Happy Diwali: దేశ ప్రజలకు రాష్ట్రపతి కోవింద్​, ప్రధాని మోదీ దీపావళి శుభాకాంక్షలు

Happy Diwali: దేశప్రజలకు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​, ప్రధాని నరేంద్ర మోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహా పలువురు కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళి అందరికి మేలు చేయాలని ఆంకాక్షించారు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 4, 2021, 12:11 PM IST
  • దేశవ్యాప్తంగా వైభంగా దీపావళి సంబరాలు
  • దేశప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని శుభాకాంక్షలు
  • పర్యావరణ హితం కోసం ప్రతిజ్ఞ చేయాలని రాష్ట్రపతి పిలుపు
  • ఈ సారి కూడా సైనికులతోనే మోదీ సెలెబ్రేషన్స్​!
Happy Diwali: దేశ ప్రజలకు రాష్ట్రపతి కోవింద్​, ప్రధాని మోదీ దీపావళి శుభాకాంక్షలు

PM Modi Diwali Greetings: దేశవ్యాప్తంగా నేడు దీపావళి సంబరాలు వైభవంగా జరుగుతున్నాయి. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దేశ విదేశాల్లోని భారతీయులు దీపావళిని జరుపుకుంటారు.

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని.. రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ (Ramnath Kovind Diwali Wishes) దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. 

'దీపావళి శుభ సందర్భంగా దేశప్రజలందరికీ నా శుభాకాంక్షల. చెడుపై మంచి, చీకటిపై వెలుగు విజయం సాధించిన పండుగ దీపావళి. మనమందరం కలిసి, ఈ పండుగను సురక్షితంగా జరుపుకుందాం. పర్యావరణ పరిరక్షణలో తమవంతు సహకారం అందిస్తామని ప్రతిజ్ఞ చేద్దాం.' అని రాష్ట్రపతి ట్వీట్​ చేశారు.

Also read: Diwali Celebrations: దీపావళి సంబరాలు రెండు గంటలే జరుపుకోవాలి

ఈ దీపాల పండుగ మీ జీవితాల్లో సుఖసంతోషాలు, శ్రేయస్సు, అదృష్టాన్ని నింపాలని కోరుతున్నట్లు' ట్విట్టర్​ ద్వారా దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ.

Also read: Abhinandan Varthaman: అభినందన్‌ వర్ధమాన్‌కు గ్రూప్‌ కెప్టెన్‌గా ప్రమోషన్​!

'ఇంటికి, సమాజానికి, జగతికి వెలుగులు పంచే దీపోత్సవమైన దీపావళి పండుగ సందర్భంగా దేశ ప్రజలందరికీ హార్ధిక శుభాకాంక్షలు. ఈ పండుగ మీ అందరి జీవితాల్లో సంపూర్ణ సమృద్ధిని తీసుకురావాలని, సరికొత్త ముందడుగుకు మార్గదర్శనం చేయాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నాను.' అని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ట్విట్​ చేశారు.

Also read: Diwali Vastu Tips: దీపాలను దక్షిణంవైపు తిప్పకండి..లక్ష్మీపూజ సాయంత్రం 6.32గం-8.21గం చేయాలి

'దీపావళి శుభ సందర్భంగా మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ పండుగ మీ జీవితంలో ఆనందం, పురోగతి, శ్రేయస్సును పెంచాలని, భగవంతుని ప్రార్థిస్తున్న' అని రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్ పేర్కొన్నారు.

Also read: Deepavali 2021 Safe Tips: 'దీపావళి' రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ జాగ్రత్తలు మరవద్దు

'చెడు పై మంచి సాధించిన  విజయమే  దీపావళి.  ఈ దీపకాంతులు అందరి జీవితాల్లో సుఖసంతోషాలని,  అష్టైశ్వర్యాలని, వెలుగులు నింపాలని కోరుకుంటూ అందరికి దీపావళి శుభాకాంక్షలు' - కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​

దీపావళి సందేశం ఇదే..

కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ కూడా దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
'దీపపు వెలుగు ఎలాంటి తారతమ్యాలు లేకుండా అందరినీ వెలుగునిస్తుంది. ఇదే దీపావళి సందేశం. మీ ప్రియమైన వారి మధ్య దీపావళి జరుపుకోండి, అందరి హృదయాలను కనెక్ట్ చేసే వ్యక్తిగా ఉండండి!' అని ట్వీట్ చేశారు.

వీరితో పాటు.. ఇతర కేంద్ర మంత్రులు, ప్రముఖులు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

Also read: Ayodhya Deepotsav: అయోధ్యలో అంగరంగ వైభవంగా దీపోత్సవం ప్రారంభం

ఈ ఏడాది సైనుకులతో కలిసే దీపావళి..

ప్రధాని ఈ సారి కూడా సైనికులతో కలిసి దీపావళి పండుగ జరుపుకోనున్నారు. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. సైనికులతో ఈ పండుగను జరుపుకోవడం సాంప్రదాయంగా పాటిస్తున్నారు మోదీ. ఇందులో భాగంగా గత ఏడాది.. రాజస్థాన్​లోని జైసల్మేర్​లో లోంగేవాలా సరిహద్దు వద్ద.. అంతకు ముందు ఏడాది జమ్ము కశ్మీర్​లో రాజౌరీ జిల్లాలో సైనికులతో కలిసి దీపావళి ఉత్సవాల్లోపాల్గొన్నారు మోదీ. ఈ సారి కూడా జమ్ము కశ్మీర్​లోనే దీపావళి ఉత్సవాలు జరుపుకోనున్నారు ప్రధాని. ఇందుకోసం ఇప్పటికే నౌషిరా సెక్టార్​కుచేరుకున్నారు.

Also read: Fuel Price Cut: భారీగా దిగొచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ప్రస్తుత రేట్లు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News