telangana municipal poll schedule : తెలంగాణలో మరో ఎన్నికల పండగ.. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల తెలంగాణలో మరోసారి ఎన్నికల పండగకు రంగం సిద్ధమైంది. ఎప్పటి నుంచో ఎదురుచూస్తోన్న మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మునిసిపల్ ఎన్నికల నిర్వహణకు ఇటీవల హై కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో న్యాయపరమైన చిక్కులు తొలగిపోయిన సంగతి తెలిసిందే. దీంతా తాజాగా రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికల పోలింగ్ షెడ్యూల్ విడుదలైంది. 
Chiranjeevi supports AP CM YS Jagan : జగన్‌కి జై కొట్టి.. పవన్ కల్యాణ్‌కి షాక్ ఇచ్చిన చిరంజీవి Chiranjeevi supports AP CM YS Jagan : జగన్‌కి జై కొట్టి.. పవన్ కల్యాణ్‌కి షాక్ ఇచ్చిన చిరంజీవి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన మూడు రాజధానుల ప్రతిపాదనకు (3 Capitals for AP) మెగాస్టార్, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి (Chiranjeevi) మద్దతు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఓవైపు తన సోదరుడైన పవర్ స్టార్, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan).. ఈ మూడు రాజధానుల ప్రతిపాదనను తీవ్రంగా ఎండగడుతున్న తరుణంలో అదే మెగా ఫ్యామిలీ నుంచి మెగాస్టార్ రూపంలో సీఎం వైఎస్ జగన్ ప్రతిపాదనకు మద్దతు లభించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
BJP`s stand on 3 capitals for AP : ఏపీకి మూడు రాజధానులపై బీజేపి వైఖరి ఇదే : కన్నా BJP`s stand on 3 capitals for AP : ఏపీకి మూడు రాజధానులపై బీజేపి వైఖరి ఇదే : కన్నా దేశంలో అలజడి సృష్టించిన పౌరసత్వ సవరణ చట్టం నుంచి, ఏపీలోనూ చర్చనియాంశమైన మూడు రాజధానుల ప్రతిపాదన వరకు ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై బీజేపి వైఖరి ఏంటనే విషయాన్ని స్పష్టంచేస్తూ ఏపీ బీజేపి చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
డీఎస్సీలో ఉత్తీర్ణులైన 2,645 మంది అభ్యర్ధులకు టీచర్ పోస్టులు డీఎస్సీలో ఉత్తీర్ణులైన 2,645 మంది అభ్యర్ధులకు టీచర్ పోస్టులు డీఎస్సీ 2018లో (AP DSC 2018) ఉత్తీర్ణత సాధించిన 2,645 మంది అభ్యర్థులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ వెల్లడించింది. ఈనెల 22న జిల్లాల వారీగా ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో అభ్యర్థులకు కౌన్సెలింగ్‌ నిర్వహించాలని, ఆదే రోజు నియామక పత్రాలు అందించాలని ఏపీ పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ చినవీరభద్రుడు ఆదేశాలు జారీ చేశారు.
హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతికి ఘన స్వాగతం హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతికి ఘన స్వాగతం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శుక్రవారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో హకీంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. శీతాకాల విడిది నిమిత్తం సతీ సమేతంగా హైదరాబాద్ విచ్చేసిన రాష్ట్రపతికి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, హోంమంత్రి మహమూద్ అలీ, శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాష్ట్ర డీజీపి మహేందర్ రెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి పుష్పగుచ్చాలతో ఎదురెళ్లి ఘన స్వాగతం పలికారు.
Strong earthquake hits Afghanistan ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. ఢిల్లీలోనూ కంపించిన భూమి Strong earthquake hits Afghanistan ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం.. ఢిల్లీలోనూ కంపించిన భూమి ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం సంభవించింది. ఆఫ్గనిస్థాన్‌లోని హిందూ కుశ్ పర్వతాల్లో భారీ భూకంపం సంభవించిన అనంతరం ఢిల్లీతో పాటు ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాల్లోనూ భూ ప్రకంపనలు సంభవించాయి. హిందూ కుశ్ పర్వతాల్లోని జర్మ్ అనే ప్రాంతంలో భూకంప కేంద్రం ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.
IPL 2020 players auction : ఐపిఎల్ 2020 వేలం: హాట్ కేకుల్లా అమ్ముడైన అండర్ 19 ఆటగాళ్లు, వాళ్ల ధరలు IPL 2020 players auction : ఐపిఎల్ 2020 వేలం: హాట్ కేకుల్లా అమ్ముడైన అండర్ 19 ఆటగాళ్లు, వాళ్ల ధరలు క్రికెట్‌లో బాగా పర్‌ఫామ్ చేస్తోన్న ఆటగాళ్లకు ఐపీఎల్ 2020 టోర్నమెంట్ కాసులు కురిపిస్తోంది. రంజీల్లో ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లకు భారీ మొత్తం వెచ్చించైనా సొంతం చేసుకునేందుకు ఐపిల్ ఫ్రాంచైజీలు పోటీపడుతున్నాయి. ఫలితంగా దేశవాళీ క్రికెట్ ఆటగాళ్ల జీవితంలో ఐపిఎల్ వేలం పంట పండిస్తోంది.
ఆందోళనల నేపథ్యంలో 19 మెట్రో స్టేషన్లు బంద్ ఆందోళనల నేపథ్యంలో 19 మెట్రో స్టేషన్లు బంద్ పౌరసత్వ సవరణ చట్టం అమలు చేయకూడదనే డిమాండ్‌తో దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనలు పౌర జీవనాన్ని పలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఆందోళనకారులు ప్రజా ఆస్తులను ధ్వంసం చేసి, తగలబెడుతున్న వైనం ఆందోళనకు గురిచేస్తోంది.
IND vs WI 2nd ODI: విండీస్‌పై 107 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం.. విశాఖ స్టేడియంలోనూ ఓ రికార్డు IND vs WI 2nd ODI: విండీస్‌పై 107 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం.. విశాఖ స్టేడియంలోనూ ఓ రికార్డు విశాఖపట్నంలోని డా వైఎస్సార్ ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్-విశాఖపట్నం డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం (ACA-VDCA stadium)లో బుధవారం జరిగిన రెండో వన్డేలో టీమిండియా విండీస్‌పై 107 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో 3 వన్డేల సిరీస్‌ను కోహ్లీ సేన 1-1తో సమం చేసింది.
Anti-Citizenship Act protests | పౌరసత్వ సవరణ చట్టం: ఆందోళనల నేపథ్యంలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేత Anti-Citizenship Act protests | పౌరసత్వ సవరణ చట్టం: ఆందోళనల నేపథ్యంలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేత న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు క్రమక్రమంగా దేశం నలుమూలలా వ్యాపిస్తున్నాయి. మొదట ఈశాన్య భారతంలోని అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోనే ఎక్కువగా కనిపించిన ఈ ఆందోళనలు.. ఆ తర్వాత ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలకూ వ్యాపించాయి.
Virat Kohli`s test rank | మళ్లీ విరాట్ కోహ్లీనే టాప్.. ఆ తర్వాత ఎవరో తెలుసా ? Virat Kohli`s test rank | మళ్లీ విరాట్ కోహ్లీనే టాప్.. ఆ తర్వాత ఎవరో తెలుసా ? టీమిండియా రన్‌మెషీన్ విరాట్ కోహ్లీ ఐసీసీ టెస్టు బ్యాటింగ్ ర్యాక్సింగ్స్‌‌లో మరోసారి నెంబర్ 1 స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. కోహ్లీ 928 పాయింట్లతో ఐసిసి టెస్ట్ ర్యాంకింగ్స్‌లో తన టాప్ ర్యాంకును పదిలపర్చుకున్నాడు. 

Trending News