చీపురుతో అలరించిన రాజమౌళి.. ఇదిగో వీడియో...

కరోనా మహమ్మారి కారణంగా లాక్‌డౌన్ హాలిడేస్‌ను సినీ ప్రముఖులు తమదైన శైలిలో ఉత్సహంగా ఆనందాన్ని పంచుకుంటున్నారు. తాజాగా అర్జున్‌రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఇల్లు ఊడ్చి, గిన్నెలు తోమి,

Last Updated : Apr 20, 2020, 11:36 PM IST
చీపురుతో అలరించిన రాజమౌళి.. ఇదిగో వీడియో...

హైదరాబాద్: కరోనా మహమ్మారి కారణంగా లాక్‌డౌన్ హాలిడేస్‌ను సినీ ప్రముఖులు తమదైన శైలిలో ఉత్సహంగా ఆనందాన్ని పంచుకుంటున్నారు. తాజాగా అర్జున్‌రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఇల్లు ఊడ్చి, గిన్నెలు తోమి, గదులను శుభ్రపరిచిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతేకాకుండా ఆ ఛాలెంజ్‌ని రాజమౌళికి విసిరారు. అయితే ఈ ఛాలెంజ్‌ని స్పోర్టివ్‌గా స్వీకరించి ఆయన కూడా ఇళ్లు ఊడ్చడంతో పాటు, ఇంటి కిటికీ అద్దాలు క్లీన్ చేయడం, గిన్నెలు తోమడం తదితర పనుల ద్వారా ఛాలెంజ్ పూర్తి చేసేశారు. రాజమౌళి అంతటితో ఆగకుండా రామ్‌చరణ్, ఎన్టీఆర్, కీరవాణి, బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డలకు ఈ ఛాలెంజ్ విసిరారు.

 

Also Read:  Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!

ఇప్పటికే చరణ్ వంట చేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక ఇప్పుడు రాజమౌళి ఛాలెంజ్‌ని ఎలా స్వీకరిస్తారోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలాఉండగా కరోనా కష్టకాలంలో కష్టాన్నీ, మరొకవైపు వినోదాన్నీ పంచుతోందని అభిప్రాయపడుతున్నారు. ఏపీలో దారుణం: లాఠీ దెబ్బలకు యువకుడి మృతి!  

ఈ రకంగా అందరి సెలెబ్రిటీల నినాదమొక్కటే ‘స్టే హోమ్, స్టే సేఫ్’ అనే నినాదాన్ని ప్రజలకు గట్టిగా వినిపించేందుకు చేస్తున్న ప్రచారం ఆనందపరుస్తుంది. తాము ఇంట్లోనే ఉంటూ వినోదంతో కాలక్షేపం చేస్తూ తమదైన శైలిలో అభిమానులను ప్రజలను ఎప్పటికప్పుడు ఉత్తేజపరుస్తూ కరోనా వ్యాప్తి సంక్రమణకు అడ్డు వేయడంతో పాటు లాక్ డౌన్ కు సహకరించాలని కోరుతున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News