Pushpa 2 The Rule Teaser: అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా 'పుష్ప 2 ది రూల్ ' టీజర్ విడుదల.. ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఐకాన్ స్టార్..

Pushpa 2 The Rule Teaser: సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన 'పుష్ప' మూవీ ఎంత పెద్ద హిట్టైయిందే తెలుసు కదా. ఇపుడీ సినిమాకు కొనసాగింపుగా పుష్ప 2 ది రూల్ మూవీ రాబోతోంది.  ఈ రోజు అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్బంగా పుష్ప 2 ది రూల మూవీ టీజర్‌ను విడుదల చేసారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Apr 8, 2024, 11:46 AM IST
Pushpa 2 The Rule Teaser: అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా  'పుష్ప 2 ది రూల్ ' టీజర్ విడుదల.. ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఐకాన్ స్టార్..

Pushpa 2 The Rule Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లోనే  ఎన్నడు లేనంతగా ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'పుష్ప ' ది రైజ్ ఫస్ట్ పార్ట్‌తో హిట్ అందుకోవడమే కాదు.. ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటాడు. ఇపుడీ మూవీకి కొనసాగింపుగా పుష్ప 2 ది రూల్ మూవీతో రాబోతున్నాడు. గతేడాది అల్లు అర్జున్ బర్త్ డే సందర్బంగా విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ బర్త్ డే రోజున పుష్ప 2 మూవీ నుంచి టీజర్‌ను విడుదల చేసారు.  ఈ టీజర్‌ కూడా గత టీజర్ మాదిరి ఎక్కడా తగ్గేదేలే అన్నట్లుగా ఉంది. ఈ సినిమాతో మరోసారి పుష్ప రాజ్ నట  విశ్వరూపం  చూపించబోతున్నాడు. రష్మిక మందన్న మరోసారి తన యాక్టింగ్‌తో ఆకట్టుకుంది. మరోవైపు ఈ సినిమా కట్ చేసిన టీజర్‌తో అంచనాలు పీక్స్‌కు వెళ్లాయి. ప్యాన్ ఇండియా కాబట్టి.. హీరో అమ్మవారి గెటప్‌లో దుష్టులను అంతం చేసేలా ఈ టీజర్‌ను ఎలాంటి డైలాగ్స్ లేకుండా ప్యాన్ ఇండియా అప్పీల్‌ వచ్చేలా కట్ చేసారు. మొత్తంగా ఈ టీజర్‌తో సినిమాపై అంచనాలు పెరిగాయి.

అల్లు అర్జున్, సుకుమర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'పుష్ప' మూవీతో అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు. తెలుగు నుంచి ఈ పురస్కారం అందుకున్న ఫస్ట్  హీరోగా అల్లు అర్జున్ రికార్డ్ క్రియేట్ చేసాడు. ఈ మూవీకి కొనసాగింపుగా పుష్ప 2 మూవీ రాబోతుంది. ఈ యేడాది ఆగష్టు 15న విడుదల కాబోతుంది. ఈ మూవీపై తెలుగు సహా ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలే ఉన్నాయి.  ఆ సంగతి పక్కన పెడితే.. అల్లు అర్జున్... పుష్ప 2 మూవీ తర్వాత వెంటనే పలు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగ, బోయపాటి శ్రీను, అట్లీ, సురేంద్ రెడ్డి వంటి దర్శకులను లైన్‌లో పెట్టుకున్నాడు.  అయితే పుష్ప 2 మూవీ తర్వాత అల్లు అర్జున్.. తమిళ దర్శకుడు అట్లీతో సినిమా చేయబోతున్నట్టు సమాచారం.

అట్లీ గతేడాది షారుఖ్‌ ఖాన్‌తో చేసిన 'జవాన్' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇపుడు తొలిసారి అల్లు అర్జున్‌తో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.  ఈ సినిమా కూడా ప్యాన్ ఇండియా లెవల్లో భారీ యాక్షన్ మూవీగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారట. తెలుగు, తమిళం, హిందీ నిర్మాతలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నారట. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే పేరును పరిశీలిస్తున్నారు. తనతో చేసిన దువ్వాడ జగన్నాథం, అల వైకుంఠపురములో హిట్స్ తర్వాత మరోసారి వీళ్లిద్దరు ఈ మూవీలో జోడిగా కనిపించబోతున్నట్టు సమాచారం.

Also Read: KCR Arrest: కేసీఆర్‌ జైలుకు వెళ్లడం ఖాయమా? రేవంత్‌ రెడ్డి మాస్టర్‌ ప్లాన్‌ ఇదేనా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News