Supreme court: గుజరాత్, ఢిల్లీ ప్రభుత్వాలపై ఆగ్రహం, కోవిడ్ నియంత్రణపై నివేదిక కోరిన కోర్టు

కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ నేపధ్యంలో సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహానికి లోనైంది. గుజరాత్, ఢిల్లీ ప్రభుత్వాలపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కోవిడ్ నియంత్రణపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

Last Updated : Nov 23, 2020, 12:29 PM IST
  • పెరుగుతున్న కోవిడ్ కేసుల నేపధ్యంలో ఢిల్లీ, గుజరాత్ ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం
  • కోవిడ్ నియంత్రణకై తీసుకుంటున్న చర్యలపై నివేదిక కోరిన కోర్టు
  • డిసెంబర్లో పరిస్థితిని నియంత్రించకపోతే..తీవ్ర పరిణామాలు ఎదుర్కోవల్సి వస్తుందంటూ హెచ్చరిక
Supreme court: గుజరాత్, ఢిల్లీ ప్రభుత్వాలపై ఆగ్రహం, కోవిడ్ నియంత్రణపై నివేదిక కోరిన కోర్టు

కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ నేపధ్యంలో సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహానికి లోనైంది. గుజరాత్, ఢిల్లీ ప్రభుత్వాలపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కోవిడ్ నియంత్రణపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది.

కరోనా వైరస్ ( Corona virus ) మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. ముఖ్యంగా శీతాకాలం కావడంతో ఉత్తరాదిన ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ఈ నేపధ్యంలో గుజరాత్ ( Gujarat ), ఢిల్లీ ( Delhi) ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు ( Supreme court ) తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కోవిడ్ 19 వైరస్ కట్టడికై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో...ఓ నివేదిక అందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. డిసెంబర్ నెలలో కరోనా మరింత తీవ్రరూపం దాల్చకముందే..జాగ్రత్త పడాలని సూచించింది. దేశంలోని మిగిలిన రాష్ట్రాలకు కూడా ఇవే ఆదేశాలు జారీ చేసింది. కరోనాపై సమర్ధవంతమైన పోరాటం కోసం కేంద్రం నుంచి ఎటువంటి సహాయం ఆశిస్తున్నాయో చెప్పాలని కోర్టు రాష్ట్ర ప్రభుత్వాల్ని కోరింది. 

రాష్ట్ర ప్రభుత్వాలు నివేది ( State governments to submitt reports ) సమర్పించేందుకు కేవలం 2 రోజుల గడువిచ్చింది కోర్టు. జస్టిస్ అశోక్ భూషణ్, ఆర్ఎస్ రెడ్డి, ఎంఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. కరోనా మహమ్మారిపై యుద్ధానికి పూర్తి స్థాయిలో సిద్ధం కాకపోతే..డిసెంబర్ నెలలో అత్యంత ఘోరమైన, విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కోవల్సి వస్తుందని కోర్టు హెచ్చరించింది.

ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, అస్సోంలలో గత కొద్దిరోజులుగా అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.  ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కోవిడ్ 19 నిబంధనల్ని కఠినం చేశారు. గత 24 గంటల్లో దేశంలో 44 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. Also read: Congress party: ఇక పార్టీకు అధికారం కష్టమే: గులాం నబీ ఆజాద్

Trending News