న్యూ ఢిల్లీ: కరోనా వైరస్ పాజిటివ్ వ్యక్తులకు చికిత్స అందిస్తున్న ఆస్పత్రులలో డాక్టర్ల పరిస్థితి ఎంతో ఆందోళనకరంగా ఉందనడానికి అద్దంపట్టేలా ఉంది ఈ వీడియో. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో కరోనా వైరస్ రోగులకు చికిత్స అందిస్తున్న యువ లేడీ డాక్టర్ అంబిక తన వ్యక్తిగత అనుభవాన్ని, ప్రస్తుతం తాను గురవుతున్న మనోవేధనను తలచుకుని కన్నీటి పర్యంతమయ్యారు. మీడియాతో మాట్లాడుతుండగానే ఆమె కళ్లలో నీళ్లు తిరగడం చూస్తే.. నవ్వుతూ మాట్లాడుతున్న ఆ కళ్ల వెనుక ఎంత బాధ ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
Also read : salary increments: ఆ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు
ఇంటికి ఫోన్ చేసిన ప్రతీసారి ఏదో ఓ తెలియని భయం వెంటాడుతోంది. ఎప్పుడు ఏం వినాల్సి వస్తుందా అనే టెన్షనే ఎక్కువుంటోంది. వృత్తిధర్మం నిర్వహించే క్రమంలో తమకు ఏదైనా అయితే.. తమను చూడ్డానికి తల్లిదండ్రులు రాలేని దుస్థితి. అదే సమయంలో వాళ్లకు ఏదైనా ఇబ్బంది ఎదురైతే.. వాళ్లను చూడ్డానికి కూడా వెళ్లలేమనే భావనే తట్టుకోలేకపోతున్నామని చెబుతుండగానే డాక్టర్ అంబిక కళ్లలో నీళ్లు తిరిగాయి. తాను తన తల్లిదండ్రులను చూసి చాలా రోజులయిందని.. అందుకే వాళ్ల పేర్లు గుర్తుకు రాగానే కన్నీళ్లు ఆగడం లేదని అంబిక ఆవేదన వ్యక్తంచేశారు.
#WATCH Dr Ambika, who is posted at #COVID19 treatment ward of Delhi AIIMS, breaks down while speaking about her professional challenges amid coronavirus pandemic. pic.twitter.com/erNNUIh7Il
— ANI (@ANI) April 6, 2020
Also read : Watch video: కేంద్రం లాక్ డౌన్ ఎత్తేసినా.. రాష్ట్రంలో నేను కొనసాగిస్తా: సీఎం కేసీఆర్
కోవిడ్ పాజిటివ్ పేషెంట్స్‌కి చికిత్స చేయడం, కరోనాపై నిజంగానే ఓ యుద్ధం చేసినట్టుగా ఉందని.. అయితే, ఎప్పుడు.. ఎంత కష్టం ఎదురైనా.. తన కుటుంబం మాత్రం తనను ఎప్పుడూ వెనక్కి తిరిగొచ్చేయమని చెప్పలేదని.. అదే తన కుటుంబ నేపథ్యం గొప్పతనమని డా అంబిక గుర్తుచేసుకున్నారు. డా అంబిక చెబుతున్న మాటలు వింటుంటే... దేశంలో ఎంతమంది డాక్టర్లు ఈ రకమైన కష్టాలను దిగమింగుకుంటూ కరోనా రోగుల ప్రాణాలు నిలబెడుతున్నారో కదా అని అనిపిస్తోంది. అంతేకాదు... ఈ తెల్లకోటు వేసుకున్న ఈ దేవుళ్లకు, దేవతలకు మనం ఏం ఇచ్చి రుణం తీర్చుకోగలం అనిపిస్తోంది. అందుకే.. భారతీయ పౌరులుగా మన వంతు బాధ్యత మనం నిర్వర్తిద్దాం.. ఇళ్లలోనే సురక్షితంగా ఉండి కరోనాను తరిమికొడదాం. అదే మనం వాళ్లకు ఇచ్చే అసలైన కానుక. అప్పటివరకు వాళ్లకు విశ్రాంతి లేదు... వాళ్ల మనసుకు మనశ్శాంతి ఉండదు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..