Gold Rate Today: స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate Today In India) , వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. బంగారం, వెండి ధరలపై పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలు ప్రభావం చూపిస్తాయి. అంతర్జాతీయ ముడి చమురు ధరలు సైతం బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి.

Last Updated : Oct 5, 2020, 07:47 AM IST
  • బులియన్ మార్కెట్‌లో స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు
  • కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో పెరుగుతున్న బంగారం, వెండి ధరలు
  • ప్రస్తుతం 1 కేజీ వెండి ధర రూ.61,210కి ఎగసింది
Gold Rate Today: స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు

బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate Today) స్వల్పంగా పెరిగాయి. వెండి సైతం బంగారం బాటలోనే పయనిస్తోంది. హైదరాబాద్‌ (Gold Price Today In Hyderabad), విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.150 మేర స్వల్పంగా పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.52,910 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,510కి పెరిగింది.

దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లోనూ బంగారం ధరలు (Gold Rate in Delhi) స్వల్పంగా పెరుగుతున్నాయి. తాజాగా రూ.120 మేర పసిడి ధర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.53,790కి పెరిగింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,310గా ఉంది.

బులియన్ మార్కెట్‌లో వెండి ధర (Silver Rate in India) స్వల్పంగా పెరిగింది. తాజాగా వెండి ధర రూ.500 మేర పెరిగింది. ప్రస్తుతం 1 కేజీ వెండి ధర రూ.61,210కి ఎగసింది. దేశ వ్యాప్తంగా వెండి ఇదే ధర వద్ద మార్కెట్ అవుతుంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News