kanjhawala Case New Twist: కారు కింద అమ్మాయి పడిందని తెలుసు.. కానీ ఎందుకు ఆపలేదంటే?

New Twist in kanjhawala Case: ఢిల్లీలో కంఝవాలా అంజలి యాక్సిడెంట్ ఘటనలో ఈ రోజు మరో కొత్త ట్విస్ట్ తెర మీదకు వచ్చింది. ఆమె కారు కింద పడిందని తమకు తెలుసనే విషయాన్ని బయట పెట్టింది. 

Written by - Chaganti Bhargav | Last Updated : Jan 8, 2023, 09:16 PM IST
kanjhawala Case New Twist: కారు కింద అమ్మాయి పడిందని తెలుసు.. కానీ ఎందుకు ఆపలేదంటే?

New Twist in kanjhawala Case: ఢిల్లీలో కంఝవాలా అంజలి యాక్సిడెంట్ ఘటనలో ఈ రోజు మరో కొత్త ట్విస్ట్ వచ్చింది. ఈ కేసులో అరెస్టయిన నిందితులు ఇప్పుడు పోలీసుల ఇంటరాగేషన్‌లో యాక్సిడెంట్ తర్వాత అంజలి తమ కారు కింద ఇరుక్కుపోయిందని తమకు ముందే తెలిసిందని అంగీకరించారు. అలాగే అంజలిని ఢీ కొన్న సమయంలో కారులో బిగ్గరగా సంగీతం ప్లే చేశారనే వాదన కూడా అబద్ధమని వారిలో ఒకరు అంగీకరించాడు.

మీడియా కథనాల ప్రకారం, కంజావాలా కేసులో అరెస్టయిన నిందితులు ఆదివారం ఢిల్లీ పోలీసుల విచారణలో తమ కారు కింద అంజలి ఇరుక్కుపోయిందని తమకు తెలిసిందని అంగీకరించారు. ఇక కారులోంచి ఆమె మృతదేహాన్ని బయటకు తీస్తే తమపై హత్యానేరం పడుతుంది ఏమో అని భయపడ్డామని నిందితులు తెలిపారు. హత్య కేసులో ఇరుక్కుంటామేమో అనే భయంతో రోడ్డుపై కారు నడుపుతూనే ఉన్నామని పేర్కొన్నారు.

కారు కింద నుంచి అంజలి మృతదేహాన్ని బయటకు తీయడానికి సుల్తాన్‌పురి నుంచి కంఝవాలా వరకు చాలాసార్లు యూ-టర్న్‌లు చేశామని అయినా ఆమె మృతదేహం కారు నుంచి విడిపోలేదని పేర్కొన్నారు. ఇక ఈ ప్రమాదం జరిగిన తర్వాత తాము చాలా భయపడ్డామని నిందితులు పోలీసుల విచారణలో బయట పెట్టారు. అందుకే తమకు ఎక్కడికి వెళ్లాలో తోచలేదని కూడా బయటపెట్టారు. అందుకే ఆ అమ్మాయి శవం కారు కింద నుంచి విడిపోయేంత వరకు వేచి ఉన్నామని వెల్లడించారు.

ఇక ఆ సమయంలో బిగ్గరగా సంగీతాన్ని ప్లే చేస్తున్నట్లు పోలీసులకు చెప్పిన కథనం కూడా పూర్తిగా అబద్ధమని నిందితులు అంగీకరించారు. న్యూ ఇయర్ అర్థరాత్రి, బాలెనో కారులో వెళ్తున్న ఐదుగురు యువకులు 20 ఏళ్ల అమ్మాయి అంజలీ సింగ్ నడుపుతున్న స్కూటీని ఢీ కొట్టారు. ఆ తర్వాత ఆమె కారు కింద ఇరుక్కుపోవడంతో కారులో ఉన్నవారు ఆమెను దాదాపు 12 కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లారు.

అనంతరం కంఝవాలాలోని ఓ రోడ్డుపై సదరు అంజలి సింగ్ వివస్త్రగా శవమై కనిపించింది. ఆ అమ్మాయి తన కుటుంబానికి ఏకైక జీవనాధారం కావడం, అతి దారుణంగా ఆమె చనిపోవడంతో ఏడుగురు నిందితులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ప్రమాద సమయంలో కారు నడుపుతున్న అమిత్‌ ఖన్నా సోదరుడు అంకుష్‌కు బెయిల్‌ లభించింది, కానీ మిగిలిన వారంతా జైల్లో ఉన్నారు. ఇక పోలీసులు హత్య సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Also Read: NBK Vs Chiru: బాలయ్యను చిత్తు చేసిన చిరు.. ట్రైలర్ లెక్కలు చూశారా?

Also Read: Chahal Viral Video: సూర్య భాయ్ చేతికి చాహల్ ముద్దు.. వైరల్ వీడియో చూశారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 
 

Trending News