Ginger Water For Acid Reflux: ఆహారం తీసుకున్న వెంటనే కొంత మందికి కడుపులో అజీర్తి, గ్యాస్ సమస్యలు వస్తాయి. ఇది యాసిడ్ రిఫ్లక్స్ వల్ల కలుగుతుంది. అయితే మన ఇంటి వంట గదిలో అల్లం అందుబాటులో ఉంటుంది. దీంతో అనేక ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా ఇందులో నయం చేసే గుణాలు ఉంటాయి. ఆయుర్వేదంలో విపరీతంగా ఉపయోగిస్తారు
అల్లం నీటిని తీసుకోవడం వల్ల ఇందులో బయో ఆక్టివ్ కాంపౌండ్స్ విటమిన్ సి, విటమిన్ b6, పొటాషియం, మెగ్నీషియం మాంగనీస్ వంటివి పుష్కలంగా ఉంటాయి. అంతే కదా ఇందులో యాంటీ ఆక్సిడెంట్ వంటివి ఉంటాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి ఇమ్యూనిటీ బూస్ట్ చేసే లక్షణాలు కూడా కలిగి ఉంటాయి. ఇది మంచి డైజేషన్ తో పాటు యాసిడ్ రీఫ్లక్స్ కి వ్యతిరేకంగా పోరాడుతుంది. మీ డైలీ రొటీన్ లో ఈ అల్లం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.
జీర్ణక్రియ..
అల్లం లో ఉండే జింజోరాలు, శాగోల్ డైజెస్టివ్ ఎంజైమ్ ఉత్పత్తికి తోడ్పడుతుంది, అల్లం నీరు డైజెస్టివ్ టానిక్ ఆహారాన్ని విడగొట్టడంలో కీలక పాత్ర ప్రవచిస్తుంది. దీంతో గ్యాస్ అజీర్తి సమస్య తగ్గిపోతుంది అల్లం నీటిని తీసుకోవడం వల్ల జీర్ణ క్రియ మెరుగ్గా మారుతుంది.
యాసిడ్ రీఫ్లక్స్..
తిన్న వెంటనే సమస్య కూడా వస్తుంది అల్లం నీటిని మన డైట్ లో తిన్న వెంటనే తీసుకోవడం వల్ల యాసిడ్ రీఫ్లక్స్ సమస్య తగ్గిపోతుంది. అందుకే ప్రతిసారి తిన్న వెంటనే మీరు యాసిడ్ అల్లం నీటిని తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.
మెటబాలిజం..
అల్లం నేటిలో థర్మోజెనిక్ గుణాలు ఉంటాయి, ఇది మెటబాలిక్ రేటును పెంచుతుంది పచ్చి అల్లం తీసుకోవడం వల్ల క్యాలరీలు కూడా కరిగిపోతాయి బరువు పెరగకుండా ఉంటారు.
బలమైన ఇమ్యూనిటీ..
అల్లం లో ఆంటీ ఆక్సిడెంట్లకు పవర్ హౌస్ ఇందులో మంట సమస్య తగ్గించే గుణాలు ఉంటాయి. ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తాయి. ముఖ్యంగా ఇందులో ఉండే విటమిన్స్, మినరల్స్, విటమిన్ సి, వ్యాధుల బారి నుంచి కాపాడతాయి అల్లం నీటిని తరచూ తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ వ్యవస్థ బలపడుతుంది. సీజనల్ జలుబు, ఫ్లూ నుంచి బయటపడవచ్చు.
బాడీ డిటెక్సిఫై..
అల్లం నీటిని తీసుకోవడం వల్ల బాడీ డిటెక్సిఫై అవుతుంది శరీరంలో విష పదార్థాలు బయటికి పంపించేస్తుంది. ఇది నేచురల్ డైరెక్టిక్ గుణాలు కలిగి ఉంటుంది. దీంతో శరీరంలో ఉండే విష పదార్థాలు యూరిన్ ద్వారా బయటికి వెళ్లిపోతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ఫ్రీ రాడికల్స్ ని సమతులం చేస్తాయి. ఆక్సిడేటివ్ డ్యామేజ్ నుంచి కాపాడుతుంది.
అల్లం బ్లడ్ సర్కులేషన్ ను మెరుగు చేస్తుంది. ఇవి రక్త నరాలను ఉపశమనం కలిగిస్తాయి. దీంతో రక్తంలో ఆక్సిజన్ రావాణాకు సహకరిస్తాయి ప్రతిసారి జింజర్ అల్లం నేటిని తీసుకోవటం వల్ల రక్త సరఫరా కూడా మెరుగ్గా ఉంటుంది దీంతో కార్డియా ఆరోగ్యం బాగుంటుంది.
షుగర్ నియంత్రణ..
అంతేకాదు పచ్చి అల్లం తీసుకోవటం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్ అదుపులో ఉంటాయి. ఇది డయాబెటిస్ వారికి ఎంతో మంచిది ఇన్సూలిన్ నిరోధకతను నిర్వహిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలో హఠాత్తుగా పెరగకుండా కాపాడుతుంది.
ఇదీ చదవండి: బియ్యంపిండితో ముఖంపై ఉన్న అవాంఛిత రోమాలను సులభంగా తొలగించుకోండి..
పీరియడ్స్ పెయిన్..
పీరియడ్స్ పెయిన్ తో బాధపడుతున్న మహిళలకు కూడా అల్లం ఎఫెక్టీవ్ రెమిడీ. అల్లం నీటిని తీసుకోవడం వల్ల కడుపు నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
చర్మ ఆరోగ్యం
అల్లం లో ఉండే ఆంటీ ఆక్సిడెంట్ యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాల వల్ల చర్మం ఆరోగ్యంగా కనిపిస్తుంది. చర్మంపై ఇతర చర్మ సంబందిత సమస్యలు తగ్గిపోతాయి. అంతేకాదు అల్లం నేటి వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది.
రెండు కప్పుల నీటిలో ఒక ఇంచు అల్లం ముక్క కట్ చేసి వేయాలి. ఒక రెండు, మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఆ తర్వాత సిమ్ లో మరో 10 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత వడకట్టుకొని ఆ నీటిని తీసుకోవాలి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)
ఇదీ చదవండి: వర్షా కాలంలో ఈ ఆహారాలు తింటున్నారా.. తస్మాత్ జాగ్రత్త!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి