Door to Door Vaccination: ఇంటింటికీ వ్యాక్సినేషన్‌పై కేంద్రంపై బోంబే హైకోర్టు అసహనం

Door to Door Vaccination: కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియపై బోంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేంద్ర ప్రభుత్వ విధానంపై అసహనం వ్యక్తం చేసింది. ఇంటింటికీ వ్యాక్సిన్ డ్రైవ్ ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించింది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 12, 2021, 08:53 PM IST
Door to Door Vaccination: ఇంటింటికీ వ్యాక్సినేషన్‌పై కేంద్రంపై బోంబే హైకోర్టు అసహనం

Door to Door Vaccination: కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియపై బోంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేంద్ర ప్రభుత్వ విధానంపై అసహనం వ్యక్తం చేసింది. ఇంటింటికీ వ్యాక్సిన్ డ్రైవ్ ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించింది.

డోర్ టు డోర్ వ్యాక్సినేషన్ (Door to Door Vaccination) కార్యక్రమంపై దాఖలైన పిటీషన్లపై విచారణ సందర్బంగా బోంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం(Central Government) అనుసరిస్తున్న వ్యాక్సిన్ విధానం కారణంగా దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ డ్రైవ్ సాధ్యం కాదని కోర్టు అసహనం వ్యక్తం చేసింది. కేరళ, జమ్ముకశ్మీర్ రాష్ట్రాలు పాటిస్తున్న డోర్ టు డోర్ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని పరిశీలించాలని కేంద్రానికి సూచించింది. ఆ రెండు రాష్ట్రాలు ఇంటింటికీ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తుంటే..రాష్ట్రాల్లో ఈ పద్ధతి సాధ్యం కాదని చెబుతున్నారంటూ కేంద్ర ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసింది. ఈ విధానాన్ని అమలు చేయడంలో కేంద్రానికి ఎదురవుతున్న సమస్యేంటని బోంబై హైకోర్టు ప్రశ్నించింది.

ఆ రాష్ట్రాలు అవలంభిస్తున్న కార్యక్రమాన్ని తాము కూడా చేపడతామని మంబై మున్సిపల్ కార్పొరేషన్..కేంద్రానికి లేఖ రాసిన సంగతిని ఈ సందర్భంగా న్యాయవాదులు ప్రస్తావించారు.కేంద్ర ఆరోగ్య శాఖతో సంప్రదించి తగిన ఆదేశాలు తీసుకోవాలని..సాధ్యాసాధ్యాల్ని వీలైనంత త్వరగా పరిశీలించాలని బోంబే హైకోర్టు (Bombay High Court) కేంద్రానికి సూచించింది. విచారణను ఈ నెల 14వ తేదీకు వాయిదా వేసింది.

Also read: PK and Sarad Pawar: శరద్ పవార్, పీకేల కలయిక వెనుక వ్యూహమేంటి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News