'కరోనా వైరస్' భూతం జడలు విప్పుతూనే ఉంది. రోజు రోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇండియాలో రోజురోజుకు పెరుగుతున్న కేసులు కొత్త రికార్డులకు తెరతీస్తున్నాయి.
గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6 వేల 977 కొత్త పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. అంతేకాదు నిన్న ఒక్క రోజే 154 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. కొత్త కేసులు, కరోనా మృతుల విషయంలోనూ ఒక్క రోజులో ఇవే అత్యధిక రికార్డులు కావడం విశేషం. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య లక్షా 38 వేల 845కు చేరింది. అందులో 77 వేల 1403 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటి వరకు 57 వేల 720 మంది చికిత్స తీసుకుని సురక్షితంగా ఇంటికి వెళ్లారు. మొత్తంగా 4 వేల 21 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. రికవరీ రేటు 41.57 శాతంగా ఉందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.
మరోవైపు మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే పాజిటివ్ కేసుల సంఖ్య 50 వేల మార్క్ దాటింది. ప్రస్తుతం 50 వేల 231 కేసులు నమోదు కాగా.. అందులో 1635 మంది చనిపోయారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ రోజూ పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలో కేసులు సంఖ్య 1854కు చేరగా.. ఆంధ్రప్రదేశ్‌లో 2వేల 823 కేసులు నమోదయ్యాయి.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
24 గంటల్లో 6 వేల 977 కేసులు..!!