Samantha: మా ఇంటి బంగారం అంటూ సమంత.. హత్య చేసే భార్యగా కనిపించనున్న హీరోయిన్

Maa Inti Bangaram: ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించింది స్టార్ బ్యూటీ సమంత. ఇప్పుడు అదే నిర్మాణ సంస్థతో తన సినిమాని తానే సొంతంగా ప్రొడ్యూస్ చేస్తోంది. ఇక మా ఇంటి బంగారం అనే టైటిల్ తో రానున్న ఈ చిత్రం గురించిన అధికారిక ప్రకటన.. ఇవాళ సామ్ పుట్టినరోజు సందర్భంగా బయటకు వచ్చింది.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Apr 28, 2024, 03:22 PM IST
Samantha: మా ఇంటి బంగారం అంటూ సమంత.. హత్య చేసే భార్యగా కనిపించనున్న హీరోయిన్

Maa Inti Bangaram First Look: గత కొంతకాలంగా తన ఆరోగ్య సమస్యల వల్ల సినిమాలకు కొంచెం దూరంగా ఉంటూ వచ్చింది స్టార్ బ్యూటీ సమంత.. ఈ మధ్యనే ఖుషి సినిమాలో కనిపించి ఒక యావరేజ్ విజయం సొంతం చేసుకుంది. అయితే ఈ చిత్రం తరువాత ఎటువంటి తెలుగు సినిమా ప్రకటించలేదు ఈ హీరోయిన్. ఈ క్రమంలో ఇక సామ్ నెక్స్ట్ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. 

వారి ఆశలు తీరుస్తూ, ఇవాళ సమంత పుట్టినరోజు సందర్భంగా తన నెక్స్ట్ సినిమా గురించిన అప్డేట్ బయటకు వచ్చేసింది. తన సొంత ప్రొడక్షన్ బ్యానర్ లో సమంత తన తదుపరి సినిమాని చేయబోతోంది. ఇప్పటిదాకా నటిగా మంచి విజయాలను అందుకున్న సమంత.. ఇప్పుడు నిర్మాతగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. తన సొంత నిర్మాణ సంస్థతో తానే హీరోయిన్ గా మొదటి సినిమాని ప్రకటించింది సమంత. మా ఇంటి బంగారం అనే ఆసక్తికరమైన టైటిల్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. 

వివరాల్లోకి వెళితే గతేడాది సమంత ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ అనే ఒక నిర్మాణ సంస్థని స్థాపించిన సంగతి తెలిసిందే. అదే నిర్మాణ సంస్థలో ఇప్పుడు సమంత మా ఇంటి బంగారం అనే సినిమా లో నటిస్తోంది. తాజాగా సమంత పుట్టినరోజు సందర్భంగా ఇవాళ చిత్ర పోస్టర్ ను విడుదల చేసింది చిత్ర బృందం. మెడలో నల్లపూసలు, చీర కట్టు, పెద్ద బొట్టుతో సమంత చూడటానికి ఒక గృహిణి పాత్రలో కనిపిస్తున్నప్పటికీ.. ఆమె చేతిలో గన్, మొహం మీద రక్తపు మరకలు సినిమాలో మరొక యాంగిల్ కూడా ఉంది అని హింట్ ఇస్తున్నాయి. 

వెనకాల క్యూట్ టెడ్డి బెర్, స్టవ్ మీద పేలడానికి రెడీ గా ఉన్న ప్రెజర్ కుక్కర్.. ఇవన్నీ చూస్తూ ఉంటే అసలు సినిమా ఎలా ఉండబోతోంది అని అభిమానులలో ఆసక్తి కల్పిస్తున్నాయి. యశోద లాగా ఈ సినిమాలో కూడా యాక్షన్ ఉండబోతోంది అని పోస్టర్ చూస్తేనే తెలుస్తోంది. 

 

సినిమా గురించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియని ఉన్నాయి. యశోదతో నటనపరంగా మంచి మార్కులు వేయించుకున్న సమంత ఈ సినిమాతో కూడా మంచి హిట్ అందుకుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.

Also Read: YSRCP Manifesto: మేనిఫెస్టోను 99 శాతం అమలుచేసి హీరోగా ప్రజల్లోకి వెళ్తున్నా: వైఎస్‌ జగన్‌

Also Read: Pithapuram: పవన్‌ కల్యాణ్‌కు భారీ షాక్‌.. పిఠాపురంలో గెలుపు కష్టమా? చెప్పులు కుట్టే వ్యక్తి కూడా

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News