Manchu Vishnu: చిరంజీవి, రామ్ చరణ్ గురించి మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు

Manchu Vishnu comments on Chiranjeevi and Ram Charan: మా అసోసియేషన్‌కి కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలకు ముందు జరిగిన కొన్ని పరిణామాల గురించి మంచు విష్ణు తన ప్యానెల్ సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 12, 2021, 11:48 AM IST
Manchu Vishnu: చిరంజీవి, రామ్ చరణ్ గురించి మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు

Manchu Vishnu comments on Chiranjeevi and Ram Charan: మా అసోసియేషన్‌కి కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలకు ముందు జరిగిన కొన్ని పరిణామాల గురించి మంచు విష్ణు తన ప్యానెల్ సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. తనను మా ఎన్నికల బరి (MAA Election 2021) నుంచి తప్పుకోవాలని ముందుగా చెప్పింది చిరంజీవి అంకులే అని స్పష్టంచేశారు. 

సోమవారం సాయంత్రం మంచు విష్ణు మీడియాతో మాట్లాడుతూ.. '' మా ఎన్నికలు నిర్వహించకుండా ప్రకాశ్ రాజ్‌ని ఏకగ్రీవంగా గెలిపిద్దాం'' అని చిరంజీవి అంకుల్ (Manchu Vishnu comments about Chiranjeevi)నాన్నకు సూచించారు. అయితే మేమే వెనక్కి తగ్గకూడదని నిర్ణయించుకుని పోటీ చేశామని తెలిపారు. ఈ విషయం బయటికి చెప్పకూడదు కానీ ఇప్పుడు ఎలాగూ ఎన్నికలు పూర్తయ్యాయి కనుక చెబుతున్నా అని మంచు విష్ణు వ్యాఖ్యానించారు.

Also read : MAA elections: జూనియర్ ఎన్టీఆర్ మా ఎన్నికల్లో ఓటేయలేదు: Manchu Vishnu

మా ఎన్నికల్లో రామ్ చరణ్ తన ఓటు ఎవరికి వేసి ఉంటారనే అంశంపై స్పందిస్తూ.. కచ్చితంగా చరణ్ ఓటు తనకు కాకుండా ప్రకాష్ రాజ్‌కే (Prakash Raj) వేసి ఉంటాడని భావిస్తున్నాను అని కుండబద్ధలు కొట్టినట్టు చెప్పాడు. ఎందుకంటే.. చరణ్ కూడా తనలాగే తండ్రి మాటకు గౌరవం ఇచ్చే వ్యక్తి. తండ్రి మాట జవదాటడు. అందుకే తండ్రి ఎవరికి ఓటు వేయమని చెబితే వారికే ఓటు వేస్తాడు. ఆ స్థానంలో నేనున్నా అలాగే చేసే వాడిని. అందుకే రామ్ చరణ్ తనకు ఓటు వేయలేదనే కోపం తనకేమీ లేదని మంచు విష్ణు చెప్పుకొచ్చాడు. మా ఎన్నికల్లో మద్దతు ఇవ్వకున్నా.. రామ్ చరణ్ తనకు సోదరుడి లాంటివాడేనని మంచు విష్ణు (Manchu Vishnu comments on Ram Charan) అభిప్రాయపడ్డారు.

Also read : MAA Elections 2021: 'అంకుల్ తొందరపడొద్దు'...ప్రకాశ్‌రాజ్‌ రాజీనామాపై విష్ణు స్పందన

Also read : MAA Elections 2021: మెగాబ్రదర్ సంచలన నిర్ణయం..'మా' సభ్యత్వానికి నాగబాబు రాజీనామా

Also read: MAA Elections results: ప్రకాష్ రాజ్‌కు షాక్.. 'మా' అధ్యక్షుడిగా మంచు విష్ణు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News