Viral: అసలే ఉరుకులు పరుగుల జీవితం. చాలా మంది సరిగా కునుకు కూడా తీయలేకపోతున్నారు. ఇక స్మార్ట్ ఫోన్ వాడకం విరివిగా పెరిగిపోవడంతో.. అర్థరాత్రిళ్లు వరకు మేల్కోని ఉంటున్నారు. ఫలితంగా ఉదయాన్నే ఆలస్యంగా నిద్రలేస్తుంటారు. అయితే తాజాగా అమెరిస్లీప్(Amerisleep) అనే సంస్థ నిర్వహించిన అధ్యయనంలో ఆలస్యంగా నిద్రలేచే(Late wakeup timing) వారికంటే.. తొందరగా నిద్రలేచే వారిలో మెరుగైన పనితనం.. ఎక్కువగా జీతాలు, అద్భుతమైన జీవనశైలి ఉంటుందని వెల్లడైంది.
వయసు ప్రకారం ఉదయం దినచర్యలు మారే తీరును అమెరిస్లీప్ అనే సంస్థ అధ్యయనం చేసింది. అయితే చాలా మంది ఉదయం 6 గంటలకు నిద్రలేవాలని దాదాపు 40 శాతం వరకు అనుకుంటారు. ఉదయం 6 గంటల లోపు నిద్రలేచే వారిలో మెరుగైన పనితనం(Improved performance) ఉంటుంది. సర్వే ప్రకారం ఉదయం 4 గంటలకు నిద్రలేచే వారిలో దాదాపు 71శాతం మంది ఎక్కువగా మెరుగైన పనితనం కలిగి ఉంటారు. అలాగే ఉదయం 11 గంటలకు నిద్రలేచే వారితో పోలిస్తే.. వీరిలో మెరుగైన పనితనం ఉంటుంది.
అయితే పనులను పూర్తి చేయడం కోసం అలారం(Alarm) సెట్ చేసుకోవడం సరైన మార్గం కాదు. ఉదయం తొందరంగా లేచే వ్యక్తులు.. సంవత్సరానికి దాదాపు 33 లక్షల వరకు సంపాదిస్తారట. ఆలస్యంగా నిద్రలేచే వారు సంవత్సరానికి 22 లక్షలు సంపాదిస్తారట. అంటే ఆలస్యంగా నిద్రలేచే వారికంటే.. తొందరగా 4 గంటలకు నిద్రలేచే వారు దాదాపు 10 లక్షలు ఎక్కువగా సంపాదిస్తారట. ఉదయం 4 గంటల నుంచి 5 గంటల మధ్య నిద్రలేచే వారు అత్యధికంగా రూ. 35 లక్షల వరకు సంపాదిస్తారు. ఇక మధ్యాహ్నం సమయంలో నిద్రలేచే వారు సంవత్సరానికి కనీసం రూ 16 లక్షలు సంపాదిస్తారట.
తొందరగా నిద్రలేచే వారు వారి జీవినవిధానం వల్ల సంతోషంగా.. సంతృప్తిగా ఉంటారు. అలాగే ఆలస్యంగా నిద్రలేచే వారు మాత్రం సంతృప్తిగా గడపరని.. ఆలస్యంగా నిద్రపోయేవారితో పోలిస్తే.. తొందరగా నిద్రపోయే వారు ఆరోగ్యం, మెరుగైన నిద్ర, జీవనశైలి(Lifestyle) బాగుంటుందని తెలీంది. తొందరగా మేల్కోవడం వలన మీకు రోజు ఎక్కువగా సమయం ఉన్నట్లుగా అనిపిస్తుంది. అలాగే మరికొన్ని గంటలు ఎక్కువగా ఉన్నట్లుగా అనిపిస్తంది. వీరికి మెరుగైన పనితనం ఉంటుంది. దీంతో వీరు ఎక్కువ జీతాన్ని అందుకుంటారు. ఇక ఆలస్యంగా నిద్రలేచేవారు… సోమరితనంగా.. బద్దకంగా ఉంటారు. అలాగే పనిపై ప్రభావం చూపిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook