N Pavan Reddy

Pavan Reddy Naini

He is soo cute song | మహేష్ బాబు గ్లామర్‌కి తగినట్టుగానే.. హీ ఈజ్ సో క్యూట్ సాంగ్ He is soo cute song | మహేష్ బాబు గ్లామర్‌కి తగినట్టుగానే.. హీ ఈజ్ సో క్యూట్ సాంగ్ మహేష్ బాబు కొత్త సినిమా సరిలేరు నీకెవ్వరు ప్రస్తుతం టాలీవుడ్‌ ఆడియెన్స్‌ని ఉత్కంఠకు గురిచేస్తోన్న చిత్రాల్లో ఒకటనే సంగతి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వచ్చే సంక్రాంతికి అభిమానుల ముందుకు రానున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. 
Jamia Millia Islamia students protest | ఓల్డ్ ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ ఎదుట వందలాది విద్యార్థుల నిరసన.. పరిస్థితి ఉద్రిక్తం! Jamia Millia Islamia students protest | ఓల్డ్ ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ ఎదుట వందలాది విద్యార్థుల నిరసన.. పరిస్థితి ఉద్రిక్తం! జామియా మిల్లియా ఇస్లామియ యూనివర్శిటీ విద్యార్థి(Jamia Millia Islamia university students) సంఘాలు, పలువురు సిబ్బంది ఆదివారం రాత్రి పొద్దుపోయాకా ఓల్డ్ ఢిల్లీ పోలీసు హెడ్ క్వార్టర్స్ వద్దకు చేరుకుని ధర్నాకు దిగారు. జామియా మిల్లియా ఇస్లామియ యూనివర్శిటీ క్యాంపస్‌లోకి పోలీసులు అనుమతి లేకుండా ప్రవేశించడమే కాకుండా.. ఆందోళనతో సంబంధం లేని విద్యార్థులు, సిబ్బందిపై దాడికి పాల్పడ్డారంటూ విద్యార్థి సంఘాల నేతలు ఆరోపించారు.
CAB protest in Delhi | పౌరసత్వ సవరణ బిల్లుపై భగ్గుమన్న నిరసనలు.. మూడు బస్సులకి నిప్పు.. స్పందించిన సీఎం CAB protest in Delhi | పౌరసత్వ సవరణ బిల్లుపై భగ్గుమన్న నిరసనలు.. మూడు బస్సులకి నిప్పు.. స్పందించిన సీఎం పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు ఆదివారం హింసాత్మకంగా మారాయి. ఢిల్లీలోని జామియా నగర్‌లో రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టిన నిరసనకారులు.. మూడు బస్సులకి నిప్పుపెట్టారు.
నిరాహార దీక్షలో స్పృహ కోల్పోయిన స్వాతి మాలివాల్.. ఆస్పత్రికి తరలింపు నిరాహార దీక్షలో స్పృహ కోల్పోయిన స్వాతి మాలివాల్.. ఆస్పత్రికి తరలింపు మహిళలు, చిన్నారులపై అత్యాచారాల కేసుల్లో దోషులకు ఆరు నెలల్లో ఉరి శిక్ష విధించేలా కఠినమైన చట్టాన్ని తీసుకురావాలనే డిమాండ్‌తో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టి ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మాలివాల్ ఆదివారం ఉదయం దీక్షాశిబిరంలోనే అస్వస్థతకు గురై స్పృహ కోల్పోయారు.
మామ, మరుదుల నుంచి లైంగిక వేధింపులు.. భర్తకు చెబితే బెదిరింపులు!! మామ, మరుదుల నుంచి లైంగిక వేధింపులు.. భర్తకు చెబితే బెదిరింపులు!! కోడలిపై కన్నేసిన మామ... తల్లిలాంటి వదినపై అరాచకానికి పాల్పడిన మరుదులు.. ఇక్కడ ఘటనలు, నిందితులు వేరైనా.. బాధితురాలు మాత్రం ఒక్కరే. అవును మొత్తంగా ఆ కుటుంబమే ఓ మృగాళ్ల కుటుంబం అంటోంది ఓ అభాగ్యురాలు. కట్టుకున్న భర్తే కాదు... ఇంటికొచ్చిన కోడలిని కన్నకూతురిలా చూసుకోవాల్సిన మామ, వదినను తల్లిలా చూసుకోవాల్సిన మరుదులు... మొత్తంగా ఆ ఇల్లే ఓ ప్రత్యక్షనరకానికి కేరాఫ్ అడ్రస్ అంటోంది గుంటూరు రూరల్ మండలం దాసరిపాలెంకు చెందిన ఓ అభాగ్యురాలు. 
Rs 2000 notes | రూ. 2000 నోట్ల రద్దుపై స్పందించిన కేంద్రం Rs 2000 notes | రూ. 2000 నోట్ల రద్దుపై స్పందించిన కేంద్రం ఆర్బీఐ రూ.2వేల నోట్లను ప్రింట్ చేయడం ఆపేసినట్లు వెలువడిన వార్తలు అనేక సందేహాలకు తావిచ్చాయి. సమాచార హక్కు చట్టం కింద దాఖలైన ఓ పిటిషన్‌కి ఆర్బీఐ సమాధానం ఇస్తూ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆర్బీఐ ఎప్పటికప్పుడు ప్రతీ ఏడాది రూ.2వేల నోట్ల ముద్రణను తగ్గిస్తూ వచ్చినట్టుగా వెల్లడైన సంగతి తెలిసిందే.
రేపటి నుంచే ఆర్టీసీ ఛార్జీల పెంపు.. పెరిగిన చార్జీల వివరాలు ఇవే రేపటి నుంచే ఆర్టీసీ ఛార్జీల పెంపు.. పెరిగిన చార్జీల వివరాలు ఇవే ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో చార్జీలు పెంచనున్నట్టు ఇటీవలే ఏపీ సర్కార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా పెంచిన ఛార్జీలు రేపటి నుంచే అమలులోకి రానున్నట్టు ఏపీఎస్ఆర్టీసీ స్పష్టంచేసింది. ఈమేరకు సవరించిన చార్జీల వివరాలను తెలియజేస్తూ.. ఏపీఎస్ఆర్టీసీ ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది.
Delhi fire accident | అప్‌డేట్: ఢిల్లీ అగ్ని ప్రమాదంలో 43కి చేరిన మృతుల సంఖ్య Delhi fire accident | అప్‌డేట్: ఢిల్లీ అగ్ని ప్రమాదంలో 43కి చేరిన మృతుల సంఖ్య దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకున్న భారీ అగ్నిప్రమాదంలో మృతిచెందిన వారి సంఖ్య 43కి చేరింది. రాణి ఝాన్సీ రోడ్డులోని అనాజ్ మండి ప్రాంతంలో ఉన్న ఓ భవనంలో అంటుకున్న మంటలు మొత్తం భవనానికి వ్యాపించాయి. ఈ అగ్నిప్రమాదంలో 43 మంది ప్రాణాలు కోల్పోగా ఇంకొంత మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా కస్టమర్లకు 'అన్‌లిమిటెడ్' గుడ్ న్యూస్ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా కస్టమర్లకు 'అన్‌లిమిటెడ్' గుడ్ న్యూస్ ఎయిర్‌టెల్(Airtel offers), వొడాఫోన్ ఐడియా (Vodafone idea offers) సంస్థలు తమ వినియోగదారులకు గుడ్ న్యూస్ వినిపించాయి. ఇటీవల ఈ రెండు సంస్థలు టారిఫ్ ధరలు పెంచడంతో పాటు ఇతర నెట్‌వర్క్ నెంబర్లకు చేసే అపరిమిత వాయిస్ కాల్స్ (Unlimited voice calls)పై పరిమితి విధించి వినియోగదారులకు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 
తెలంగాణ సర్కార్‌, పోలీసుల వైఖరిపై గవర్నర్‌కి కాంగ్రెస్ నేతల ఫిర్యాదు తెలంగాణ సర్కార్‌, పోలీసుల వైఖరిపై గవర్నర్‌కి కాంగ్రెస్ నేతల ఫిర్యాదు తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ని కలిసిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు.. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, నేరాల సంఖ్య అధికమయ్యాయని ఫిర్యాదు చేశారు. ప్రధానంగా రాష్ట్రంలో జరిగే సకల నేరాలు అన్నింటికి కూడా కారణభూతమైన మద్యాన్ని కంట్రోల్ చేయకపోతే ఈ నేరాల్ని అదుపు చేయడం కూడా కష్టతరమవుతుందని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్టు కాంగ్రెస్ నేతలు తెలిపారు.
ఎన్‌కౌంటర్ ఘటనాస్థలాన్ని నిశితంగా పరిశీలించిన నిజ నిర్ధారణ కమిటి ఎన్‌కౌంటర్ ఘటనాస్థలాన్ని నిశితంగా పరిశీలించిన నిజ నిర్ధారణ కమిటి జాతీయ మానవహక్కుల సంఘం పంపించిన నిజ నిర్ధారణ కమిటి సభ్యులు చటాన్‌పల్లికి చేరుకుని ఎన్‌కౌంటర్ జరిగిన ఘటనాస్థలిని పరిశీలించారు. తొలుత మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన నిజ నిర్ధారణ కమిటి సభ్యుల బృందం.. ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన నిందితుల మృతదేహాలను పరిశీలించింది.
నిందితుల మృతదేహాల అప్పగింత విషయంలో హైకోర్టులో పోలీసుల పిటిషన్ నిందితుల మృతదేహాల అప్పగింత విషయంలో హైకోర్టులో పోలీసుల పిటిషన్ షాద్‌నగర్‌కి సమీపంలోని చటాన్‌పల్లి కల్వర్టు వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన నిందితుల మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలని మహబూబ్‌నగర్ జిల్లా పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు.
హైదరాబాద్ ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో సీజేఐ అరవింద్ బాబ్డే కీలక వ్యాఖ్యలు హైదరాబాద్ ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో సీజేఐ అరవింద్ బాబ్డే కీలక వ్యాఖ్యలు హైదరాబాద్ ఎన్‌కౌంటర్‌పై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అర్వింద్ బాబ్డె పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్ హై కోర్టులో కొత్తగా నిర్మించిన ఓ భవనం ప్రారంభోత్సవం కోసం శనివారం జోధ్‌పూర్‌‌కి వచ్చిన సందర్భంగా హైదరాబాద్ ఎన్‌కౌంటర్ ఘటనపై బాబ్డే స్పందిస్తూ ''ప్రతీకార చర్యలతో ఎప్పుడూ న్యాయం పొందకూడదు'' అని అన్నారు.
వాళ్లకు జైల్లో చిప్పకూడు పెట్టాల్సింది.. కానీ చంపాల్సింది కాదు: ఎన్‌కౌంటర్‌లో హతమైన నిందితుల కుటుంబసభ్యుల ఆవేదన వాళ్లకు జైల్లో చిప్పకూడు పెట్టాల్సింది.. కానీ చంపాల్సింది కాదు: ఎన్‌కౌంటర్‌లో హతమైన నిందితుల కుటుంబసభ్యుల ఆవేదన ''నా భర్తను ఎక్కడైతే ఎన్‌కౌంటర్ చేశారో.. నన్ను కూడా అక్కడికే తీసుకెళ్లి కాల్చిచంపండి. మా ఇద్దరికీ పెళ్లయి ఏడాదే అవుతోంది. ఇప్పుడు మా ఆయన లేకుండా నేనుండలేను''. దిశ హత్య కేసులో నిందితుడిగా ఉండి శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమైన చింతకుంట చెన్నకేశవులు భార్య రేణుక ఆవేదన ఇది.
Unnao rape case victim` death | ఉన్నావ్ రేప్ కేసు: నిందితులను హైదరాబాద్ తరహాలో ఎన్‌కౌంటర్‌ చేయాలి.. బాధితురాలి తండ్రి డిమాండ్ Unnao rape case victim` death | ఉన్నావ్ రేప్ కేసు: నిందితులను హైదరాబాద్ తరహాలో ఎన్‌కౌంటర్‌ చేయాలి.. బాధితురాలి తండ్రి డిమాండ్ హైదరాబాద్‌లో దిశపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఆమెను హత్య చేసిన కేసులో నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసినట్టుగానే తన కూతురిని బలిదీసుకున్న నిందితులను సైతం ఎన్‌కౌంటర్ చేయాలని ఉన్నావ్‌ గ్యాంగ్ రేప్ కేసులో నిందితుల దాడిలో తీవ్రంగా గాయపడి శుక్రవారం రాత్రి మృతిచెందిన బాధితురాలి తండ్రి డిమాండ్ చేశారు.
దిశ కేసులో ఎన్‌కౌంటర్‌పై సినీ ప్రముఖులు ఎవరేమన్నారంటే దిశ కేసులో ఎన్‌కౌంటర్‌పై సినీ ప్రముఖులు ఎవరేమన్నారంటే దిశపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో నిందితులుగా ఉన్న మహ్మద్‌ ఆరిఫ్ పాషా, జొల్లు శివ, చింతకుంట చెన్నకేశవులు, జొల్లు నవీన్ కుమార్‌లను ఎన్‌కౌంటర్‌లో మట్టుపెట్టడంపై సాధారణ ప్రజానికంతో పాటు టాలీవుడ్ సినీ ప్రముఖులు సైతం హర్షం వ్యక్తంచేస్తున్నారు.
వరంగల్ యాసిడ్ దాడి కేసు నుంచి దిశ కేసు వరకు.. సేమ్ కాప్, సేమ్ స్టైల్ ఎన్‌కౌంటర్స్ వరంగల్ యాసిడ్ దాడి కేసు నుంచి దిశ కేసు వరకు.. సేమ్ కాప్, సేమ్ స్టైల్ ఎన్‌కౌంటర్స్ దిశపై సామూహిక అత్యాచారం జరిపి, ఆమెను దారుణంగా హతమార్చిన ఘటన సైబరాబాద్ పరిధిలో చోటుచేసుకున్నప్పుడే ప్రజానికానికి అప్పటి వరంగల్ యాసిడ్ దాడి కేసు గుర్తుకొచ్చింది. ఎందుకంటే అప్పుడు ఆ కేసులో దర్యాప్తు అధికారిగా వరంగల్ ఎస్పీ హోదాలో ఉన్నది మరెవరో కాదు... ప్రస్తుతం సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఉన్న విశ్వనాథ్ చెన్నప్ప సజ్జనార్ కావడమే.
Disha gangrape and murder case | దిశ సామూహిక అత్యాచారం, హత్య కేసులో నలుగురు నిందితుల ఎన్‌కౌంటర్ Disha gangrape and murder case | దిశ సామూహిక అత్యాచారం, హత్య కేసులో నలుగురు నిందితుల ఎన్‌కౌంటర్ దిశపై సామూహిక అత్యాచారం, దారుణ హత్యకు పాల్పడిన కేసులో  నిందితులుగా ఉన్న నలుగురు పారిపోతుండగా సైబరాబాద్ పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. దిశను ఎక్కడైతే అత్యాచారం, హత్య చేసి శవాన్ని దహనం చేశారో.. అక్కడే నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు.
Daniel Shravan comments on rapes | మహిళల వద్ద కండోమ్స్ ఉండాలి.. రేపిస్టులకు సహకరించాలి: డానియెల్ శ్రవణ్ నీచమైన కామెంట్స్! Daniel Shravan comments on rapes | మహిళల వద్ద కండోమ్స్ ఉండాలి.. రేపిస్టులకు సహకరించాలి: డానియెల్ శ్రవణ్ నీచమైన కామెంట్స్! దిశ ఘటనలో సత్వర న్యాయం జరగాలని ప్రపంచమంతా ఒకవైపు నిలబడి పోరాడుతోంటే.. మరోవైపు మహిళలను అవమానించే రీతిలో వారిపై నీచమైన వ్యాఖ్యలు చేశాడు డానియెల్ శ్రావణ్ అనే ఓ సినీ దర్శకుడు. మహిళలు తమ వెంట కండోమ్స్ ఉంచుకోవాలని.. అత్యాచార ఘటనల్లో రేపిస్టులకు సహకరిస్తే.. వారు హత్యల నుంచి తప్పించుకోవచ్చంటూ డానియెల్ శ్రవణ్ ఇచ్చిన ఓ దరిద్రపుగొట్టు సలహా అతడి నీచ మనస్తత్వాన్ని బయటపెట్టింది.
ICC men's Test rankings list | స్టీవ్ స్మిత్‌ని అధిగమించి మళ్లీ టాప్ ర్యాంక్ అందుకున్న విరాట్ కోహ్లీ ICC men's Test rankings list | స్టీవ్ స్మిత్‌ని అధిగమించి మళ్లీ టాప్ ర్యాంక్ అందుకున్న విరాట్ కోహ్లీ ఐసిసి టెస్ట్ ర్యాంకింగ్స్‌ పురుషుల జాబితాలో విరాట్ కోహ్లీ మళ్లీ నెంబర్ 1 స్థానాన్ని అందుకున్నాడు. 928 పాయింట్స్‌తో విరాట్ కోహ్లీ నెంబర్ 1 స్థానాన్ని అందుకోగా 923 పాయింట్స్‌తో ఆస్ట్రేలియాకు చెందిన స్టీవ్ స్మిత్ రెండో స్థానంలో ఉన్నాడు.
YSR aarogyasri aasara scheme | తన మతం, కులంపై వస్తోన్న వ్యక్తిగతమైన ఆరోపణలపై స్పందించిన ఏపీ సీఎం వైస్ జగన్ YSR aarogyasri aasara scheme | తన మతం, కులంపై వస్తోన్న వ్యక్తిగతమైన ఆరోపణలపై స్పందించిన ఏపీ సీఎం వైస్ జగన్ ఇటీవలి కాలంలో కొందరు తన మతం, కులం గురించి మాట్లాడుతూ దారుణమైన విమర్శలు చేస్తున్నారని, వాటిని వింటుంటే బాధగా ఉంటోందని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు.
యువతిపై సామూహిక అత్యాచారం, హత్య కేసు: నిందితులున్న చర్లపల్లి జైలు బయట ఉద్రిక్తత.. భారీ సంఖ్యలో పోలీసుల మోహరింపు యువతిపై సామూహిక అత్యాచారం, హత్య కేసు: నిందితులున్న చర్లపల్లి జైలు బయట ఉద్రిక్తత.. భారీ సంఖ్యలో పోలీసుల మోహరింపు షాద్ నగర్ వద్ద పశు వైద్యాధికారిణిపై పశు వాంఛ తీర్చుకుని, ఆ తర్వాత ఆమెను దారుణంగా హతమార్చిన కేసులో అరెస్ట్ అయిన నలుగురు  నిందితులు ప్రస్తుతం చర్లపల్లి సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. నలుగురు నిందితులకు మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించడంతో వారిని కట్టుదిట్టమైన భద్రత మధ్య శనివారమే చర్లపల్లి జైలుకు తరలించారు.
వాళ్లను చంపేద్దాం సార్.. ప్రధాని మోదీకి మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి!! వాళ్లను చంపేద్దాం సార్.. ప్రధాని మోదీకి మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి!! ఢిల్లీలో ఏడేళ్ల క్రితం నిర్భయపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఆమె చావుకి కారణమైన దుర్మార్గులు దోషులని తేలిన తర్వాత కూడా ఇంకా వారికి వెంటనే ఉరిశిక్ష విధించకుండా కాలయాపన చేయడాన్ని మంత్రి కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు.
హెల్మెట్స్ ధరించి ఉల్లిగడ్డ విక్రయాలు హెల్మెట్స్ ధరించి ఉల్లిగడ్డ విక్రయాలు ఉల్లిపాయ ధరలు అందుబాటులో ఉన్నప్పుడు వాటిని కోస్తున్నప్పుడే కన్నీళ్లొచ్చేటివి... కానీ కిలో ఉల్లి ధర రూ.70-80 పైనే పలుకుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఉల్లి పేరెత్తితేనే కన్నీళ్లొస్తున్నాయంటున్నారు వినియోగదారులు. 
షాద్ నగర్ యువతి 'నిర్భయ' దారుణ హత్య కేసు: నిందితులకు వ్యతిరేకంగా విద్యార్థి, ప్రజా సంఘాల నిరసన షాద్ నగర్ యువతి 'నిర్భయ' దారుణ హత్య కేసు: నిందితులకు వ్యతిరేకంగా విద్యార్థి, ప్రజా సంఘాల నిరసన షాద్ నగర్ యువతిపై సామూహిక అత్యాచారం, దారుణ హత్య కేసులో నలుగురు నిందితులకు వ్యతిరేకంగా నిరసనలు భగ్గుమన్నాయి. నిందితులు కస్టడీలో ఉన్న షాద్ నగర్ పోలీసు స్టేషన్ వద్దకు చేరుకున్న పలు విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు స్టేషన్ ఎదుట ఆందోళన చేప్టటాయి. దీంతో షాద్ నగర్ పోలీసు స్టేషన్ ముందు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Trending News