Karthika Wedding: అలనాటి హీరో హీరోయిన్ల మధ్య రాధా కూతురు పెళ్లి... ప్రధాన ఆకర్షణగా చిరంజీవి

Chiranjeevi: అలనాటి హీరోయిన్ రాధ కూతురు కార్తీక పెళ్లి నిన్న 80’ల సినీ తారుల మధ్య రంగ రంగ వైభవంగా జరిగింది.తిరువనంతపురంలోని ఉదయ్ సముద్ర లీజర్ బీచ్ హోటల్ లో జరిగిన ఈ పెళ్లికి రాధా తో ఎన్నో సినిమాలు నటించినా చిరంజీవి హాజరు కావడం విశేషం. కాగా ఈ పెళ్లిలో అలనాటి హీరోయిన్ల మధ్య చిరంజీవి నిలబడుకొని తీసుకున్న ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 20, 2023, 08:38 AM IST
Karthika Wedding: అలనాటి హీరో హీరోయిన్ల మధ్య రాధా కూతురు పెళ్లి... ప్రధాన ఆకర్షణగా చిరంజీవి

Radha Daughter: ఒకప్పుడు తెలుగు వెండి తెరను ఏలిన నటి రాధ.  చిరంజీవికి పోటిగా ఎవరైనా హీరోయిన్ డాన్స్ వెయ్యగలరు అంటే అప్పట్లో రాధా పేరే వినిపించేది. అంతేకాదు చిరంజీవి, రాధా ఒక సినిమా చేస్తున్నారు అంటే అది తప్పకుండా బ్లాక్ బస్టర్ అని అనుకునేవాళ్ళు. అంతగా పేరు తెచ్చుకున్న రాధా ఆ తర్వాత పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైంది. కాగా ఈమెకు  ఇద్దరు కూతుర్లు ఉన్నారు. వారిలో మొదటి కూతురు కార్తీక.

కార్తీక కూడా మనకు బాగా పరిచయమే.రాధ కూతురిగా, నటవారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది కార్తీక. అక్కినేని నాగచైతన్యతో కలిసి నాగచైతన్య మొదటి సినిమా జోష్ లో హీరోయిన్ గా నటించింది. అయితే ఆ సినిమా ఆమెకు కలిసిరాలేదు. ఆ తర్వాత కూడా తెలుగులో కొన్ని అవకాశాలు అందుకుంది. కాగా తెలుగులో ఆమె చేసిన దమ్ము, బ్రదర్ ఆఫ్ బొమ్మాలి లాంటి సినిమాలు కూడా ఆమెకు క్రేజ్ తీసుకురాలేకపోయాయి. ఇంకా అదే టైంలో తమిళం లో చేసిన రంగం సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్టయింది. అయినా ఆ తర్వాత మీకు తమిళంలో కూడా పెద్దగా స్టార్ స్టేటస్ రాలేదు. ఆ క్రమంలోనే ఆమె మెల్లగా సినిమాల నుంచి తప్పుకుంది. ఇప్పుడు చాలా రోజుల తర్వాత రోహిత్ తో కలిసి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది.

మొన్నిమధ్యనే ఇంస్టాగ్రామ్ ద్వారా తాను పెళ్ళికి సిద్ధమవుతున్నానని అనౌన్స్ చేసింది. ఈ నేపథ్యంలో నిన్న రాధా కూతురు కార్తీక పెళ్లి రంగ రంగ వైభవంగా జరిగింది. తిరువనంతపురంలోని ఉదయ్ సముద్ర లీజర్ బీచ్ హోటల్ లో జరిగిన ఈ పెళ్లికి 80ల నాటి తారలు చాలామంది హాజరయ్యారు. ముఖ్యంగా ఈ పెళ్లిలో చిరంజీవి ప్రధాన ఆకర్షణగా నిలిచారు.

సినీ వర్గాల సమాచారం మేరకు కూతురు పెళ్లి కోసం రాధ ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చి, చాలామంది టాలీవుడ్ ప్రముఖులకు పెళ్లి శుభలేఖలు అందించారు. వీళ్ళల్లో చిరంజీవి ఒకరు. అయితే ఈవెంట్ లో టాలీవుడ్ నుంచి ఎక్కువ మంది కనిపించలేదు. ఎక్కువగా హీరోయిన్లు.. వేరే భాష హీరోలు కనిపించారు. 80ల నాటి తారలు జాకీష్రాఫ్, రాధిక, సుహాసిని, రేవతి,భాగ్యరాజ్, గీత లాంటి వాళ్లు హాజరయ్యారు.

ఇంకా కొంతమంది హీరోయిన్లతో కలిసి చిరంజీవి ఆనందంగా నవ్వుతూ ఉన్న ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇక పెళ్లి విషయానికి వస్తే కేరళ సంప్రదాయ పద్ధతిలో కూతురు పెళ్లి చేసింది రాధ. ఈ పెళ్లికి సంబంధించి మరిన్ని ఫోటోలు ఇంకా బయటకి రావాల్సి ఉంది.

Also Read: World Cup 2023: ఐసీసీ ప్రపంచకప్ 2023 విజేతకు రన్నర్ జట్లకు ఇచ్చే ప్రైజ్‌మనీ ఎంతంటే

Also Read: Poco M4 5G Price: 50MP కెమెరా Poco M4 5G మొబైల్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.11,000లోపే పొందండి!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News