Income Tax Deadline: ఇన్‌కంటాక్స్ డెడ్ లైన్ అయిపోయింది, ఇక పెనాల్టీ ఎంత చెల్లించాలో తెలుసా

Income Tax Deadline: ఇన్‌కంటాక్స్ రిటర్న్స్ దాఖలు అనేది చాలా ముఖ్యం. ఇప్పటికే కొంతమంది ట్యాక్స్ పేయర్లు దీనికి సంబంధించిన గడువు తేదీ ముగిసిపోయింది. ఇంకొంతమందికి ఓ నెలే మిగిలుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 3, 2023, 01:32 PM IST
Income Tax Deadline: ఇన్‌కంటాక్స్ డెడ్ లైన్ అయిపోయింది, ఇక పెనాల్టీ ఎంత చెల్లించాలో తెలుసా

Income Tax Deadline: మీరు ట్యాక్స్ పేయర్ అయితే ఈ సమాచారం మీ కోసమే. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేందుకు చివరి తేదీ ముగిసిపోయింది. సెప్టెంబర్ 30 తేదీకు ఇన్‌కంటాక్స్ ఆడిట్ రిపోర్ట్ సమర్పించే గడువు కాస్తా ముగిసిపోయింది. ఇప్పుడిక మిగిలింది అక్టోబర్ 31 మాత్రమే. అయితే దీనికి పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. 

ఇన్‌కంటాక్స్ చట్టం సెక్షన్ 44 ఏబీ ప్రకారం మీరు ఏదైనా వ్యాపారం చేస్తూ ఉండి..ఏడాది టర్నోవర్ 1 కోటి రూపాయలు దాటితే ట్యాక్స్ ఆడిట్ సమర్పించాల్సి ఉంటుంది. సెక్షన్ 44 ఏడీ ప్రకారం ప్రీసంప్టివ్ ట్యాక్సేషన్ ప్రయోజనం పొంది ఉంటే టర్నోవర్ 2 కోట్లకంటే తక్కువ ఉంటే ఆడిట్ చేయాల్సిన అవసరం లేదు. 

ట్యాక్స్ ఆడిట్ సమర్పించేందుకు క్యాష్ బుక్ అవసరమౌతుంది. పేమెంట్లకు సంబంధించిన అన్ని క్యాష్ రిసీప్టులు భద్రపర్చుకోవాలి. ఇది కాకుండా మెర్కంటైల్ ఎక్కౌంటింగ్ సిస్టమ్‌కు సంబంధించిన జర్నల్ బుక్ ఉండాలి. డెబిట్-క్రెడిట్ వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేసే లెడ్జర్ బుక్ అవసరం.  అంతేకాదు..అన్ని బిల్స్ జిరాక్స్ కాపీలు అవసరం. అంటే నగదు లావాదేవీలకు సంబంధించిన ప్రతి డాక్యుమెంట్ అవసరం. 

ట్యాక్స్ ఆడిట్ విషయానికొస్తే రెండు కీలక విషయాలు గుర్తుంచుకోవాలి. మొదటిది ఆడిట్ రిపోర్ట్. ఇందులో సెప్టెంబర్ 30 లోగా ఆడిట్ పూర్తి చేయాల్సి ఉంటుంది. రెండవది ఐటీఆర్ ఫైల్ చేయడం. దీనికి చివరి తేదీ అక్టోబర్ 31. ట్యాక్స్ ఆడిట్ చేసేవారికే ఐటీ రిటర్స్స్ ఉంటుంది. లేకపోతే ఐటీ రిటర్న్స్ అనేది డిఫెక్టివ్‌గా పరిగణించబడి..ఐటీ నుంచి సెక్షన్ 139 ప్రకారం నోటీసు వస్తుంది. గడువు తేదీలోగా రిటర్న్స్ ఫైల్ చేయకపోతే పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. 

ఇన్‌కంటాక్స్ చట్టం ప్రకారం ఆడిట్ రిపోర్ట్ ఆలస్యమైతే మొత్తం టర్నోవర్‌పై లేదా అమ్మకాలపై 0.5 శాతం పెనాల్టీ పడుతుంది. గరిష్టంగా ఈ పెనాల్టీ 1.5 లక్షల రూపాయలుంటుంది. 

Also read: Honda Activa Limited Edition:హోండా యాక్టివా లిమిటెడ్ ఎడిషన్..రూ.80,734 ధరకే అందుబాటులో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News