Game Changer: గేమ్ చేంజర్ టికెట్ ధరలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం.. తెలంగాణ పరిస్థితి ఏమిటి..?

Game Changer AP Ticket Rates: రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం.. బాలకృష్ణ డాకూ మహారాజు సినిమాలతో ఈ చిత్రం పోటీ పడాల్సిఉండగా... ఈ సినిమా టికెట్ రేట్స్ గురించి ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. బెనిఫిట్ షో ల వివరాలను కూడా.. ఈ టికెట్ రేట్లతో పాటు ప్రకటించింది. పూర్తి వివరాల్లోకి వెళితే

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jan 4, 2025, 07:33 PM IST
Game Changer: గేమ్ చేంజర్ టికెట్ ధరలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం.. తెలంగాణ పరిస్థితి ఏమిటి..?

Game changer benefit shows: రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన్న రాజకీయ థ్రిల్లర్ చిత్రం గేమ్ చేంజర్. ఈ సినిమా దిల్ రాజు నిర్మాణంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.  

ఈ క్ర‌మంలో టికెట్ ధరల వివరాలను చిత్ర బృందం వెల్లడించింది. గేమ్ చేంజర్ టికెట్ రేట్ల ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా బెనిఫిట్ షోలకు అదనంగా టికెట్ రేట్లు ప్రకటించింది ప్రభుత్వం. అర్ధరాత్రి 1 గంట ప్రీమియర్ షో టికెట్ ధర రూ.600 (పన్నులతో కలిపి) గా నిర్ణయించారు. అలాగే, జనవరి 10న 6 షోలకు అనుమతి లభించగా.. ఉదయం 4 గంటలకే ప్రత్యేక షో వేసుకోవడానికి కూడా ప్రభుత్వం ఒప్పుకుంది. ఇక మిగతా షోల్డర్ టికెట్ల విషయానికి వస్తే..మొదటి  రెండు వారాలకు మల్టీ ప్లెక్స్ లో రూ.352..టికెట్ ధర నిర్ణయించగా, సింగిల్ థియేటర్ లో టికెట్ ధర రూ.282గా ప్రకటించారు.

కాగా రెండు వారాల తర్వాత నుండి ఈ సినిమా టికెట్ ధరలు తగ్గనున్నాయి. మూడోవారం నుంచి  మల్టీ ప్లెక్స్ లో రూ.177, సింగిల్ థియేటర్ లో రూ.148గా టికెట్ ధరను ప్రకటించారు.

ఇక ఏపీలో పెద్ద ఎత్తున టికెట్ ధరలు పెంచడంతో అందరి చూపు తెలంగాణపైనే పడింది. పుష్ప సినిమా వల్ల తెలంగాణలో అసలు బెనిఫిట్ షోలు ఉండవనే చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అదే కానీ నిజమైతే.. మొదటిగా పెద్ద తప్ప తగిలేది రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాకే. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి రేవంత్ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనే దానిపైనే అందరి దృష్టి ఉంది.
రేవంత్ సర్కార్ గేమ్ ఛేంజర్ సినిమాకు బెన్ ఫిట్ షో, టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇస్తుందా లేదా అనే చర్చ అటు సోషల్ మీడియాలో, ఇటు సినీ వర్గాల్లో జోరున జరుగుతోంది.

కాగా గేమ్ ఛేంజర్ సినిమా నిర్మాత దిల్ రాజు.. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం  ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ గా ఉండడంవల్ల.. రేవంత్ సర్కార్ ను బెన్ ఫిట్ షోలకు దిల్ రాజు ఏమైనా ఒప్పింగచగలడా.. అనే టాక్ ఫిలిం ఇండస్ట్రీలో నడుస్తోంది. పుష్ప 2 బెన్ ఫిట్ షో ఘటనతో  బెన్ ఫిట్ షోలకు అనుమతిని రద్దు చేసిన తెలంగాణ సర్కార్.. ఇంత త్వరగా తమ నిర్ణయం మార్చుకుంటదా అనేది మరి కొంతమంది సందేహం.

ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులు ఈ సినిమాకు టికెట్ ధరలపై మిశ్రమ స్పందన ఇస్తున్నారు. టికెట్ ధరలు ఇంతలా పెంచేస్తే.. సామాన్యులకు ఇలాంటి సినిమాలు దూరమైనట్టే అనేది ఎంతోమంది వాదన. అయితే, రామ్ చరణ్ నటన, శంకర్ దర్శకత్వం, భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా.. అభిమానుల అంచనాలను అందుకునేలా ఉంటాయని ఆశిస్తున్నారు.  మరి ఈ టికెట్ ధరలతో ఆంధ్రప్రదేశ్ లో ఈ సినిమా ఎన్ని కలెక్షన్స్ సాధిస్తుందో తెలియాలి అంతే మాత్రం మరి కొద్ది రోజులు వేచి చూడాలి.

Read more: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ సహా అన్ని సమస్యలను పరిష్కరిస్తామని సీఎం హామీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook

Trending News