Banking Tips 2023: ఆన్‌లైన్ మోసాలకు చెక్ పెట్టండి.. ఈ సింపుల్ ట్రిక్స్ పాటించండి

Online Banking Safety Tips: రోజురోజుకు ఆన్‌లైన్ మోసాలు పెరిగిపోతున్నా.. ప్రస్తుతం చాలా మందిలో ఇంకా అవగాహన రావడంలేదు. సైబర్ కేటుగాళ్లు రూట్ మార్చి అమాయకులను బుట్టలో వేసుకుని నిలువునా దోపిడీ చేస్తున్నారు. మీ బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు సేఫ్‌గా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి.  

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 17, 2023, 07:30 PM IST
Banking Tips 2023: ఆన్‌లైన్ మోసాలకు చెక్ పెట్టండి.. ఈ సింపుల్ ట్రిక్స్ పాటించండి

Online Banking Safety Tips: ప్రస్తుతం డిజిటల్ లావాదేవీలు ఎక్కువగా జరుగుతుండగా.. ఆన్‌లైన్ మోసాలు కూడా అదేస్థాయిలో పెరుగుతున్నాయి. కార్డుల వివరాలు, ఓటీపీ వివరాలు ఎవరికి చెప్పకండి.. ఆన్‌లైన్ నేరగాళ్ల చేతిలో మోసపోకండి.. అంటూ సైబర్ పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా.. అత్యాశకు పోయి చాలామంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ముఖ్యంగా చదువుకున్న వారే సైబర్ కేటుగాళ్ల మాయలో పడి దారుణంగా మోసపోతున్నారు. సైబర్ నేరాలకు చెక్ పెట్టాలని ప్రతి ఒక్కరు కొన్ని సెక్యూరిటీ ట్రిక్స్ పాటిస్తే చాలు. ఆధునిక సాంకేతికతను అన్ని బ్యాంకులు అందుబాటులోకి తీసుకువచ్చి భద్రతను కల్పిస్తున్నాయి.

డెబిట్ కార్డులు అందుబాటులోకి వచ్చిన తరువాత నగదు కోసం బ్యాంకుల చుట్టూ తిరిగే పని తప్పిపోయింది. మన దేశంలో క్రెడిట్ కార్డుల వినియోగం కూడా ప్రస్తుతం బాగా పెరిగిపోయింది. అయితే డెబిట్, క్రెడిట్ కార్డుల నుంచి మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. పిన్ అప్‌డేట్ చేసుకోవాలని.. కార్డు ఎక్స్‌పైర్ అవుతుందంటూ సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్‌ కాల్స్‌కు అస్సలు స్పందికండి. మీ డెబిట్, క్రెడిట్ కార్డ్ పిన్ నంబరు‌ని క్రమం తప్పకుండా మార్చండి. ఎక్కడైనా మీ కార్డ్‌ని స్వైప్ చేస్తున్నప్పుడు.. మీరే స్వయంగా పిన్ ఎంటర్ చేయండి. దుకాణం నుండి బయలుదేరే ముందు మీ కార్డ్‌ని తనిఖీ చేయండి. మీ పిన్‌ను ఎవరితోనూ పంచుకోవద్దు మరియు ఎక్కడైనా వ్రాయడాన్ని నివారించండి, ముఖ్యంగా కార్డ్‌లో. కార్డు పోయిన వెంటనే రిపోర్ట్ చేయండి.

మీ నెట్ బ్యాంకింగ్ సమాచారం కోసం ఏ బ్యాంక్ కూడా ఈ-మెయిల్ గానీ.. కాల్స్ గానీ చేయదు. గుర్తుతెలియని ఈ-మెయిల్స్‌లోని ఏదైనా లింక్‌పై క్లిక్ చేయకండి. కార్డ్ పిన్, బ్యాంకింగ్ పాస్‌వర్డ్ వంటి మీ బ్యాంక్ వివరాలను ఎవరితోనూ షేర్ చేయవద్దు. అదేవిధంగా మీ బ్యాంక్‌ అకౌంట్‌లను తరచుగా నగదు బదిలీ చేస్తూ ఉండండి. అకౌంట్ ఓపెన్ చేసి వదిలేయకుండా.. యాక్టివ్‌గా ఉంచండి. ఏళ్ల తరబడి ఎలాంటి లావాదేవీ లేకుండా ఉంటే అకౌంట్‌లు పనిచేయవు. ఈ అకౌంట్‌లను లక్ష్యంగా చేసుకుని మనీలాండరింగ్, అక్రమ లావాదేవీలు జరిగే అవకాశం ఉంది. 

Also Read: Harish Rao News: వాళ్లు ఎగిరెగిరి పడుతున్నారు.. ఏపీ మంత్రులపై హరీష్‌ రావు మరోసారి సీరియస్

ఒకవేళ అకౌంట్ నిరూపయోగంలో ఉంటే.. వెంటనే క్లోజ్ చేయడం ఉత్తమం. నెట్‌బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డుల పాస్‌వర్డులు, పిన్‌లు కష్టతరమైనవిగా సెట్ చేసుకోండి. ఈజీగా గుర్తుపట్టేవిధంగా ఉండకూడదు. మీరు ఇంటర్‌నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తుంటే.. సైబర్ కేఫ్‌లు లేదా ఏదైనా ఇతరుల కంప్యూటర్ల‌లో మీ ఆన్‌లైన్ అకౌంట్ అస్సలు ఓపెన్ చేయకండి. ఆన్‌లైన్ లావాదేవీలను పూర్తి చేసిన తర్వాత హిస్టరీని కచ్చితంగా క్లియర్ చేసి.. లాగౌట్ చేశారో లేదో మరోసారి చెక్ చేసుకోండి.

Also Read: Whatsapp Security Features: వాట్సాప్ కొత్త ఫీచర్లతో వేరే లెవెల్ ఎక్స్‌పిరియన్స్.. వెంటనే అప్‌డేట్ చేసుకోండి  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News