Nandamuri Vasundhara: FNCC తంబోలా విజేతకు మెర్సిడీస్ బెంజ్ కారు బహుమతి అందించిన నందమూరి వసుంధర..

Nandamuri Vasundhara: ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో జరిగిన బంపర్ తంబోలా ఎంతో ఉత్సాహాభరితంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తంబోలా విజేతకు మెర్సిడెస్ బెంజ్ కారును నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధరా చేతులు మీదుగా మెర్సిడీస్ బెంజ్ కారును బహుమతి ప్రధానోత్సవం ఘనంగా జరిగింది.  

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 3, 2024, 07:36 PM IST
Nandamuri Vasundhara: FNCC తంబోలా విజేతకు మెర్సిడీస్ బెంజ్ కారు బహుమతి అందించిన నందమూరి వసుంధర..

Nandamuri Vasundhara: ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో బంపర్ తంబోలా కార్యక్రమం ఎంతో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో  ఎఫ్.ఎన్.సి.సీ  సభ్యులు ,వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ .. అతిథులు మరియు మహిళలు అధిక సంఖ్యలో ఈ బంపర్ తంబోలా ఆటలో పాల్గొన్నారు . ఈ బంపర్ తంబోలాలో గెలిచినా వారికీ 5 రౌండ్స్ ఐదు కార్లు బహుబతిగా ఇచ్చారు. అందులో  ఆల్టో ,సెలెరియో,టాటా టియాగో ,టొయోట గ్లాంజా మరియు బంపర్ ప్రైజ్ గా మెర్సిడీస్  బెంజ్ ఎ క్లాస్ అందజేశారు. ఈ తోంబోలా కార్యక్రమంలో  సత్నం కౌర్, డి. సాయికిరణ్ మొదటి బహుమతిగా మెర్సిడీస్ బెంజ్ కారు గెలుచుకున్నారు.  బంపర్ తంబోలా విన్నర్స్ కు సెక్రటరీ ముళ్ళపూడి మోహన్, వైస్ ప్రెసిడెంట్ తుమ్మల రంగ రావు, మరియు నందమూరి వసుంధర  చేతుల మీదుగా బహుమతులు అందజేసారు. ఈ కార్యక్రమంలో సభ్యులు కాజా సూర్యనారాయణ, శైలజ జుజాల, బాలరాజు, గోపాల రావు, ఏడిద రాజా, మోహన్ వడ్లపట్ల, సామ ఇంద్రపాల్ రెడ్డి, తంబోలా కమిటీ సభ్యులు స్వరూప, చేతనా, రోహిణి, శైలజ, హకీమ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి స్పాన్సర్స్ నవనామి - మెగాలియో, డి ఎస్ ఆర్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్, సన్ షైన్ డెవలపర్స్, మెర్సిడీస్ బెంజ్ సిల్వర్ స్టార్, శ్రీ మిత్ర టౌన్ షిప్, కిమ్స్ హాస్పిటల్స్, ప్రజ్ఞ హాస్పిటల్స్, ఎన్ఎస్ఎల్ ఇన్ఫ్రాటెక్, హర్ష ఆటో, మందిర్, ప్రకృతి ఎవెన్యూస్ & వంశీరాం బిల్డర్స్ తదితరులు  పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సెక్రటరీ ముళ్లపూడి మోహన్ మాట్లాడుతూ..
గతంలో కూడా మేము ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేశామన్నారు.  అప్పుడున్న కమిటీ ప్రస్తుత కమిటీ సపోర్ట్ ద్వారానే ఇది అంతా జరుగుతోందన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా మెంబెర్స్  రిలాక్సేషన్ లభిస్తుందన్నారు. ఇంకా ముందు ముందు కూడా ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఎఫ్ ఎన్ సి సి ని భారత్ లోనే నెంబర్ వన్ క్లబ్ గా తీర్చిదిద్దుతామన్నారు. కమిటీ సభ్యుల సహాకారంతో మరిన్ని మంచి కార్యక్రమాలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి అలాగే స్పాన్సర్ చేసిన స్పాన్సర్స్ కి ధన్యవాదాలు తెలియజేసారు. ఈ కార్యక్రమానికి పిలవగానే వచ్చి సపోర్ట్ చేసిన నందమూరి వసుంధరకి నా తరఫున మా కమిటీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామన్నారు.

Also Read: Kavya Maran Crying: గుండెల్ని పిండేసే సన్నివేశం.. కన్నీళ్లు పెట్టుకున్న కావ్య పాప

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News