Benefits of Litchi: లిచ్చితో ఇన్ని ప్రయోజనాలా..?

పండ్లు తినటం వలన చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతుంటాయి. ముఖ్యంగా లిచ్చి పండు తినటం వలన అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కేన్సర్, బరువు తగ్గటం.. ఇలాంటి ప్రయోజనాలున్న లిచ్చి గురించి ఇపుడు తెలుసుకుందాం.. 

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 23, 2023, 02:50 PM IST
Benefits of Litchi: లిచ్చితో ఇన్ని ప్రయోజనాలా..?

Benefits of Litchi: లిచ్చి పండ్లను చాలా మంది తింటూ ఉంటారు. లిచ్చి తినే వారిలో చాలా మందికి ఈ పండ్ల వలన కలిగే లాభాల గురించి తెలియకుండానే తింటున్నారు. వీటి ప్రయోజనాలు తెలిసిన వారైతే ఇంకా ఇష్టంగా తింటూ ఉంటారు. లిచ్చి వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.. 

కాన్సర్ ప్రమాదం తగ్గిస్తుంది 
లిచ్చి తింటే బరువు కూడా తగ్గుతుంది, అంతేకాకుండా కాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధి కూడా వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గుతాయి. లిచ్చిని పండ్లకి రాణిగా కూడా అభివర్ణిస్తారు. రుచికరంగా ఉండే ఈ పండ్లు భోజనం తరువాత తింటే.. ఆ మజా ఏ వేరు. లిచ్చిలో ఉండే విటమిన్ సి, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీవైరల్ గుణాలు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా కేన్సర్ కారకాలకు వ్యతిరేఖంగా పోరాడతాయి. 

బెల్లీ ఫ్యాట్ తగ్గించే లిచ్చి..
బెల్లీ ఫ్యాట్ సమస్యలతో బాధపడేవారికి అందుబాటులు ఉన్న మంచి ఆప్షన్ లిచ్చి అనే చెప్పాలి. బెల్లీ ఫ్యాట్ వలన అలసట.. ఆస్తమా వంటి ఇతరేతర వ్యాధులు వచ్చే అవకాశాలు అధికం. కానీ లిచ్చిలో అధిక మొత్తంలో ఉండే డైటరీ ఫైబర్స్.. బెల్లీ ఫ్యాట్ ను తగ్గిస్తాయి. అంతేకాకూండా.. జీర్ణక్రియని మెరుగుపరుస్తాయి మరియు జీర్ణ సంబంధిత వ్యాధుల నుండి కూడా ఉపశమనం కలిగిస్తాయి. 

Also Read: CM Jagan Mohan Reddy: 8 వేల ఎకరాల్లో దేశంలోనే అతిపెద్ద సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటు: సీఎం జగన్  

బరువు తగ్గించే లిచ్చి.. 
బరువు తగ్గాలి అనుకునే వాడికి కూడా లిచ్చి ఒక అద్భుతమైన ఆప్షన్ అనే చెప్పాలి. లిచ్చి జ్యూస్ వలన అనేక ప్రయోజనాలు కలుగుతాయి. లిచ్చిలో తక్కువ పరిమాణంలో కేలరీలు ఉండటం కారణంగా.. ఈ పండ్లను లేదా జ్యూస్ తాగటం వలన శరీర విధులకు శరీరంలో నిల్వ ఉన్న కేలరీలు వినియోగించబడి... శరీర బరువు సాధారణ స్థితిలో ఉంటుంది. 

శరీరంలో నీటి శాతం తగ్గదు  
మన శరీరంలో నీటి శాతం చాలా ముఖ్యం. లిచ్చి లో నీటి శాతం ఎక్కువగా ఉండటం కారణంగా శరీరంలో నీటి శాతాన్ని పెంచడంలో లిచ్చి పండు ఉపయోగపడుతుంది.ఉందులో ఉండే కూలింగ్ ఎఫెక్ట్ పొట్టలో ఉండే వేడిని చల్లబరచడంతో పాటు శరీరంలో  నీటి శాతం తక్కువగా ఉండడం వల్ల వచ్చే వ్యాధులను తగ్గించడంలో కూడా ఈ లిచ్చి పండు ఉపయోగపడుతుంది.

Also Read: ND vs IRE Dream11 Prediction Today: క్లీన్‌స్వీప్‌కు బుమ్రా సేన రెడీ.. డ్రీమ్‌ 11 టీమ్‌లో ఎవరిని ఎంచుకోవాలి..? పిచ్ రిపోర్ట్ ఇలా..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News