Ma Oori Raja Reddy: తెలుగులో వెరైటీ కాన్సెప్ట్‌తో వస్తోన్న'మా ఊరి రాజారెడ్డి'..

Ma Oori Raja Reddy : అంతా కొత్త వాళ్లతో తెరకెక్కిన చిత్రం 'మా ఊరి రాజారెడ్డి'. ఆర్ ఎస్ మూవీ మేకర్స్ పతాకంపై  రజిత రవీందర్ ఎర్ర, సునీత వెంకటరమణ నిర్మిస్తున్నారు.ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వస్తోంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 26, 2024, 03:23 PM IST
Ma Oori Raja Reddy: తెలుగులో వెరైటీ కాన్సెప్ట్‌తో వస్తోన్న'మా ఊరి రాజారెడ్డి'..

Ma Oori Raja Reddy : హీరో నిహాన్ మాట్లాడుతూ : ఈరోజు మా అమ్మగారు నిర్మల  ఇక్కడికి రాలేదు. ఆమె ఆశీర్వాదంతో సినిమాల్లో వచ్చాను. ఈ సినిమాలో హీరోగా సెలెక్ట్ చేసిన నిర్మాత, దర్శకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను.తెలంగాణలోని అందమైన లోకేషన్స్‌లో ఈ సినిమాను నిర్మించాము. ప్రేక్షకులకు మా సినిమా తప్పకుండా నచ్చుతుందన్నారు.

హీరోయిన్ వైష్ణవి మాట్లాడుతూ : ఇది నాకు ఫస్ట్ మూవీ. నా తల్లిదండ్రులు మొదట ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.మా పేరెంట్స్ ని నెమ్మదిగా ఒప్పించి ఇండస్ట్రీలోకి వచ్చాను. నన్ను ఈ క్యారెక్టర్ కి సెలెక్ట్ చేసుకున్న నిర్మాత, దర్శకులకు నా కృతజ్ఞతలు. కచ్చితంగా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందన్నారు.

మాజీ కేంద్ర మంత్రి  వేణుగోపాల చారి  మాట్లాడుతూ : మా ఊరి రాజారెడ్డి అనే సినిమా స్వర్గీయ రాజా రెడ్డి గారిని గుర్తుకు చేసేలా ఉంటుందన్నారు.. ఆయన అంచలంచెలుగా రాజకీయాల్లో ఒక నిష్ణాతుడైన ముఖ్యమంత్రిగా ఎదిగిన కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలో నటించిన వాళ్లు సాంకేతిక నిపుణులు అందరూ నిర్మల్ ప్రాంతం వాళ్ళు రావడం నిజంగా ఆనందదాయకం. ఈ రోజున నిజంగా హైదరాబాద్ ఒక ముఖ్య ప్రాంతంగా మారడం. ఇక్కడ నుంచి మన తెలుగు సినిమాలు ప్రపంచ స్థాయికి ఎదగడం చాలా సంతోషంగా ఉందన్నారు. నేడు తెలంగాణలో నిర్మల్, అదిలాబాద్, వరంగల్ లాంటి ప్రదేశాల్లో చాలా అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా అద్భుతమైన వాటర్ ఫాల్స్ అటవీ ప్రాంత లోకేషన్లు మన దగ్గర ఉన్నాయి. ఈ సినిమాలో తెలంగాణ ప్రాంతం వాళ్లు నిర్మించడం, నటించడం చాలా శుభ పరిణామం. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు.

నిర్మాత వెంకటరమణ  మాట్లాడుతూ : మా ఊరి రాజారెడ్డి సినిమాని నిర్మల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో నిర్మించాము. ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉందన్నారు. ప్రేక్షకుల ఈ సినిమాను తప్పకుండా ఆదరిస్తారన్నారు.  

నటీనటులు :
నిహాన్, వైష్ణవి కాంబ్లే, ఎర్ర రవీందర్, రజిని, అయిత వెంకటరమణ, ఆర్. ప్రభుదాస్, రాధిక, కుమార్, కోటగిరి నరసయ్య చారి, కోట్టే చంద్రశేఖర్ ఈ సినిమాకు మ్యూజిక్ పీకే అందిస్తున్నారు. వాసు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. డైరెక్టర్ రవి బాసర ఈ సినిమాతో మెగా ఫోన్ పట్టుకున్నాడు.

Also Read: Telangana: ముఖ్యమంత్రి అవుతాడని రేవంత్‌ రెడ్డి స్వగ్రామంలోనే ఎవరూ నమ్మలేదు: కేటీఆర్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News