Drink Water While Standing: నిలబడి నీటిని తాగడం మంచిదేనా, తాగడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు ఇవేనా?

Drinking Water While Standing Myth: నిలబడి నీటిని తాగడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా మోకాలు, తుంటి లేదా నడుము నొప్పి, కీళ్ల వాపు సమస్యలు పెరిగే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 24, 2023, 03:13 PM IST
 Drink Water While Standing: నిలబడి నీటిని తాగడం మంచిదేనా, తాగడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు ఇవేనా?

Drinking Water While Standing Myth: నిలబడి నీళ్లు తాగడం అలవాటు చాలా మందికి ఉంటుంది. ఇలాంటి వారికి పెద్దలు పదే పదే కూర్చుని నీటిని తాగమని సూచిస్తూ ఉంటారు. నిలబడి నీటిని తాగడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని ఎన్నో అపోహలు ఉన్నాయి. ఇవి ఇంతకి నిజమేనా నిలబడి నీటిని తాగడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయా? దీనిపై ఆయుర్వేద నిపుణులు ఏం అంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. 

ఆయుర్వేద నిపుణుల ప్రకారం..నిలబడి నీటిని తాగడం వల్ల జీర్ణక్రియను ప్రభావితం చేస్తుందట. ఇలా చేయడం వల్ల తీవ్ర పొట్ట సమస్యలు రావచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. తరచుగా గ్యాస్‌ సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు నిలబడి నీటిని తాగడమేనని వారంటున్నారు. తరచుగా నిలబడి నీటిని తాగేవారిలో తప్పకుండా జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పడే ఛాన్స్‌లు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ఇతర అనారోగ్య సమస్యలు కూడా వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.

కిడ్నీలపై ఒత్తిడి: 
నిలుచుని నీళ్లు తాగడం వల్ల కిడ్నీపై తీవ్ర ఒత్తిడి పడే అవకాశాలు కూడా ఉన్నాయి. దీని కారణంగానే చాలా మందిలో కిడ్నీల సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఇప్పటికే కిడ్నీల సమస్యలతో బాధపడేవారు కూర్చుని నీటిని తాగడం చాలా మేలని చెబుతున్నారు. 

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

నిలబడి నీళ్లు తాగే క్రమంలో ఊపిరితిత్తులు పూర్తిగా తెరుచుకోలేకపోవడం వల్ల వీటిపై కూడా ఒత్తిడి పడే ఛాన్స్‌లు కూడా ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా కొంతమందిలో శ్వాసకోశ వ్యవస్థ కూడా దెబ్బతింటోంది. అంతేకాకుండా ఊపిరితిత్తులు ప్రభావం తగ్గిపోయే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. 

ఎవరికైనా మోకాలు, తుంటి లేదా నడుము నొప్పి, కీళ్ల వాపు సమస్యతో బాధపడేవారు నిలబడి నీటిని తాగడం మానుకోవాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా జాయింట్ డిసీజ్‌లు అధికమయ్యే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. కాబట్టి కీళ్ల వ్యాధులతో బాధపడేవారు హాయిగా కూర్చొని నీళ్లు తాగాలని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. 

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News