బెంగళూరు: కర్నాటక రాష్ట్రంలో ఓ అంధుడికి ప్రభుత్వం తరఫున ఘోర అవమానం జరిగింది. అంగవైకల్యం కలవారికి బాసటగా నిలవాల్సిన ప్రభుత్వమే.. ఓ అంధుడి గోడును పట్టించుకోలేదు. ఉద్యోగ సమస్య కోసం అని వస్తే బలవంతంగా అతడిని బయటకు గెంటేశారు అధికారులు
వివరాల్లోకి వెళితే.. కర్నాటకలో తన ఉద్యోగానికి సంబంధించిన సమస్యపై మాట్లాడదామని ఓ అంధుడు విధానసౌధకి వెళ్లాడు. అయితే అక్కడున్న ఓ సెక్యూరిటీ సిబ్బంది అంధుడని కూడా చూడకుండా నిర్లక్ష్యంగా, నిర్ధాక్షిణ్యంగా వ్యవహరించారు. ఎలివేటర్‌లోకి అడుగుపెట్టనీయకుండా బలవంతంగా బయటకి గెంటేశారు. ప్రజల కోసం చట్టాలను తయారుచేసే చట్టసభ కార్యాలయంలో ఇలాంటి ఘటన జరగడాన్ని బీజేపీతో పాటు ఇతర రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండించాయి.
#WATCH: Blind man forced to come out of the elevator at Vidhan Soudha in Bengaluru, as he was trying to enter the premises over job related grievances. #Karnataka (03.03.2018) pic.twitter.com/3SCfHsGIlp
— ANI (@ANI) March 4, 2018
అంధుడని కూడా చూడకుండా గెంటేశారు