Congress vs BRS: బీఆర్ఎస్ ను రాజకీయంగా ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ ఆపరేషన్ స్టార్ట్ చేసిందా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. తెలంగాణలో గత వారం పదిరోజులుగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే బీఆర్ఎస్ పొలిటికల్ గా కార్నర్ చేయడానికి గట్టిగానే ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలపూ ఇప్పుడు విచారణ వేగవంతం చేసింది. విద్యుత్ ఒప్పందాలు, కాళేశ్వరం ప్రాజెక్టు, ఈ ఫార్ములా రేసింగ్ లకు సంబంధించిన విచారణలను కాంగ్రెస్ స్పీడప్ చేసింది. ఇప్పటికే ఈ ఫార్మాలా రేసింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. కేటీఆర్ ను విచారించడానికి గవర్నర్ అనుమతిని కూడా ఇచ్చారు. దీంతో కేటీఆర్ విచారణ ఎలా ఉండబోతుంది..కేటీఆర్ పై ఏసీబీ నమోదు చేసిన కేసుతో ఎలాంటి పరిణామాలు జరగబోతాయో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఇప్పటికే కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారంటూ పెద్ద ఎత్తున పొలిటికల్ సర్కిల్ లో టాక్ నడుస్తుంది. గతంలో కూడా కేటీఆర్ అరెస్ట్ తప్పదు అంటే కాంగ్రెస్ పెద్దలు పలు సందర్భాల్లో బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఇదే నేపథ్యంలో ఇప్పుడు ఏసీబీ కేస్ ఫైల్ చేయడంతో ఇక కేటీఆర్ అరెస్ట్ తప్పదా అంటే ఊహాగానాలు నడుస్తున్నాయి. అరెస్ట్ పై కేటీఆర్ కూడా మానసికంగా సిద్దమైనట్లు తెలుస్తుంది. ఫార్ములా ఈ రేసింగ్ కేసు తెరపైకి వచ్చిన కొత్తలో కాంగ్రెస్ తనను అరెస్ట్ చేస్తే చేసుకోనివ్వండి. అరెస్ట్ కు నేను రెడీ . అవసరమైతే రెండు నెలల పాటు జైలుకు వెళ్లడానికి సిద్దం అన్నట్లు ప్రకటించారు. దీంతో కేటీఆర్ కు కూడా తన అరెస్ట్ పై కొంత సమాచారం ఉన్నట్లు తెలుస్తుంది.
ఇక మరో ముఖ్య అంశం ఏంటంలే గత నాలుగైదు రోజులుగా మరో రెండు కీలక అంశాలపై రేవంత్ సర్కార్ దృష్టి సారించింది. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు జరిగిన విద్యుత్ ఒప్పందాలు, కాళేశ్వరం ప్రాజెక్టు అంశాలపై కూడా విచారణ స్టార్ చేసింది. ఇప్పటికే ఈ రెండు అంశాలపై జ్యుడీషియల్ ఎంక్వైరీ కొనసాగుతుంది. విద్యుత్ ఒప్పందాలపై నాటి కేసీఆర్ సర్కార్ తీసుకున్న నిర్ణయాలపై అధికారులతో జస్టిస్ లోకూర్ కమిషన్ విచారణ జరుపుతుంది. జస్టిస్ లోకూర్ కమిషన్ ఓ నివేదికను కూడా విడుదల చేసింది. విద్యుత్ అంశంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు ప్రజలపై వేల కోట్ల భారం పడేలా చేసిందని నివేదికను ఇచ్చంది. దీంతో ప్రభుత్వం జస్టిస్ లోకూర్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా అసెంబ్లీలో చర్చ నిర్వహించి కేసీఆర్ పై అవసరమైతే కేసు కూడా నమోదు చేయడానికి సిద్దంగా ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీంతో అతి త్వరలోనే కేసీఆర్ పై కూడా కేసు నమోదుకు రంగం సిద్దమైనట్లుగా రాజకీయవర్గాల్లో ప్రచారం జరగుతుంది.
ఇక కాళేశ్వరం ప్రాజెక్టుపై కూడా జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ ఎంక్వైరీ స్పీడప్ చేసింది. గత రెండు మూడు రోజులుగా కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణలో భాగంగా బీఆర్ఎస్ హయాంలో కీలకంగా వ్యవహరించిన ఐఏఎస్ అధికారులను విచారించింది తమ పాత్ర చాలా పరిమితం అని నాటి ప్రభుత్వాధినేత చెప్పినట్లుగా తాము నడుచుకున్నామని విచారణకు హాజరైన అధికారులె చెప్పారు. అంతే కాదు కాళేశ్వరం ప్రాజెక్టులతో కేసీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు పేరు కూడా కమిషన్ తెరపైకి తీసుకు వచ్చింది. అధికారులు కూడా పలు సందర్భాల్లో హరీష్ రావు పేరును చెప్పినట్లుగా ప్రచారం జరుగుతుంది. ఇప్పటి వరకు కేవలం కేసీఆర్, కేటీఆర్ పేర్లు మాత్రమే వినిపించగా తాజాగా హరీష్ రావు పేరు తెరమీదకు రావడం మాత్రం కొంత రాజకీయంగా సంచలనంగా మారింది. కాళేశ్వరం కేసులో హరీష్ రావును కూడా కాంగ్రెస్ ఇరికించబోతుందా అన్న చర్చ పొలిటికల్ సర్కిల్ లో నడుస్తుంది.
ఫార్ములా ఈ రేసింగ్ లో కేటీఆర్, విద్యుత్ ఒప్పందాల విషయంలో కేసీఆర్, కాళేశ్వరం అంశంలో హరీష్ రావు ఇలా బీఆర్ఎస్ కీలక నేతలను ఒకే సారి కేసులో ఇరికించేలా కాంగ్రెస్ వ్యూహాలు అమలు చేస్తుందా అన్న చర్చ బాగా వినిపిస్తుంది. ఒక వైపు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతుండగానే మరోవైపు ఈ ముగ్గురు నేతలపై కేసులు నమోదు అవుతాయని ప్రచారం కావడం మాత్రం రాజకీయవర్గాల్లో పెను సంచలనంగా మారింది. కేటీఆర్ పై కేసు నమోదు కావడంతో ఇక కేసీఆర్ , హరీష్ రావులపై కూడా కేసులు నమోదు కాబోతున్నాయా అనే సందేహాలు బీఆర్ఎస్ లో వ్యక్తం అవుతున్నాయి.
ఒక వేళ బయట ప్రచారం జరుగుతున్నట్లుగా కాంగ్రెస్ కేసీఆర్, హరీష్ రావులపై కేసులు పెడితే రాజకీయాలు ఎలా మలుపుతిరగబోతున్నాయి..? కేసుల విషయంలో బీఆర్ఎస్ ఏం చేయబోతుంది..? అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. కేసుల విషయంలో బీఆర్ఎస్ క్యాడర్ లో పైకి గంభీరంగా కనిపిస్తున్నా లోలోన కొంత ఆందోళణ కనిపిస్తుంది. తమ అభిమాన నేతలను కాంగ్రెస్ రాజకీయ కుట్రలో భాగంగా టార్గెట్ చేస్తుందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ నాయకత్వంపై కాంగ్రెస్ చేస్తున్న రాజకీయ దాడిని ప్రజలే తిప్పి కొడుతారని వారు చెప్పుకొస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ మాత్రం బీఆర్ఎస్ హయాంలో అత్యంత అవినీతి జరిగింది. బీఆర్ఎస్ నాయకత్వం అనేక అక్రమాలకు పాల్పడింది. వాటికి తగిన శిక్ష తప్పదంటూ కాంగ్రెస్ హెచ్చరిస్తుంది.
మొత్తానికి ప్రస్తుత రాజకీయ పరిణమాలు చూస్తుంటే ఒకే దెబ్బకు మూడు పిట్టలు అన్నట్లుగా కాంగ్రెస్ వ్యూహం కనబడుతుంది. ఒక్కొరిగా కాకుండా ముగ్గురిని ఒకేసారి కేసుల్లో ఇరికిస్తే ఆ పార్టీ డిఫెన్స్ లో పడిపోతుందనేది కాంగ్రెస్ వ్యూహంగా తెలుస్తుంది. ముఖ్యనేతలను టార్గెట్ చేయడం వల్ల మిగితా లీడర్లు, క్యాడర్ చెల్లా చెదురవుతుంది. అప్పుడు పొలిటికల్ గా కాంగ్రెస్ కు కలిసి వస్తుందనేది కాంగ్రెస్ ఆలోచనగా తెలుస్తుంది.ఇలా కాంగ్రెస్ స్టార్ట్ చేసిన ఆపరేషన్ టాప్ 3 అనేది తెలంగాణ రాజకీయాలను ఎలాంటి మలుపులు తిప్పబోతుంది..? నిజంగానే కాంగ్రెస్ ప్లాన్ చేస్తున్నట్లుగా బీఆర్ఎస్ అధినాయకత్వం కేసుల్లో ఇరుక్కోబోతుందా అనేది మాత్రం భవిష్యత్తులోనే తేలనుంది.
Read more: Mohan Babu: మోహన్ బాబు టాయ్ లెట్‌లో చేతులు పెడతారు..!.. షాకింగ్ విషయం బైటపెట్టిన బెల్లంకొండ సురేష్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter