The Rana Connection: హీరో రానా ముందు నుంచి ఒక మూసకు పరిమితం కాకుండా డిఫరెంట్ పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. అంతేకాదు హీరోగా నటిస్తూనే 'నంబర్ వన్ యారీ' షోకు హోస్ట్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే కదా. ఈ టాక్ షోలో సెలబ్రిటీలను పిలిచి వాళ్లకు సంబంధించిన విషయాలను అడిగి ప్రేక్షకులకు తెలియపరిచేవారు. అప్పట్లో ఈ ప్రోగ్రామ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అయింది. తాజాగా ఈయన అమెజాన్ ప్రైమ్ కోసం 'ది రానా కనెక్షన్' అంటూ ఓ టాక్ షోకు హోస్ట్‌గా వ్యవహరించబోతున్నారు. ఈ టాక్ షో ఎపుడు ప్రసారయ్యేది త్వరలోనే తెలియజేయనున్నారు. తాజాగా అమెజాన్ ప్రైమ్ వాళ్లు తమ ఫ్లాట్‌ఫామ్‌లో ప్రసారం కాబోయే సినిమాలు.. వెబ్ సిరీస్‌లు, టాక్ షోలకు సంబంధిచిన వివరాలను వెల్లడించిన సంగతి తెలిసిందే కదా. మరి అమెజాన్ ప్రైమ్ కోసం రానా దగ్గుబాటి చేస్తోన్న ఈ టాక్ షో ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
రానా విషయానికొస్త..రామా నాయుడు మనవడిగా.. వెంకటేష్ నట వారసుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. లీడర్ సినిమాతో హీరోగా పరిచయమైన రానా దగ్గుబాటి.. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'బాహుబలి'లో భళ్లాల దేవుడిగా భళా అనిపించాడు. కేవలం హీరోగానే కాకుండా.. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఎలాంటి పాత్రనైనా చేసే నటుడిగా పేరు తెచ్చుకున్నాడు.
తెలుగులో ముఖ్యంగా మెయిన్ హీరోకు తక్కువగా.. సైడ్ ఎక్కువగా అన్నట్టు తయారైంది రానా దగ్గుబాటి పరిస్థితి. అంతేకాదు తక్కువ టైమ్‌లోనే తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం సహా ఇలా ప్యాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో నటించిన ఘనత రానాకు దక్కుతుంది. లాస్ట్ ఇయర్ బాబాయి వెంకటేష్‌తో కలిసి చేసిన 'రానా నాయుడు' వెబ్ సిరీస్ మంచి పేరు తీసుకురావడమే కాదు... ఈ వెబ్ సిరీస్‌తో కొన్ని అపవాదులను కూడా మూటగట్టుకోవాల్సి వచ్చింది. రానా నటుడిగా మారక ముందు 'బొమ్మలాట' అనే సినిమాతో నిర్మాతగా మారాడు.ఈ సినిమాకు నిర్మాతగా జాతీయ అవార్డు కూడా అందుకున్నాడు. దాదాపు గ్రాఫిక్స్ డిపార్ట్‌మెంట్ ఛీప్ కో ఆర్డినేటర్‌గా పనిచేసాడు. త్వరలో హిరణ్యకశ్యప అనే అమరరాజా కథతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. త్రివిక్రమ్ కథ, మాటలు అందిస్తోన్న ఈ చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది.
Also Read: Kakinada: 'వారాహి' ఇచ్చిన వ్యక్తికి జనసేన టికెట్.. తంగెళ్ల ఉదయ్‌కు పవన్ రిటర్న్ గిఫ్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook