Mohammed Shami on Hardik Pandya: ఐపీఎల్ 2024 కోసం గుజరాత్ టైటాన్స్ జట్టును వీడి ముంబై ఇండియన్స్‌తో చేరిన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాపై టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీ హాట్ కామెంట్స్ చేశాడు. పాండ్యా జీవిత కాలం ఒకే ఫ్రాంచైజీతో ముడిపడి ఉండలేడు కదా అన్నాడు. జట్టు నుంచి ఎవరు వెళ్లిపోయినా పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నాడు. గుజరాత్ టైటాన్స్ నుంచి పాండ్యా నిష్క్రమణతో జట్టుపై ఎలాంటి ప్రభావం చూపుతుందని ఓ జర్నలిస్టు షమీని ప్రశ్నించగా.. ఇలా చెప్పుకొచ్చాడు. "హార్దిక్ పాండ్యా ఫ్రాంచైజీని విడిచిపెట్టినా ఎవరూ పట్టించుకోరు. పాండ్యా వెళ్లిపోవాలనుకున్నాడు. అతను కెప్టెన్‌గా బాగా రాణించాడు. పాండ్యా కెప్టెన్సీలో గుజరాత్ రెండుసార్లు ఫైనల్‌కు చేరుకుంది. ఒకసారి టైటిల్‌ను కూడా గెలుచుకుంది. అతను జీవితకాలం గుజరాత్‌తో ముడిపడి ఉండలేడు.." అని షమీ సమాధానం ఇచ్చాడు. ప్రస్తుతం షమీ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
హార్దిక్ పాండ్యా జట్టు నుంచి వెళ్లిపోవడంతో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్సీ బాధ్యతలను శుభ్‌మన్ గిల్‌కు అప్పగించింది. కెప్టెన్‌గా గిల్ కూడా అనుభవం సంపాదించుకుంటాడని షమీ అన్నాడు. భవిష్యత్‌లో గిల్ కూడా మరో ఫ్రాంచైజీకి ఆడే అవకాశం ఉందన్నాడు. ఇది ఆటలో భాగమని.. ఎవరినీ ఎవరు ఆపలేరని పేర్కొన్నాడు.
ఈ ఏడాది ఐపీఎల్ మినీ వేలానికి ముందే గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్థిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ ట్రెడింగ్ చేసింది. అనంతరం హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ స్థానంలో జట్టు పగ్గాలను కూడా అప్పగించింది. ఈ నిర్ణయంపై రోహిత్ శర్మ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. లక్షలాది మంది ఫ్యాన్స్ ముంబై ఇండియన్స్ సోషల్ మీడియా అకౌంట్స్‌ను అన్ ఫాలో చేశారు. పాండ్యా రాకతో గత సీజన్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడిన ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ జట్టును వీడాల్సి వచ్చింది.
గ్రీన్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ట్రెడింగ్‌లో తీసుకుంది. హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్‌తో తన ఐపీఎల్ కెరీర్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2015 సీజన్‌లో తొలిసారి ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన హార్ధిక్ పాండ్యా.. ప్రస్తుతం కోలుకునే పనిలో ఉన్నాడు. ఐపీఎల్ ప్రారంభమయ్యే నాటికి పూర్తి ఫిట్‌నెస్ సాధించాలని పట్టుదలతో ఉన్నాడు.
Also Read: MLC Elections 2024: ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. ఆ ఇద్దరికే ఛాన్స్
Also Read: CM Revanth Reddy: తెలంగాణకు అరుదైన అవకాశం.. హైదరాబాద్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సీ4ఐఆర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter