Ashish Misra: లఖింపుర్‌ కేరి హింసాత్మక ఘటనలో...కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్ర కుమారుడు ఆశిష్‌ అరెస్ట్‌

Lakhimpur Kheri Violence: లఖింపుర్‌ కేరి హింసాత్మక ఘటనలో నిందితుడిగా భావిస్తున్న కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్ర కుమారుడు ఆశిష్‌ మిశ్రను పోలీసులు అరెస్ట్ చేశారు.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 10, 2021, 12:47 PM IST
Ashish Misra: లఖింపుర్‌ కేరి హింసాత్మక ఘటనలో...కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్ర కుమారుడు ఆశిష్‌ అరెస్ట్‌

Lakhimpur Kheri Violence: లఖింపుర్‌ కేరి హింసాత్మక ఘటనలో నిందితుడిగా భావిస్తున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్ర(Ajay Misra) కుమారుడు ఆశిష్‌ మిశ్ర(Ashish Misra)ను పోలీసులు అరెస్టయ్యారు. ఉత్తరప్రదేశ్‌ పోలీసులు శనివారం రాత్రి 11 గంటలకు ఆశిష్‌ మిశ్రను అదుపులోకి  తీసుకున్నారు.

ఈ నెల 3న యూపీ(UP)లోని లఖింపుర్‌ ఖేరిలో సాగుచట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులపైకి ఆశిష్‌ మిశ్ర కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు రైతులు(Farmers) మృతిచెందారు. అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలో మరో నలుగురు మృతిచెందారు. దీంతో ఈ ఘటన ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సంచలనమైంది. రైతుల మృతిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఈ కేసులో ఆశిష్‌ మిశ్ర పేరును పోలీసులు చేర్చారు. 

Also Read: Lakhimpur Kheri violence : లఖింపుర్‌ ఖేరి ఘటనలో పోలీసుల ఎదుట ఆశిష్‌ మిశ్రా

విచారణకు ఆశిష్ సహకరించడం లేదు: పోలీసులు
ఇందులో భాగంగా ఈ హింసాత్మక ఘటన(Lakhimpur Kheri Violence)కు సంబంధించి ఆశిష్‌ మిశ్ర విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే శుక్రవారమే అతడు పోలీసుల ఎదుట హాజరుకావాల్సి ఉండగా, అనారోగ్య కారణాలతో హాజరుకాలేకపోయాడని ఆయన తండ్రి అజయ్‌ మిశ్ర తెలిపారు. ఈ నేపథ్యంలో శనివారం క్రైం బ్రాంచ్‌ పోలీసుల ఎదుట ఆశిష్‌(Ashish Misra) హాజరయ్యారు. దీంతో పోలీసులు అశిష్‌ మిశ్రాను 11 గంటల పాటు ప్రశ్నించారు. అనంతరం అరెస్ట్‌ చేశారు. అయితే విచారణలో ఆశిష్‌ మిశ్ర సహకరించలేదని పోలీసులు తెలిపారు. మేం అడిగిన ప్రశ్నలకు అతను సరైన సమాధానాలు ఇవ్వలేదన్నారు. ఆశిష్‌ మిశ్రను కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. 

భాజపాపై ప్రతిపక్షాలు విమర్శలు
అయితే ఈ ఘటనపై మంత్రి అజయ్‌ మిశ్రా మాత్రం మరోలా చెబుతున్నారు. తన కుమారుడు సంఘటన స్థలంలో లేడని అంటున్నారు. అంతేకాదు నిరూపించడానికి తన వద్ద ఫోటో, వీడియో ఆధారాలు ఉన్నాయన్నారు. ఈ ఘటన జరిగే సమయంలో తన కుమారుడు ఉప ముఖ్యమంత్రి వేదిక వద్ద ఉన్నారని, వేలాది మంది ప్రజలు, పోలీసు అధికారులు కూడా అక్కడే ఉన్నారని పేర్కొన్నారు. మరోవైపు లఖింపూర్ ఖేరీ ఘటనపై ప్రతి పక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాల(Farm laws)కు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న రైతులపై కేంద్ర మంత్రి కొడుకు కారెక్కించడం దారుణమంటున్నారు. కాంగ్రెస్, బిఎస్‌పి, ఎస్‌పి సహా అన్ని రాజకీయ పార్టీలు బీజేపీ తీరును ఎండగడుతున్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News