Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి రీఎంట్రీ..ఏ పార్టీ నుంచో తెలుసా..?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారా..? మళ్లీ కాంగ్రెస్ నుంచే రెండో ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారా..? హస్తం పార్టీ నేతలు ఏమంటున్నారు....? ఆ పార్టీ అధిష్టానం వాదన ఎలా ఉంది....? 

Written by - Alla Swamy | Last Updated : Sep 21, 2022, 06:17 PM IST
  • రాజకీయాల్లోకి చిరంజీవి రీఎంట్రీ
  • ఆసక్తికరంగా మారిన వార్త
  • కాంగ్రెస్ కీలక నిర్ణయం
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి రీఎంట్రీ..ఏ పార్టీ నుంచో తెలుసా..?

Chiranjeevi: మెగాస్టార్, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి రాజకీయాల్లో రాబోతున్నారన్న వార్త హాట్ టాపిక్‌గా మారింది. ఇందుకు ఊతం ఇచ్చేలా కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా ఆయనను పీసీసీ డెలిగేట్‌గా నియమించింది. ఏపీసీసీ డెలిగేట్‌గా గుర్తిస్తూ కొత్త ఐడీ కార్డును ప్రింట్ చేయించింది. 2027 వరకు చిరంజీవిని పీసీసీ డెలిగేట్‌గా గుర్తించింది. రాజకీయాలకు సంబంధించి నిన్న ఆసక్తికర పోస్ట్ చేశారు. ఈనేపథ్యంలో కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరంగా మారింది.

ఈపదవిని చిరంజీవి స్వీకరిస్తారా..లేదా అన‌్నది ఉత్కంఠగా మారింది. తాను రాజకీయాలకు దూరం కాలేదని..తాను ఎప్పుడూ టచ్‌లో ఉంటానని వ్యాఖ్యనిచ్చారు. దీంతో ఆయన రాజకీయాల్లో రీఎంట్రీ ఇవ్వబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. డెలిగేట్లకు ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం కల్పించారు. దాదాపు తొమ్మిది వేల మంది డెలిగేట్లు పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొననున్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

మెగాస్టార్ చిరంజీవి.. కాంగ్రెస్‌లో ఉన్నారా లేరా అన్న దానిపై క్లారిటీ లేదు. గతకొంతకాలంగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. వరుసగా సినిమాలు చేసుకుంటున్నారు. ఈనేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కొత్త ఐడీ కార్డు మంజూరు చేయడంపై రాజకీయంగా చర్చ జరుగుతోంది. అక్టోబర్ 17న కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబర్ 24 నుంచి 30 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. నామినేషన్ల ఉపసంహణకు అక్టోబర్ 8 వరకు గడువు ఉంది. ఎన్నికల అనంతరం రెండురోజుల తర్వాత తుది ఫలితాలను ప్రకటించనున్నారు. 

2009 ఎన్నికల ముందు ఆయన ప్రజారాజ్యం పార్టీకి స్థాపించారు. ఐతే ఆ ఎన్నికల్లో చిరంజీవి పార్టీ కేవలం 18 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందింది. పార్లమెంట్ స్థానాల్లో సత్తా చాటలేకపోయింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ప్రజా రాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. దీంతో మెగాస్టార్ చిరంజీవి..తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడిగా, కేంద్రమంత్రిగా పనిచేశారు. 2014లో రాష్ట్ర విభజన తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారు.

2017లో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. వరుసగా సినిమాలు చేస్తూ..యువ హీరోలకు పోటీగా నిలుస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో ఐదారు మూవీలు ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా గాడ్ ఫాదర్ మూవీతో బిజీబిజీగా ఉన్నారు. ఈనేపథ్యంలో ఆయన రాజకీయాలపై హాట్ కామెంట్స్ చేశారు. తాను రాజకీయాలకు దూరంగాలేనట్లు సంకేతాలు ఇచ్చారు. అదే సమయంలో కాంగ్రెస్ అధిష్టానం స్పందించడం పెను సంచనలనంగా మారింది. 

 

Also read:IND vs AUS: డెత్ ఓవర్లలో టీమిండియా బౌలర్లు ఇలా చేయాలి..సునీల్ గావస్కర్ సలహా..!

Also read:Bathukamma Sarees: బతుకమ్మ చీరల పంపిణీకి అంతా రెడీ..ఈసారి ఎంతమందికంటే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News