RRR movie: కరోనాను ఇలా తరిమి కొడదాం.. 5 భాషల్లో రాజమౌళి, తారక్, చరణ్, అలియా భట్, అజయ్ దేవ్‌గన్ సందేశం

Wear mask, take COVID-19 vaccine- RRR team: కరోనావైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే కరోనా కట్టడి చేయొచ్చో చెబుతూ దర్శకధీరుడు రాజమౌళి ఓ వినూత్న ప్రయత్నం చేశారు. ఆర్ఆర్ఆర్ మూవీలో కీలక పాత్రలు పోషిస్తోన్న రామ్ చరణ్, తారక్, ఆలియా భట్, అజయ్ దేవగన్ లతో కలిపి ఓ వీడియో సందేశం రూపొందించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 7, 2021, 12:06 AM IST
RRR movie: కరోనాను ఇలా తరిమి కొడదాం.. 5 భాషల్లో రాజమౌళి, తారక్, చరణ్, అలియా భట్, అజయ్ దేవ్‌గన్ సందేశం

Wear mask, take COVID-19 vaccine- RRR team: కరోనావైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే కరోనా కట్టడి చేయొచ్చో చెబుతూ దర్శకధీరుడు రాజమౌళి ఓ వినూత్న ప్రయత్నం చేశారు. ఆర్ఆర్ఆర్ మూవీలో కీలక పాత్రలు పోషిస్తోన్న రామ్ చరణ్, తారక్, ఆలియా భట్, అజయ్ దేవగన్ లతో కలిపి ఓ వీడియో సందేశం రూపొందించారు. ఈ వీడియోలో తాను కూడా ఓ భాగమైన రాజమౌళి... ఒక్కొక్కరి చేత ఒక్కొక్క భాషలో సూచనలు, సలహాలు చెప్పి, వాటిని పాటించాల్సిందిగా కోరుతూ వీడియో విడుదల చేశారు. 

తెలుగులో ఆలియా భట్ చెప్పగా, హిందీలో అజయ్ దేవగన్ చెప్పారు. ఎస్ఎస్  రాజమౌళి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ (SS Rajamouli, Ram Charan, Jr Ntr) దక్షిణాదిన ఉన్న మరో మూడు భాషలను కవర్ చేశారు. ప్యాన్ ఇండియా సినిమాగా వస్తున్న ప్రాజెక్ట్ కావడంతో ఈ విధంగా అన్ని భాషల వారిని దృష్టిలో పెట్టుకుని రాజమౌళి ఈ వీడియో రూపొందించారు. 

Also read: Mahesh Babu మూవీలో అందాల నిధి Nidhhi Agerwal కి ఛాన్స్ ?

మాస్కు పెట్టుకోవాల్సిందిగా, కరోనా వ్యాక్సిన్ ఇప్పించుకోవాల్సిందిగా (Wearing mask, COVID-19 vaccine), అనవసరంగా బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి కరోనాపై విజయం సాధించాల్సిందిగా కోరుతూ రాజమౌళి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ఆలియా భట్, అజయ్ దేవగన్ అభిమానులకు విజ్ఞప్తి చేసిన తీరు నెటిజెన్స్‌ని, అభిమానులను ఆకట్టుకుంటోంది.

Also read : Ravi Teja: మాస్ మహారాజా రవితేజ లేటెస్ట్ మూవీ Khiladiకి కరోనా దెబ్బ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News