హైదరాబాద్‌లో గాలి జనార్థన్ రెడ్డి కోసం బెంగుళూరు పోలీసుల వేట

హైదరాబాద్‌లో గాలి జనార్థన్ రెడ్డి కోసం బెంగుళూరు పోలీసుల వేట

Last Updated : Nov 7, 2018, 04:50 PM IST
హైదరాబాద్‌లో గాలి జనార్థన్ రెడ్డి కోసం బెంగుళూరు పోలీసుల వేట

కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్‌రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లడం అనేక అనుమానాలకు తావిస్తోంది. బెంగళూరులో అంబిడెంట్ అనే కంపెనీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన ఆర్థిక నేరాల నుంచి ఆ కంపెనిని బయటపడేసేందుకు కంపెనీతో కలిసి ఓ అధికారికి కోటి రూపాయల లంచం ఇచ్చిన కేసులో నిందితుడిగా తాజాగా గాలి జనార్థన్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గాలి జనార్ధన్ రెడ్డి అంబిడెంట్ కంపెనీకి సహాయపడినందుకు ప్రతిఫలంగా ఆయనకు ఆ సంస్థ నుంచి 7 కిలోల బంగారు కడ్డీలు అందాయనేది ఆయనపై నమోదైన ఆరోపణ. 

ఈ కేసులో గాలి జనార్థన్ రెడ్డిని ప్రశ్నించేందుకు ప్రయత్నించిన బెంగళూరు పోలీసులకు ఆయన ఆచూకీ కనిపించలేదు. ఇదే కేసులో గాలి జనార్ధన్ రెడ్డితోపాటు ఆరోపణలు ఎదుర్కుంటున్న మరో అనుచరుడి ఆచూకీ కనిపించలేదు. అయితే, చివరిసారిగా వీళ్ల మొబైల్ సిగ్నల్స్ హైదరాబాద్‌లో లభించడంతో బెంగుళూరు పోలీసులు హైదరాబాద్ లో గాలింపు చేపట్టారు. 

Trending News